హోమ్ /వార్తలు /క్రీడలు /

Asia Cup 2022 : హార్దిక్ పై ముద్దుల వర్షం కురిపించిన అఫ్గాన్ అభిమాని.. విన్నింగ్ సిక్సర్ బాదగానే టీవీ దగ్గరకు వెళ్లి.. (వీడియో)

Asia Cup 2022 : హార్దిక్ పై ముద్దుల వర్షం కురిపించిన అఫ్గాన్ అభిమాని.. విన్నింగ్ సిక్సర్ బాదగానే టీవీ దగ్గరకు వెళ్లి.. (వీడియో)

PC : TWITTER

PC : TWITTER

Asia Cup 2022 : భారత్ (India) పాకిస్తాన్ (Pakistan) మ్యాచ్ లు తలపడుతున్నాయంటే ఇరు దేశాల క్రికెటర్లకే కాదు.. ప్రపంచంలో ఉన్న క్రికెట్ అభిమానులందరికీ ఆసక్తే. టీవీల ముందు కూర్చొని మ్యాచ్ ను ఎంతో ఆసక్తిగా చూస్తారు. ఇక ఆసియా కప్ (Asia Cup) 2022లో భాగంగా భారత్, పాకిస్తాన్ జట్లు మరోసారి ప్రేక్షకులు కావాల్సినంత వినోదాన్ని ఇచ్చాయి.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Asia Cup 2022 : భారత్ (India) పాకిస్తాన్ (Pakistan) మ్యాచ్ లు తలపడుతున్నాయంటే ఇరు దేశాల క్రికెటర్లకే కాదు.. ప్రపంచంలో ఉన్న క్రికెట్ అభిమానులందరికీ ఆసక్తే. టీవీల ముందు కూర్చొని మ్యాచ్ ను ఎంతో ఆసక్తిగా చూస్తారు. ఇక ఆసియా కప్ (Asia Cup) 2022లో భాగంగా భారత్, పాకిస్తాన్ జట్లు మరోసారి ప్రేక్షకులు కావాల్సినంత వినోదాన్ని ఇచ్చాయి. చివరి ఓవర్ వరకు వెళ్లిన ఈ మ్యాచ్ లో.. తీవ్ర ఒత్తిడిని తట్టుకున్న హార్దిక్ పాండ్యా (Hardik Pandya) సిక్సర్ బాది భారత్ కు సూపర్ విక్టరీని అందించాడు. హార్దిక్ విన్నింగ్ షాట్ కొట్టగానే టీమిండియా అభిమానులే కాదు.. అఫ్గానిస్తాన్ అభిమానులు కూడా పండగ చేసుకున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక అఫ్గానిస్తాన్ అభిమాని చేసిన పని విపరీతంగా ట్రెండ్ అవుతుంది.


నవాజ్ వేసిన 20వ ఓవర్ నాలుగో బంతిని హార్దిక్ లాంగాన్ దిశలో భారీ సిక్సర్ బాదిన సంగతి ప్రతి ఒక్క భారత్ అభిమానికి గుర్తుండే ఉంటుంది. ఆ షాట్ కొట్టగానే భారత్ శిబిరంలో సంబరాలు మొదలయ్యాయి. కేవలం భారత్ లోనే కాదు అఫ్గానిస్తాన్ లోనూ సంబరాలు మొదలయ్యాయి. అఫ్గానిస్తాన్ క్రికెట్ అభిమానులు కలిసి ఈ మ్యాచ్ ను చూశారు. అయితే హార్దిక్ సిక్సర్ బాదగానే.. ఒక అభిమాని చప్పట్లు కొడుతూ టీవీ ముందుకు వచ్చి హార్దిక్ పాండ్యాకు ముద్దు పెడతాడు. తన దేశం విన్ అయితే ఎలా సంబరాలు జరుపుకుంటారో అదే విధంగా భారత్ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాను ఓ ఊపు ఊపుతుంది. కేవలం రోజు వ్యవధిలో 14 లక్షల వ్యూస్ ను సంపాధించింది.





అఫ్గానిస్తాన్ క్రికెటర్లు రషీద్ ఖాన్, మొహమ్మద్ నబీ, ముజీబ్ ఉర్ రెహ్మాన్, ఫరూఖీలు ఐపీఎల్ లో పలు ఫ్రాంచైజీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా అఫ్గానిస్తాన్ తో భారత్ కు మంచి సంబంధాలే ఉన్నాయి. కొన్ని నెలల క్రితం అఫ్గానిస్తాన్ లో వరదలు రాగా భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యా వారికి ఆర్థికంగా సాయం కూడా చేశాడు. ఇక ఆసియాకప్ లో అఫ్గానిస్తాన్ కూడా అద్భుతంగా ఆడుతుంది. సూపర్ 4కు చేరుకోవడానికి కేవలం విజయం దూరంలో ఉంది. శ్రీలంకపై 8 వికెట్ల తేడాతో నెగ్గిన అఫ్గాన్.. మంగళవారం బంగ్లాదేశ్ తో తలపడనుంది. ఈ మ్యాచ్ లో అఫ్గాన్ విజయం సాధిస్తే ఆసియా కప్ లో సూపర్ 4కు అర్హత సాధించిన తొలి జట్టుగా నిలుస్తుంది.

Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Afghanistan, Asia Cup 2022, Dinesh Karthik, Hardik Pandya, IND vs PAK, India VS Pakistan, Ravindra Jadeja, Rohit sharma, Team India, Virat kohli

ఉత్తమ కథలు