హోమ్ /వార్తలు /క్రీడలు /

Asia cup 2022 : అదే కసి.. అదే దూకుడు.. తగ్గేదే లే అంటోన్న భారత ప్లేయర్లు.. ఎందులో అంటే?

Asia cup 2022 : అదే కసి.. అదే దూకుడు.. తగ్గేదే లే అంటోన్న భారత ప్లేయర్లు.. ఎందులో అంటే?

PC : TWITTER

PC : TWITTER

Asia cup 2022 : ఆసియా కప్ (Asia cup) 2022లో భాగంగా మరికొద్ది సేపట్ల ో భారత్ (India) తన రెండో లీగ్ మ్యాచ్ ను ఆడనుంది. దుబాయ్ (Dubai) వేదికగా బుధవారం జరిగే గ్రప్ ‘ఎ’లీగ్ మ్యాచ్ లో పసికూన హాంకాంగ్ (Hong Kong)తో టీమిండియా (Team India) తలపడనుంది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Asia cup 2022 : ఆసియా కప్ (Asia cup) 2022లో భాగంగా మరికొద్ది సేపట్ల ో భారత్ (India) తన రెండో లీగ్ మ్యాచ్ ను ఆడనుంది. దుబాయ్ (Dubai) వేదికగా బుధవారం జరిగే గ్రప్ ‘ఎ’లీగ్ మ్యాచ్ లో పసికూన హాంకాంగ్ (Hong Kong)తో టీమిండియా (Team India) తలపడనుంది. అయితే ప్రత్యర్థి పసికూన అని భారత్ ఏ మాత్రం అశ్రద్ధ చేయడం లేదు. పాకిస్తాన్ (Pakistan)తో జరిగిన మ్యాచ్ కు ఏ విధంగా అయితే ప్రిపేర్ అయ్యిందో.. అదే విధంగా ప్రిపేర్ అవుతుంది. నెట్స్ లో గంటల తరబడి ప్రాక్టీస్ చేసింది. ప్రత్యర్థి హాంకాంగ్ అని లైట్ తీసుకోవడం లేదు. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం బుధవారం రాత్రి గం. 7.30 నుంచి ప్రత్యక్ష ప్రసారం కానుంది.పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో సారథి రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ ఏ మాత్రం ఆడలేకపోయారు. రాహుల్ గోల్డెన్ డగ్ గా వెనుదిరిగితే రోహిత్ క్రీజులో ఉన్నంత సేపు చాలా ఇబ్బంది పడ్డాడు. ఈ క్రమంలో హాంకాంగ్ తో జరిగే మ్యాచ్ ను ఫామ్ లోకి వచ్చేందుకు చక్కగా ఉపయోగించుకోవాలని రోహిత్, రాహుల్ భావిస్తున్నారు. ఇందుకోసం నెట్స్ లో భారీ షాట్లు ఆడుతూ ప్రిపేర్ అయ్యారు. వీరితో పాటు విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్, దినేశ్ కార్తీక్ లు కూడా నెట్స్ లో ప్రాక్టీస్ చేశారు. ప్రస్తుతం వీటికి సంబంధిన వీడియోను బీసీసీఐ ట్విట్టర్ లో షేర్ చేసుకుంది.





మార్పులు ఉంటాయా?
ఈ మ్యాచ్ కోసం భారత పలుమార్పులు చేసే అవకాశం ఉంది. దుబాయ్ లో ఉక్కపోత ఎక్కువగా ఉండటంతో భారత్ తో జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ ప్లేయర్లు క్రాంప్స్ బారిన పడ్డారు. ముందు జాగ్రత్తగా భారత్ ఈ మ్యాచ్ కోసం స్టార్ ఆల్ రౌండర్లు హార్దిక్, రవీంద్ర జడేజాలకు రెస్ట్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో పంత్ మళ్లీ బరిలోకి దిగనున్నాడు. బిష్ణోయ్ లేదా  అశ్విన్ లలో ఒకరికి తుది జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది. సూర్యకుమార్ యాదవ్ కు కూడా విశ్రాంతి ఇస్తే అప్పుడు దీపక్ హుడా బరిలోకి దిగే అవకాశం ఉంది. నెట్స్ లో పంత్ చాలా సేపు ప్రాక్టీస్ చేశాడు. భారీ షాట్లు ఆడాాడు. హెలికాఫ్టర్ షాట్లను కూడా ప్రాక్టీస్ చేశాడు.

Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Asia Cup 2022, Dinesh Karthik, Hardik Pandya, IND vs PAK, Ravindra Jadeja, Rishabh Pant, Rohit sharma, Team India, Virat kohli

ఉత్తమ కథలు