హోమ్ /వార్తలు /క్రీడలు /

IND vs PAK : టీమిండియాపై అక్కసుతో చౌకబారు మాటలు.. లక్ తో గెలిచిందా.? మెదడు మోకాళ్లలో ఉంటే ఇలాగే మాట్లాడతారు

IND vs PAK : టీమిండియాపై అక్కసుతో చౌకబారు మాటలు.. లక్ తో గెలిచిందా.? మెదడు మోకాళ్లలో ఉంటే ఇలాగే మాట్లాడతారు

Team India

Team India

IND vs PAK : చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ (Pakistan)పై అద్భుత విజయాన్ని అందుకున్న భారత్ (India).. ఆసియా కప్ (Asia Cup)లో బోణీ కొట్టిన సంగతి తెలిసిందే. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్ లో టీమిండియా (Team India) 5 వికెట్ల తేడాతో పాకిస్తాన్ ను మట్టికిరిపించింది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

IND vs PAK : చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ (Pakistan)పై అద్భుత విజయాన్ని అందుకున్న భారత్ (India).. ఆసియా కప్ (Asia Cup)లో బోణీ కొట్టిన సంగతి తెలిసిందే. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్ లో టీమిండియా (Team India) 5 వికెట్ల తేడాతో పాకిస్తాన్ ను మట్టికిరిపించింది. ఇక ఈ విజయాన్ని పాకిస్తాన్ అభిమానుల్లో కొందరు జీర్ణించుకోలేకపోతున్నారు. భారత్ గెలపుపై కారుకూతలు కూస్తున్నారు. తాజాగా పాకిస్తాన్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ ఒకరు భారత్ గెలుపుపై కడుపు మంట మాటలు చేశాడు. లక్ లేకుంటే భారత్ ఎన్నడూ పాకిస్తాన్ పై గెలవలేదంటూ చెత్త వాగుడు వాగాడు. నిజమైన క్రికెట్ ఫ్యాన్స్ భారత్,పాక్ మ్యాచ్ ను థ్రిల్లర్ లా ఫీల్ అవుతుంటే  అర్ఫా ఫిరోజ్‌ జేక్‌ అనే జర్నలిస్టు మాత్రం వేరేలా భావిస్తున్నాడు.


పాకిస్తాన్ పై భారత్ విజయాన్ని ఏమాత్రం జీర్ణించుకోలేని అతడు టీమిండియాపై చౌకబారు మాటలు చేస్తున్నాడు. ట్విట్టర్ వేదికగా కారుకూతలు కూశాడు. ’భారత ప్లేయర్ల కంటే కూడా లక్ బాగా ఆడింది. లక్ ఫేవర్ చేయకుంటే భారత్ పాకిస్తాన్ ను ఓడించేదే కాదు‘ అంటూ తన కడుపు మంటను బయటపెట్టాడు. అయితే ఇతడి ట్వీట్ కు అంతేఘాటుగా క్రికెట్ లవర్స్ బదులు ఇస్తున్నారు. ’నువ్వు స్పోర్ట్స్ జర్నలిస్టుగా పనికిరావు‘అంటూ ఒకరు కామెంట్ చేస్తే.. మరొకరు ’భారత్ పాకిస్తాన్ కంటే బాగా ఆడింది అందుకే గెలిచింది‘ అంటూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ వైరల్ అవుతున్నాయి.








టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు దిగిన పాకిస్తాన్ 19.5 ఓవర్లలో 147 పరుగులు మాత్రమే చేసింది. భువనేశ్వర్ కుమార్ 4 వికెట్లు తీయగా.. హార్దిక్ పాండ్యా 3 వికెట్లు తీశాడు. పాకిస్తాన్ తరఫున మొహమ్మద్ రిజ్వాన్ (42 బంతుల్లో 43; 4 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఇఫ్తిఖర్ అహ్మద్ (22 బంతుల్లో 28; 2 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించాడు. అర్ష్ దీప్ సింగ్, అవేశ్ ఖాన్ లకు ఒక్కో వికెట్ లభించింది. అనంతరం భారత్ 19.4 ఓవర్లలో 5 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.

Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Asia Cup 2022, Dinesh Karthik, Hardik Pandya, IND vs PAK, India VS Pakistan, Ravindra Jadeja, Rohit sharma, Team India, Virat kohli

ఉత్తమ కథలు