హోమ్ /వార్తలు /క్రీడలు /

IND vs PAK : కోహ్లీ దెబ్బకు కింద పడిపోయిన రోహిత్.. కొద్దిలో తప్పిన ప్రమాదం.. వీడియో వైరల్

IND vs PAK : కోహ్లీ దెబ్బకు కింద పడిపోయిన రోహిత్.. కొద్దిలో తప్పిన ప్రమాదం.. వీడియో వైరల్

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ (ఫైల్ ఫోటో)

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ (ఫైల్ ఫోటో)

Asia Cup 2022 - IND vs PAK : ఆసియా కప్ (Asia Cup) 2022లో భాగంగా ఆదివారం పాకిస్తాన్ (Pakistan), భారత్ (India) జట్ల మధ్య హై వోల్టేజీ మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. చివరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్ లో టీమిండియా (Team India) 5 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Asia Cup 2022 - IND vs PAK : ఆసియా కప్ (Asia Cup) 2022లో భాగంగా ఆదివారం పాకిస్తాన్ (Pakistan), భారత్ (India) జట్ల మధ్య హై వోల్టేజీ మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. చివరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్ లో టీమిండియా (Team India) 5 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. హార్దిక్ పాండ్యా (Hardik Pandya) ఆల్ రౌండ్ షోతో మెరిసి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును అందుకున్నాడు. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా విరాట్ కోహ్లీ (virat Kohli), రోహిత్ శర్మ (Rohit Sharma)ల మధ్య జరిగిన ఓ సంఘటన నవ్వులు పూయించింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్  మీడియాలో వైరల్ అవుతుంది.


భారత్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఇన్నింగ్స్ ఏడో ఓవర్ ను వేయడానికి షాదబ్ ఖాన్ వచ్చాడు. అతడి బౌలింగ్‌లో కోహ్లి లాంగ్‌ ఆన్‌ దిశగా భారీ షాట్‌ ఆడటానికి ప్రయత్నించాడు. బంతి నేరుగా నాన్ స్ట్రయికింగ్ ఎండ్ లో ఉన్న రోహిత్ శర్మ మీదకు దూసుకెళ్లింది. వేగంగా బంతి రావడంతో ఒక్కసారిగా షాక్ కు గురైన రోహిత్ శర్మ.. చేతిని అడ్డుపెట్టాడు. బంతి నేరుగా రోహిత్ శర్మ చేతికి తగిలి పక్కకు వెళ్లిపోగా.. అతడు మాత్రం నేలపై పడిపోయాడు. వెంటనే తేరుకొని పరుగు పూర్తి చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఎందుకు ఆలస్యం మీరూ చూసేయండి.




ఇక మ్యాచ్ విషయానికి వస్తే చివరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్ లో భారత్ ఆల్ రౌండ్ షోతో అదరగొట్టింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు దిగిన పాకిస్తాన్ 19.5 ఓవర్లలో 147 పరుగులు మాత్రమే చేసింది. భువనేశ్వర్ కుమార్ 4 వికెట్లు తీయగా.. హార్దిక్ పాండ్యా 3 వికెట్లు తీశాడు. పాకిస్తాన్ తరఫున మొహమ్మద్ రిజ్వాన్ (42 బంతుల్లో 43; 4 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఇఫ్తిఖర్ అహ్మద్ (22 బంతుల్లో 28; 2 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించాడు. అర్ష్ దీప్ సింగ్, అవేశ్ ఖాన్ లకు ఒక్కో వికెట్ లభించింది.


148 పరుగుల విజయలక్ష్యాన్ని భారత్ 5 వికెట్లు కోల్పోయి 19.4 ఓవర్లలో ఛేదించింది. రవీంద్ర జడేజా (29 బంతుల్లో 35; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), విరాట్ కోహ్లీ (34 బంతుల్లో 35; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. అయితే హార్దిక్ (17 బంతుల్లో 33 నాటౌట్, 4 ఫోర్లు, 1 సిక్స్) భారత్ కు అద్బుత విక్టరీని అందించాడు. పాకిస్తాన్ బౌలర్లలో నవాజ్ మూడు వికెట్లు తీశాడు. తొలి మ్యాచ్ ఆడుతున్న నసీం షా రెండు వికెట్లతో సత్తా చాటాడు. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ను నసీం షా వణికించాడు. తొలి ఓవర్ లోనే కేఎల్ రాహుల్ (0)ను గోల్డెన్ డక్ చేశాడు. అదే ఓవర్ లో కోహ్లీ అవుటయ్యే ప్రమాదం నుంచి బయటపడ్డాడు. రోహిత్ శర్మ (12) విఫలం అయ్యాడు. సూర్యకుమార్ యాదవ్ (18) కీలక సమయంలో పెవిలియన్ కు చేరాడు. అయితే జడేజా, హార్దిక్ పాండ్యా జట్టును ఆదుకున్నారు. వీరు ఐదో వికెట్ కు 42 పరుగులు జోడించారు. జడేజా చివరి ఓవర్లో అవుటైనా హార్దిక్ పాండ్యా లాంఛనం పూర్తి చేశాడు.

Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Asia Cup 2022, Dinesh Karthik, Hardik Pandya, IND vs PAK, India VS Pakistan, Rishabh Pant, Rohit sharma, Virat kohli

ఉత్తమ కథలు