హోమ్ /వార్తలు /క్రీడలు /

IND vs HKG : పంత్ రిటర్న్.. మరి వేటు ఎవరిపై.. హాంకాంగ్ తో ఆడే భారత జట్టు ఇదే..

IND vs HKG : పంత్ రిటర్న్.. మరి వేటు ఎవరిపై.. హాంకాంగ్ తో ఆడే భారత జట్టు ఇదే..

Team India

Team India

Asia cup 2022 - IND vs HKG : ఆసియా కప్ (Asia cup) 2022లో డిఫెండింగ్ చాంపియన్ గా అడుగుపెట్టిన భారత్ (India) ఆరంభ పోరులో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ (Pakistan)పై ఘనవిజయం సాధించింది. గత ఆదివారం జరిగిన ఈ మ్యాచ్ లో ఆల్ రౌండ్ షోతో అదరగొట్టిన భారత్ 5 వికెట్ల తేడాతో పాకిస్తాన్ పై గెలిచి టైటిల్ వేటను ఘనంగా ఆరంభించింది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Asia cup 2022 - IND vs HKG : ఆసియా కప్ (Asia cup) 2022లో డిఫెండింగ్ చాంపియన్ గా అడుగుపెట్టిన భారత్ (India) ఆరంభ పోరులో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ (Pakistan)పై ఘనవిజయం సాధించింది. గత ఆదివారం జరిగిన ఈ మ్యాచ్ లో ఆల్ రౌండ్ షోతో అదరగొట్టిన భారత్ 5 వికెట్ల తేడాతో పాకిస్తాన్ పై గెలిచి టైటిల్ వేటను ఘనంగా ఆరంభించింది. రెండు రోజుల విరామం తర్వాత రోహిత్ శర్మ (Rohit sharma) సారథ్యంలోని భారత్ మరో పోరుకు సిద్ధమైంది. ఇక్కడి దుబాయ్ స్టేడియంలో గురువారం జరిగే గ్రూప్ ‘ఎ’ పోరులో పసికూన హాంకాంగ్ (Hong Kong)తో భారత్ తలపడనుంది. ప్రత్యర్థి పసికూన కావడంతో భారత్ గెలుపు నల్లేరు మీద నడకే. అయితే విజయం గురించి కాకుండా భారత్ ఎన్ని రికార్డులను బద్దలుకొడుతుందనేది చూడాల్సి ఉంది.


కేఎల్ రాహుల్ ఉంటాడా?


వెస్ కెప్టెన్ గా జట్టులో ఉన్న కేఎల్ రాహుల్ తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడు. ఐపీఎల్ 2022లో అద్భుతంగా ఆడిన తర్వాత గాయాలు అతడిని గాడి తప్పేలా చేశాయి. మొదట స్పోర్ట్స్ హెర్నియా.. ఆ తర్వాత కరోనాతో తీవ్ర ఇబ్బంది పడ్డాడు. అనంతరం జింబాబ్వేతో జరిగిన వన్డే సిరీస్ కు చివరి నిమిషంలో ఎంపికయ్యాడు. అయితే అందులో మూడు మ్యాచ్ ల్లో (2 ఇన్నింగ్స్ లు) కేవలం 31 పరుగులు మాత్రమే చేశాడు. ఇక పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో బరిలోకి దిగినా గోల్డెన్ డక్ గా పెవిలియన్ కు చేరుకున్నాడు. దాంతో హాంకాంగ్ తో జరిగే మ్యాచ్ రాహుల్ కు కీలకం. పసికూనతో జరిగే ఈ మ్యాచ్ లోనూ విఫలం అయితే అతడి క్రికెట్ కెరీర్ డేంజర్ లో పడే అవకాశం ఉంది. ఇక పాక్ తో మ్యాచ్ లో జడేజా, పాండ్యా మినహా మిగిలిన భారత బ్యాటర్లు విఫలం అయ్యారు. కోహ్లీ పరుగులు చేసినా.. అది క్యాచ్ డ్రాప్ వల్లే అని గుర్తించుకోవాలి. ఇక బౌలింగ్ లో అవేశ్ ఖాన్ పై వేటు పడే అవకాశం ఉంది. అతడి స్థానంలో పంత్ బరిలోకి దిగొచ్చు. హార్దిక్ మూడో సీమర్ గా సేవలందిస్తాడు. పాక్ తో జరిగిన మ్యాచ్ లో భువనేశ్వర్ కుమార్, అర్ష్ దీప్ సింగ్ చాలా చక్కగా బౌలింగ్ చేశారు, అర్ష్ దీప్ తన చివరి ఓవర్లో మినహా మిగిలిన మూడు ఓవర్లలోనూ చాలా బాగా బౌలింగ్ చేశాడు. ఇక వికెట్లు పడకపోయినా చహల్ ఫర్వాలేదనిపించాడు.



ఇక మరోవైపు క్వాలిఫయర్ హోదాలో అడుగుపెట్టిన హాంకాంగ్ భారత్ కు ఏ మాత్రం పోటీ ఇస్తుందో చూడాలి. ఆ జట్టులో యాసిమ్ మోర్తాజ, కెప్టెన్ నిజాఖత్ ఖాన్ మినహా మిగిలిన వారు పెద్దగా అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడింది లేదు. ఇక క్వాలిఫయర్ టోర్నీలో బాబర్ హయత్ మెరుపులు మెరిపించాడు.


భారత్ తుది జట్టు (అంచనా)


రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, జడేజా, దినేశ్ కార్తీక్, రిషభ్ పంత్/ అవేశ్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, అర్ష్ దీప్ సింగ్, చహల్

Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Asia Cup 2022, Dinesh Karthik, Hardik Pandya, Ravindra Jadeja, Rishabh Pant, Rohit sharma, Team India, Virat kohli

ఉత్తమ కథలు