హోమ్ /వార్తలు /క్రీడలు /

IND vs PAK : టీమిండియా విజయంపై ప్రధాని మోదీ ట్వీట్.. ఏమన్నారంటే?

IND vs PAK : టీమిండియా విజయంపై ప్రధాని మోదీ ట్వీట్.. ఏమన్నారంటే?

ప్రధాని మోదీ (ఫైల్ ఫోటో)

ప్రధాని మోదీ (ఫైల్ ఫోటో)

Asia Cup 2022 - IND vs PAK :  ఆసియా కప్ (Asia Cup) 2022లో భాగంగా పాకిస్తాన్ (Pakistan)తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా (Team India) అద్భుత విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ విజయంపై భారత దేశ ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi)ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఆయన ఏమన్నారంటే..

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Asia Cup 2022 - IND vs PAK :  భారత్ (India), పాకిస్తాన్ (Pakistan) మ్యాచ్ కు అంత క్రేజ్ ఎందుకు ఉంటుందో ఆదివారం జరిగిన మ్యాచ్ ను చూస్తే ఇట్టే అర్థం అవుతుంది. భారీ స్కోర్లు నమోదు కాకపోయినా చివరి ఓవర్ వరకు సాగిన ఈ మ్యాచ్ లో టీమిండియా (Team India) ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) ఖతర్నాక్ ప్రదర్శనతో రెచ్చిపోయాడు. ఆఖరి ఓవర్ లో భారత్ విజయానికి 7 పరుగులు అవసరం అయిన తరుణంలో ఎటువంటి ఒత్తిడికి గురి కాని హార్దిక్ కూల్ గా తన పనిని పూర్తి చేశాడు. పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో భారత్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 148 పరుగుల విజయలక్ష్యాన్ని భారత్ 5 వికెట్లు కోల్పోయి 19.4 ఓవర్లలో ఛేదించింది. రవీంద్ర జడేజా (29 బంతుల్లో 35; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), విరాట్ కోహ్లీ (34 బంతుల్లో 35; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. అయితే హార్దిక్ (17 బంతుల్లో 33 నాటౌట్, 4 ఫోర్లు, 1 సిక్స్) భారత్ కు అద్బుత విక్టరీని అందించాడు. పాకిస్తాన్ బౌలర్లలో నవాజ్ మూడు వికెట్లు తీశాడు. తొలి మ్యాచ్ ఆడుతున్న నసీం షా రెండు వికెట్లతో సత్తా చాటాడు.


ఈ విజయంపై దేశ ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. కలిసి కట్టుగా అద్భుత విజయం సాధించిందని పేర్కొన్నారు. ‘ఆసియా కప్ 2022లో పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో భారత జట్టు ఆల్ రౌండ్ షోతో అద్భుత విజయాన్ని సాధించింది. విజయం సాధించినందకు అభినందనలు’ అంటూ మోదీ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.
హార్దిక్ సూపర్ సిక్స్


ఆఖరి ఓవర్ లో 7 పరుగులు చేయాల్సిన తరుణంలో నవాజ్ వేసిన తొలి బంతికి రవీంద్ర జడేజా బౌల్డ్ అయ్యాడు. క్రీజులోకి వచ్చిన దినేశ్ కార్తీక్ సింగిల్ తీసి హార్దిక్ కు స్ట్రయికింగ్ వచ్చేలా చేశాడు. మూడో బంతిని హార్దిక్ కవర్స్ లోకి ఆడగా.. నేరుగా ఫీల్డర్ చేతిలోకి వెళ్లింది. పరుగు కోసం దినేశ్ కార్తీక్ ప్రయత్నించినా వద్దంటూ హార్దిక్ వారించాడు. మూడు బంతులు పూర్తి అయ్యాక.. భారత్ విజయం కోసం 6 పరుగుల దూరంలో నిలిచింది. నాలుగో బంతిని లాంగాన్ దిశలో సిక్సర్ బాదిన హార్దిక్ భారత్ కు అద్బుత విజయాన్ని ఖాయం చేశాడు. దాంతో భారత్ 5 వికెట్ల తేడాతో పాకిస్తాన్ పై ఘనవిజయం సాధించింది.అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు దిగిన పాకిస్తాన్ 19.5 ఓవర్లలో 147 పరుగులు మాత్రమే చేసింది. భువనేశ్వర్ కుమార్ 4 వికెట్లు తీయగా.. హార్దిక్ పాండ్యా 3 వికెట్లు తీశాడు. పాకిస్తాన్ తరఫున మొహమ్మద్ రిజ్వాన్ (42 బంతుల్లో 43; 4 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఇఫ్తిఖర్ అహ్మద్ (22 బంతుల్లో 28; 2 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించాడు. అర్ష్ దీప్ సింగ్, అవేశ్ ఖాన్ లకు ఒక్కో వికెట్ లభించింది.

Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Asia Cup 2022, Babar Azam, Dinesh Karthik, Hardik Pandya, IND vs PAK, India VS Pakistan, Narendra modi, Pm modi, PM Narendra Modi, Rohit sharma, Team India, Virat kohli

ఉత్తమ కథలు