హోమ్ /వార్తలు /క్రీడలు /

IND vs HKG : టెస్టు మ్యాచ్ ఆడుతోన్న కేఎల్ రాహుల్.. నిరాశ పరిచిన రోహిత్.. 10 ఓవర్ల తర్వాత భారత్ స్కోరు ఎంతంటే?

IND vs HKG : టెస్టు మ్యాచ్ ఆడుతోన్న కేఎల్ రాహుల్.. నిరాశ పరిచిన రోహిత్.. 10 ఓవర్ల తర్వాత భారత్ స్కోరు ఎంతంటే?

PC : TWITTER

PC : TWITTER

Asia Cup 2022 - IND vs HKG : ఆసియా కప్ (Asia cup) 2022లో భాగంగా భారత్ (India) జట్టు ప్రస్తుతం  హాంకాంగ్ (hong Kong)తో మ్యాచ్ ఆడుతోంది. దుబాయ్ (Dubai) వేదికగా జరుగుతోన్న ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గిన హాంకాంగ్ కెప్టెన్ భారత్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించాడు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Asia Cup 2022 - IND vs HKG : ఆసియా కప్ (Asia cup) 2022లో భాగంగా భారత్ (India) జట్టు ప్రస్తుతం  హాంకాంగ్ (hong Kong)తో మ్యాచ్ ఆడుతోంది. దుబాయ్ (Dubai) వేదికగా జరుగుతోన్న ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గిన హాంకాంగ్ కెప్టెన్ భారత్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. రోహిత్ శర్మ (Rohit Sharma), కేఎల్ రాహుల్ (KL Rahul)లు ఇన్నింగ్స్ ను ఓపెనర్లుగా బరిలోకి దిగారు. అయితే పిచ్ స్లోగా ఉండటంతో బాల్ బ్యాట్ మీదకు రావడం లేదు. ఫలితంగా భారత్ నెమ్మదిగా ఆడుతుంది. రోహిత్ శర్మ (13 బంతుల్లో 21; 2 ఫోర్లు, 1 సిక్స్) వేగంగా ఆడే ప్రయత్నంలో పెవిలియన్ కు చేరుకున్నాడు. మరో ఓపెనర్ రాహుల్ మాత్రం చాలా నెమ్మదిగా ఆడుతున్నాడు. ఫలితంగా 10 ఓవర్లు ముగిసే సరికి భారత్  వికెట్ నష్టపోయి 70 పరుగులు చేసింది. ప్రస్తుతం కేఎల్ రాహుల్ (31 బంతుల్లో 30; 2 సిక్సర్లు), విరాట్ కోహ్లీ (15 బంతుల్లో 18 బ్యాటింగ్)లు క్రీజులో ఉన్నారు.ఇది కూడా చదవండి : ‘నా మరణ వార్తను నేనే చదివా.. ఏడ్వాలో.. నవ్వాలో కూడా అర్థం కాలేదు’ భారత స్టార్ ఆల్ రౌండర్ షాకింగ్ కామెంట్స్

హార్దిక్ కు విశ్రాంతి
పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన హార్దిక్ పాండ్యాకు ఈ మ్యాచ్ లో విశ్రాంతి కల్పించారు. యూఏఈలో ఉక్కపోత ఎక్కువగా ఉంది. దాంతో అనవసరంగా గాయాల పాలు అవ్వకుండా హార్దిక్ కు విశ్రాంతి ఇచ్చిన భారత్.. అతడి స్థానంలో రిషభ్ పంత్ ను తుది జట్టులోకి తీసుకుంది. ఈ మ్యాచ్ కేఎల్ రాహుల్ కు చాలా కీలకం కానుంది. ఫామ్ లో లేని అతడు హాంకాంగ్ తో జరిగే మ్యాచ్ తో ఫామ్ లోకి రావాలని చూస్తున్నాడు.


ముఖాముఖి
ఈ రెండు జట్లు ఇప్పటి వరకు ఒక్క టి20 మ్యాచ్ లో కూడా ఆడలేదు. అయితే వన్డేల్లో రెండు సార్లు తలపడింది. ఈ రెండు సార్లు కూడా ఆసియా కప్ లోనే కావడం విశేషం. 2008లో తొలిసారిగా భారత్, హాంకాంగ్ జట్లు తలపడగా.. మళ్లీ 2018లో రెండోసారి తలపడ్డాయి. ఈ రెండు సార్లు కూడా భారతే గెలిచింది. అయితే 2018లో మాత్రం భారత్ విజయం కోసం చెమటోడ్చాల్సి వచ్చింది.
తుది జట్లు 
టీమిండియా
రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, జడేజా, దినేశ్ కార్తీక్, రిషభ్ పంత్, భువనేశ్వర్ కుమార్, అర్ష్ దీప్ సింగ్, చహల్
హాంకాంగ్
నిజఖత్ ఖాన్ (కెప్టెన్), యాసిమ్ మోర్తాజా, బాబర్ హయ్యత్, కించిత్ షా, ఐజాజ్ ఖాన్, ఇషా ఖాన్, ఆయుశ్ శుక్లా, జీషమ్ అలీ, మొహమ్మద్, అర్షద్ మొహమ్మద్, స్కాట్

Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Asia Cup 2022, Dinesh Karthik, Hong kong, KL Rahul, Ravindra Jadeja, Rishabh Pant, Rohit sharma, Virat kohli

ఉత్తమ కథలు