హోమ్ /వార్తలు /క్రీడలు /

IND vs PAK : ‘ఒక పెగ్ వేస్తే ఇలానే ఉంటది’.. టాస్ సమయంలో ఘోర తప్పిదం చేసిన రవిశాస్త్రి.. వీడియోనే సాక్ష్యం

IND vs PAK : ‘ఒక పెగ్ వేస్తే ఇలానే ఉంటది’.. టాస్ సమయంలో ఘోర తప్పిదం చేసిన రవిశాస్త్రి.. వీడియోనే సాక్ష్యం

PC : TWITTER

PC : TWITTER

Asia Cup 2022 - IND vs PAK : భారత్ (India), పాకిస్తాన్ (Pakistan) జట్లు మరోసారి థ్రిల్లింగ్ పర్ఫామెన్స్ తో క్రికెట్ లవర్స్ ను కట్టిపడేశాయి. ఆసియా కప్ (Asia cup) 2022లో భాగంగా జరిగిన సూపర్ 4 మ్యాచ్ లో భారత్, పాక్ జట్లు మరోసారి తలపడ్డాయి.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Asia Cup 2022 - IND vs PAK : భారత్ (India), పాకిస్తాన్ (Pakistan) జట్లు మరోసారి థ్రిల్లింగ్ పర్ఫామెన్స్ తో క్రికెట్ లవర్స్ ను కట్టిపడేశాయి. ఆసియా కప్ (Asia cup) 2022లో భాగంగా జరిగిన సూపర్ 4 మ్యాచ్ లో భారత్, పాక్ జట్లు మరోసారి తలపడ్డాయి. దుబాయ్ వేదికగా ఈ మ్యాచ్ జరగ్గా.. ఈసారి ఫలితం భారత్ కు వ్యతిరేఖంగా వచ్చింది. అయితే ఈ మ్యాచ్ టాస్ సందర్భంలో గందరగోళం నెలకొంది. టాస్ వ్యాఖ్యాతగా భారత మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి (Ravi Shastri) వచ్చాడు. టాస్ ను రోహిత్ శర్మ (Rohit Sharma) వేయగా.. బాబర్ ఆజం (Babar Azam) టెయిల్స్ అంటూ పలికాడు. కానీ.. రవిశాస్త్రి మాత్రం హెడ్స్ అంటూ మైక్ లో చెప్పాడు. ప్రస్తుతం ఇదే సోషల్ మీడియాలో రచ్చకు తావిచ్చింది.

ఇక టాస్ లో బాబర్ ఆజం గెలిచాడు. అయితే అక్కడ హెడ్స్ పడిందా.. లేక టెయిల్స్ పడిందా అనేది సుస్ఫష్టంగా ఉంది. ఆసియా కప్ లో టాస్ కీలక పాత్ర పోషిస్తుందన్న సంగతి తెలిసిందే. హాంకాంగ్ ఆడిన మ్యాచ్ లను మినహాయిస్తే ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్ ల్లో రెండోసారి బ్యాటింగ్ చేసిన జట్టే విజయాలను సాధిస్తూ వస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో కామెంటరీలో ఎంతో అనుభవం ఉన్న రవిశాస్త్రి టాస్ విషయంలో ఇంత నిర్లక్ష్యంగా ఎలా ఉంటాడు. టాస్ విషయంలో రవిశాస్త్రిని భారత అభిమానులతో పాటు క్రికెట్ ఫ్యాన్స్ తీవ్రంగా విమర్శిస్తున్నారు. మరికొందరు ‘పెగ్ వేసి టాస్ కు వస్తే ఇలానే ఉంటుంది’అని వ్యంగ్యంగా చమత్కరిస్తున్నారు.

Babar Azam calls tail, Ravi Shastri is in his own world & calling heads is the call. ????????#INDvsPAKpic.twitter.com/74GLu62nG1

ఇక మ్యాచ్ విషయానికి వస్తే భారత్ 5 వికెట్ల తేడాతో పాకిస్తాన్ చేతిలో ఓడింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ (44 బంతుల్లో 60; 4 ఫోర్లు, 1 సిక్స్) బ్యాక్ టు బ్యాక్ అర్ధ సెంచరీలు సాధించాడు. ఓపెనర్లు రోహిత్ శర్మ (16 బంతుల్లో 28; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), కేఎల్ రాహుల్ (20 బంతుల్లో 28; 1 ఫోర్, 2 సిక్సర్లు) రాణించారు. పాకిస్తాన్ బౌలర్లలో షాదబ్ ఖాన్ 2 వికెట్లు తీశాడు.

అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ 19.5 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి 182 పరుగులు చేసి నెగ్గింది. మొహమ్మద్ రిజ్వాన్ (51 బంతుల్లో 71; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) మరోసారి అర్ధ శతకంతో రాణించాడు. మొహమ్మద్ నవాజ్ (20 బంతుల్లో 42; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) మ్యాచ్ గతిని మార్చే ఇన్నింగ్స్ ఆడాడు. అదే సమయంలో కీలక సమయాల్లో భారత్ చెత్త బౌలింగ్, ఫీల్డింగ్ కూడా పాకిస్తాన్ కు కలిసొచ్చింది. భారత్ తన తదుపరి మ్యాచ్ ను సెప్టెంబర్ 6న శ్రీలంకతో ఆడనుంది.

Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Asia Cup 2022, Babar Azam, Dinesh Karthik, Hardik Pandya, IND vs PAK, India VS Pakistan, Ravi Shastri, Rishabh Pant, Rohit sharma, Team India, Virat kohli

ఉత్తమ కథలు