హోమ్ /వార్తలు /క్రీడలు /

IND vs PAK: ఇండియా-పాకిస్థాన్‌ మ్యాచ్‌లో స్లెడ్జింగ్ వేరే లెవల్.. ప్లేయర్ల మధ్య జరిగిన టాప్ 5 ఫైట్స్ ఇవే.. (వీడియోలు)

IND vs PAK: ఇండియా-పాకిస్థాన్‌ మ్యాచ్‌లో స్లెడ్జింగ్ వేరే లెవల్.. ప్లేయర్ల మధ్య జరిగిన టాప్ 5 ఫైట్స్ ఇవే.. (వీడియోలు)

Ind Vs Pak (Twitter)

Ind Vs Pak (Twitter)

IND vs PAK: క్రికెట్‌(Cricket)లో ఇండియా-పాకిస్థాన్‌ (India-Pakistan) మధ్య జరిగే మ్యాచ్‌లు ఒక యుద్ధాన్ని తలపిస్తాయంటే అతిశయోక్తి కాదు. నరాల తెగే ఉత్కంఠకు కేరాఫ్ అడ్రస్ ఈ మ్యాచులు.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

క్రికెట్‌(Cricket)లో ఇండియా-పాకిస్థాన్‌ (India vs Pakistan) మధ్య జరిగే మ్యాచ్‌లు ఒక యుద్ధాన్ని తలపిస్తాయంటే అతిశయోక్తి కాదు. పాక్ ప్లేయర్స్ మాటల యుద్ధానికి దిగడం.. దాంతో ఆవేశపూరితంగా బ్యాట్‌తో లేదా బాల్‌తో ఇండియన్ ప్లేయర్లు (Indian Players) దీటైన సమాధానం చెప్పడం వంటి దృశ్యాలు ఈ మ్యాచ్‌లో ఎక్కువగా కనిపిస్తుంటాయి. అందుకే ఈ మ్యాచ్‌లు బంతి బంతికి అత్యంత ఉత్కంఠభరితంగా సాగుతాయి. ఇరుదేశాల అభిమానులు ఈ టీమ్స్ మధ్య మ్యాచ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు.


అయితే యూఏఈ(UAE) వేదికగా త్వరలోనే ప్రారంభం కానున్న ఆసియా కప్‌ (Asia Cup)లో రెండు దేశాలు మళ్లీ తలపడేందుకు సిద్ధమవుతున్నాయి. దాంతో ఫ్యాన్స్ ఎగ్జైట్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ రెండు జట్టు తలపడినప్పుడు ప్లేయర్ల మధ్య చోటు చేసుకున్న తీవ్ర మాటల యుద్ధాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.* వెంకటేష్ ప్రసాద్ vs అమీర్ సోహైల్
1996లో బెంగళూరు వేదికగా ఐసీసీ వరల్డ్ కప్ జరిగింది. ఈ టోర్నమెంట్‌లో సెమీ-ఫైనల్‌కి వెళ్లేందుకు పాక్ వర్సెస్ ఇండియా తలపడ్డాయి. ఈ క్వార్టర్ ఫైనల్స్‌లో పాక్‌ తొలుత బ్యాటింగ్ చేసింది. టీమిండియా బౌలర్ వెంకటేష్ ప్రసాద్‌ బౌల్‌ చేసిన 15వ ఓవర్‌లో పాక్ బ్యాటర్ అమీర్ సోహైల్ ఒక బౌండరీ కొట్టాడు. ఆపై వెంకటేష్ ప్రసాద్‌ను సైగలతో బెదిరిస్తూ మళ్లీ ఇదే బౌండరీ రిపీట్ అవుతుందని ఒక విలన్ లెవెల్లో చెప్పాడు. దీనికి మన ప్లేయర్ మాటలతో కాకుండా చేతల్లో బదులిచ్చాడు. ఆ తర్వాతి డెలివరీలోనే సొహైల్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఈ ఫైట్ క్రికెట్ చరిత్రలో మర్చిపోలేనిదిగా నిలిచింది.


* గౌతమ్ గంభీర్ వర్సెస్ షాహిద్ అఫ్రిది

2007లో కాన్పూర్ వేదికగా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో మూడో వన్డే ఇంటర్నేషనల్‌లో గౌతమ్ గంభీర్, షాహిద్ అఫ్రిది చాలా గొడవ పడ్డారు. ఒక సింగిల్ తీస్తుండగా పిచ్‌పై బ్యాటర్ గంభీర్ బౌలర్ అఫ్రిదిని ఢీకొట్టాడు. తర్వాత ఇద్దరూ తీవ్ర వాగ్వాదానికి దిగారు. వీరిద్దరూ ఫేస్ టు ఫేస్ ఎదురొచ్చి మరీ తిట్టుకున్నారు.


* గౌతమ్ గంభీర్ వర్సెస్ కమ్రాన్ అక్మల్

దంబుల్లాలో ఆసియా కప్ 2010లో పాక్ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్‌తో డ్రింక్ బ్రేక్‌ సమయంలో వాగ్వాదానికి దిగాడు. అఫ్రిది, సయీద్ అజ్మల్‌ల స్పిన్‌ను గంభీర్ హ్యాండిల్ చేయడంతో కీపర్ బిగ్గరగా అప్పీల్ చేశాడు అంతకుముందు కూడా పదేపదే అప్పీల్ చేస్తూ చిరాకు తెప్పించాడు. దాంతో బ్రేక్ టైమ్‌లో గౌతమ్ గంభీర్, కమ్రాన్ అక్మల్ మధ్య మాటల యుద్ధం నడిచింది. అంపైర్లు, పాకిస్తాన్ జట్టు, అలాగే మహేంద్ర సింగ్ ధోనీ ఇరువురికి నచ్చజెప్పి పరిస్థితిని కూల్ చేశారు.


* హర్భజన్ సింగ్ వర్సెస్ షోయబ్ అక్తర్

మళ్లీ అదే ఆసియా కప్ 2010లో అదే మ్యాచ్‌లో షోయబ్ అక్తర్‌ బౌలింగ్ లో హర్భజన్ సింగ్ ఒక పెద్ద సిక్సర్‌తో చెలరేగాడు. భజ్జీ బౌండరీలు బాదుతూ ఉంటే షోయబ్ బౌన్సర్లు విసిరాడు. ఇది ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదానికి దారితీసింది.


* హర్భజన్ సింగ్ vs మహ్మద్ అమీర్

2021 T20 ప్రపంచ కప్ తర్వాత హర్భజన్ సింగ్, మహ్మద్ అమీర్ ఇద్దరూ ట్విట్టర్ వేదికగా మాటల యుద్ధానికి దిగారు.

Published by:Sridhar Reddy
First published:

Tags: Asia Cup 2022, Cricket, Gautam Gambhir, Harbhajan singh, IND vs PAK, India VS Pakistan, Shahid Afridi, Team India

ఉత్తమ కథలు