హోమ్ /వార్తలు /క్రీడలు /

IND vs HKG : టీమిండియాను ఓడించేంత పని చేసిన హాంకాంగ్.. ఆ ఇద్దరు బౌలర్లు లేకుంటే అంతే సంగతులు..

IND vs HKG : టీమిండియాను ఓడించేంత పని చేసిన హాంకాంగ్.. ఆ ఇద్దరు బౌలర్లు లేకుంటే అంతే సంగతులు..

PC : TWITTER

PC : TWITTER

Asia Cup 2022 - IND vs HKG : ఆసియా కప్ (Asia Cup) 2022లో భాగంగా భారత్ (India) మరో మ్యాచ్ కు సిద్ధమైంది. ఆగస్టు 28న జరిగిన మ్యాచ్ లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ (Pakistan)పై ఘనవిజయం సాధించిన టీమిండియా (Team India).. రెండు రోజుల విరామం తర్వాత పసికూన హాంకాంగ్ (Hong Kong)తో తలపడేందుకు సిద్ధమైంది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Asia Cup 2022 - IND vs HKG : ఆసియా కప్ (Asia Cup) 2022లో భాగంగా భారత్ (India) మరో మ్యాచ్ కు సిద్ధమైంది. ఆగస్టు 28న జరిగిన మ్యాచ్ లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ (Pakistan)పై ఘనవిజయం సాధించిన టీమిండియా (Team India).. రెండు రోజుల విరామం తర్వాత పసికూన హాంకాంగ్ (Hong Kong)తో తలపడేందుకు సిద్ధమైంది. దుబాయ్ వేదికగానే ఈ మ్యాచ్ కూడా జరగనుంది. భారత కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 7.30 గంటలకు ఈ మ్యాచ్ ఆరంభం కానుంది. ఇప్పటి వరకు భారత్, హాంకాంగ్ జట్ల మధ్య రెండు వన్డే మ్యాచ్ లు మాత్రమే జరిగాయి. ఈ రెండు కూడా ఆసియా కప్ లో భాగంగానే జరిగాయి. 2008 ఆసియా కప్ లో ఈ రెండు జట్లు తొలిసారి తలపడ్డాయి. చివరిసారిగా 2018 ఆసియా కప్ లో తలపడ్డాయి.ఇది కూడా చదవండి : హార్దిక్ పై ముద్దుల వర్షం కురిపించిన అఫ్గాన్ అభిమాని.. విన్నింగ్ సిక్సర్ బాదగానే టీవీ దగ్గరకు వెళ్లి.. 
2008లో హాంకాంగ్ పై ఈజీ విక్టరీని సాధించిన భారత్.. రెండోసారి మాత్రం విజయం కోసం చెమటోడ్చాల్సి వచ్చింది. 2018 ఆసియా కప్ కు కోహ్లీకి విశ్రాంతి కల్పించడంతో రోహిత్ శర్మ నాయకత్వంలోని టీమిండియా బరిలోకి దిగింది. గ్రూప్ ‘ఎ’లో భాగంగా ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరగ్గా.. టాస్ ఓడిన భారత్ బ్యాటింగ్ కు దిగింది. భారత్ 50 ఓవర్లలో 7 వికెట్లకు 285 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ (120 బంతుల్లో 127; 15 ఫోర్లు, 2 సిక్సర్లు) శతకంతో కదం తొక్కాడు. అంబటి రాయుడు (60), దినేశ్ కార్తీక్ (33), కేదార్ జాదవ్ (28) ఫర్వాలేదనిపించారు. మహేంద్ర సింగ్ ధోని (0) డకౌట్ అయ్యాడు. హాంకాంగ్ బౌలర్లలో కించిత్ షా 3 వికెట్లు, ఇషాన్ ఖాన్ 2 వికెట్లతో రాణించారు.


అనంతరం ఛేదనకు దిగిన హాంకాంగ్ జట్టు ఎవరూ ఊహించని విధంగా ప్రతిఘటించింది. ఒక దశలో టీమిండియాను వణికించింది కూడా. ఓపెనర్లు నిఖత్ ఖాన్ (92), అన్షీ రాత్ (73)లు హాంకాంగ్ కు అదిరిపోయే శుభారంభం చేశారు. వీరిద్దరు తొలి వికెట్ కు 34 ఓవర్లలోనే 174 పరుగులు జోడించారు. ఫలితంగా భారత్ పై హాంకాంగ్ సంచలన విజయాన్ని నమోదు చేసేలా కనిపించింది. అయితే కుల్దీప్ యాదవ్ మ్యాచ్ గతిని మార్చేశాడు. 35వ ఓవర్ వేయడానికి వచ్చిన కుల్దీప్ యాదవ్.. తొలి బంతికే అన్షీ రాత్ ను అవుట్ చేశాడు. మరుసటి ఓవర్లో ఖలీల్ అహ్మద్.. సెంచరీ చేసేలా కనిపించిన నిఖత్ ఖాన్ ను ఎల్బీగా పెవిలియన్ కు చేర్చాడు. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు పెద్దగా ఆడలేకపోయారు. 174/0తో ఉన్న హాంకాంగ్.. 85 పరుగుల వ్యవధిలో 8 వికెట్లను కోల్పోయి లక్ష్యానికి చేరువగా వచ్చి ఆగిపోయింది. 50 ఓవర్లలో 8 వికెట్లకు 259 పరుగులు చేసింది. ఫలితంగా భారత్ పై అద్భుత విజయాన్ని నమోదు చేసే అవకాశాన్ని చేజార్చుకుంది. ఈ మ్యాచ్ లో ఖలీల్ అహ్మద్, చహల్ చెరో మూడు వికెట్లు తీశారు. కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు తీశారు. ఓపెనర్లను పెవిలియన్ కు చేర్చిన కుల్దీప్, ఖలీల్ లు భారత్ విజయంలో కీలక పాత్ర పోషించారు. సరిగ్గా నాలుగేళ్ల తర్వాత టి20 ఫార్మాట్ లో ఈ రెండు జట్లు మరోసారి తలపడనున్నాయి. క్వాలిఫయింగ్ టోర్నీలో హాంకాంగ్ ఒక్క మ్యాచ్ లో కూడా ఓడిపోకుండా ఉండటం విశేషం. నిఖత్ ఖాన్ కెప్టెన్ గా కించిత్ షా వైస్ కెప్టెన్ గా ఉన్నారు. బాబర్ హయత్ భారీ షాట్లు ఆడగలడు. ఈ క్రమంలో భారత్ ఏమరపాటుగా ఉంటే హాంకాంగ్ సంచలనం నమోదు చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Asia Cup 2022, Dinesh Karthik, Hardik Pandya, Hong kong, KL Rahul, MS Dhoni, Ravindra Jadeja, Rishabh Pant, Rohit sharma, Shikhar Dhawan, Team India, Virat kohli

ఉత్తమ కథలు