హోమ్ /వార్తలు /క్రీడలు /

IND vs HKG : హాంకాంగ్ పై సూర్యప్రతాపం.. ఆఖరి ఓవర్లో సిక్సర్ల వర్షం.. హాంకాంగ్ టార్గెట్ ఎంతంటే?

IND vs HKG : హాంకాంగ్ పై సూర్యప్రతాపం.. ఆఖరి ఓవర్లో సిక్సర్ల వర్షం.. హాంకాంగ్ టార్గెట్ ఎంతంటే?

PC : TWITTER

PC : TWITTER

Asia Cup 2022 - IND vs HKG : ఆసియా కప్ (Asia Cup) 2022లో భాగంగా హాంకాంగ్ (Hong Kong)తో జరిగిన గ్రూప్ ‘ఎ’ మ్యాచ్ లో సూర్యకుమార్ యాదవ్ (Surya Kumar Yadav) చెలరేగిపోయాడు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Asia Cup 2022 - IND vs HKG : ఆసియా కప్ (Asia Cup) 2022లో భాగంగా హాంకాంగ్ (Hong Kong)తో జరిగిన గ్రూప్ ‘ఎ’ మ్యాచ్ లో సూర్యకుమార్ యాదవ్ (Surya Kumar Yadav) చెలరేగిపోయాడు. కేవలం 26 బంతుల్లో 68 పరుగులతో అజేయ అర్ధ సెంచరీ చేశాడు. ఇందులో 6 సిక్సర్లు, ఆరు ఫోర్లు ఉండటం విశేషం. సూర్యకుమార్ యాదవ్ కు తోడు విరాట్ కోహ్లీ (44 బంతుల్లో 59; 1 ఫోర్, 3 సిక్సర్లు) కూడా అర్ధ సెంచరీ సాధించడంతో భారత్ భారీ స్కోరును అందుకుంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు దిగిన భారత్ 20 ఓవర్లలో 2 వికెట్లు నష్టపోయి 192 పరుగుల భారీ స్కోరును సాధించింది. హాంకాంగ్ బౌలర్లలో ఆయుశ్ శుక్లా, మొహమ్మద్ ఘజాన్ ఫర్ చెరో వికెట్ సాధించారు.ఓపెనర్లు విఫలం
టాస్ ఓడి భారత్ బ్యాటింగ్ కు దిగగా.. ఓపెనర్లుగా కేఎల్ రాహుల్(39 బంతుల్లో 36; 2 సిక్సర్లు), రోహిత్ శర్మ (13 బంతుల్లో 21; 2 ఫోర్లు, 1 సిక్స్) నెమ్మదిగా ఆరంభించారు. వీరు నెమ్మదిగా బ్యాటింగ్ చేయడంతో మొదటి కొన్ని ఓవర్ల పాటు టెస్టు మ్యాచ్ లా అనిపించింది. రాహుల్ తడబడటంతో రోహిత్ భారీ షాట్లకు వెళ్లాడు. ఈ క్రమంలో రెండు ఫోర్లు ఒక సిక్సర్ బాదిన అతడు టచ్ లో కనిపించాడు. అయితే భారీ షాట్ కు ప్రయత్నించి పెవిలియన్ కు చేరాడు. వన్ డౌన్ లో విరాట్ కోహ్లీ క్రీజులోకి వచ్చాడు. రాహుల్, కోహ్లీ నిదానంగా ఆడటంతో భారత్ తొలి 10 ఓవర్లలో 70 పరుగులు మాత్రమే చేసింది. టెస్టు మ్యాచ్ ఆడిన రాహుల్ కీపర్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ కు చేరాడు.


సూపర్ సూర్య
13వ ఓవర్ ఆఖరి బంతికి కేఎల్ రాహుల్ పెవిలియన్ కు చేరుకున్నాడు. అప్పటికి భారత స్కోరు 2 వికెట్లకు 94 పరుగులు. ఆ దశలో భారత్ 150 పరుగులు చేయడం గగనంలా అనిపించింది. అయితే సూర్యకుమార్ యాదవ్ భారత్ స్కోరు బోర్డును పరుగెత్తించాడు. రాకెట్ వేగంతో ముందుకు నడిపాడు. ఫోర్లు, సిక్సర్లతో గ్రౌండ్ ను ముంచెత్తాడు. మరో ఎండ్ లో ఉన్న కోహ్లీ కూడా భారీ షాట్లు ఆడటం మొదలు పెట్టాడు. ఈ క్రమంలో కోహ్లీ ఆసియా కప్ లో తొలి అర్ధ సెంచరీని అందుకున్నాడు. అంతర్జాతీయ టి20ల్లో కోహ్లీకి ఇది 31వది కాగా. . ఈ ఏడాది రెండోది. కోహ్లీ అర్ధ సెంచరీ తర్వాత సూర్యకుమార్ యాదవ్ మరింతగా చెలరేగిపోయాడు. చివరి ఓవర్లో 6, 6, 6, 0, 6, 2తో మొత్తం 26 పరుగులు రాబట్టాడు. దాంతో భారత్ 192 పరుగులకు చేరుకుంది. కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ లు కేవలం 42 బంతుల్లో 98 పరుగులు జోడించడం విశేషం.

Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Asia Cup 2022, Dinesh Karthik, Ravindra Jadeja, Rishabh Pant, Rohit sharma, Virat kohli

ఉత్తమ కథలు