హోమ్ /వార్తలు /క్రీడలు /

IND vs HKG : టాస్ నెగ్గిన హాంకాంగ్.. టీంలో భారీ మార్పు చేసిన టీమిండియా.. పంత్ బ్యాక్.. తుది జట్లు ఇవే

IND vs HKG : టాస్ నెగ్గిన హాంకాంగ్.. టీంలో భారీ మార్పు చేసిన టీమిండియా.. పంత్ బ్యాక్.. తుది జట్లు ఇవే

PC : TWITTER

PC : TWITTER

Asia Cup 2022 - IND vs HKG : ఆసియా కప్ (Asia cup) 2022లో భాగంగా పాకిస్తాన్ (Pakistan)తో జరిగిన తొలి మ్యాచ్ లో గెలిచిన భారత్ (India).. రెండు రోజుల విరామం అనంతరం మరో మ్యాచ్ కు సిద్ధమైంది. దుబాయ్ (dubai) వేదికగా హాంకాంగ్ (Hong Kong)తో జరిగే మ్యాచ్ లో టీమిండియా (Team India) టాస్ ఓడిపోయింది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Asia Cup 2022 - IND vs HKG : ఆసియా కప్ (Asia cup) 2022లో భాగంగా పాకిస్తాన్ (Pakistan)తో జరిగిన తొలి మ్యాచ్ లో గెలిచిన భారత్ (India).. రెండు రోజుల విరామం అనంతరం మరో మ్యాచ్ కు సిద్ధమైంది. దుబాయ్ (dubai) వేదికగా హాంకాంగ్ (Hong Kong)తో జరిగే మ్యాచ్ లో టీమిండియా (Team India) టాస్ ఓడిపోయింది. టాస్ నెగ్గిన హాంకాంగ్ కెప్టెన్ నిజఖత్ ఖాన్ భారత్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. ఈ మ్యాచ్ కోసం భారత్ ఒక మార్పు చేసింది. పాకిస్తాన్ పై ఆల్ రౌండ్ షోతో అదరగొట్టిన హార్దిక్ పాండ్యాకు విశ్రాంతి ఇచ్చింది. అతడి స్థానంలో రిషభ్ పంత్ కు తుది జట్టులో చోటు కల్పించింది. మరోవైపు క్వాలిఫయర్ ఫైనల్లో యూఏఈపై నెగ్గిన జట్టునే భారత్ తో జరిగే మ్యాచ్ లోనూ హాంకాంగ్ కొనసాగించనుంది.హార్దిక్ కు విశ్రాంతి
పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన హార్దిక్ పాండ్యాకు ఈ మ్యాచ్ లో విశ్రాంతి కల్పించారు. యూఏఈలో ఉక్కపోత ఎక్కువగా ఉంది. దాంతో అనవసరంగా గాయాల పాలు అవ్వకుండా హార్దిక్ కు విశ్రాంతి ఇచ్చిన భారత్.. అతడి స్థానంలో రిషభ్ పంత్ ను తుది జట్టులోకి తీసుకుంది. ఈ మ్యాచ్ కేఎల్ రాహుల్ కు చాలా కీలకం కానుంది. ఫామ్ లో లేని అతడు హాంకాంగ్ తో జరిగే మ్యాచ్ తో ఫామ్ లోకి రావాలని చూస్తున్నాడు.



ముఖాముఖి
భారత్, హాంకాంగ్ జట్లు ఇప్పటి వరకు రెండు వన్డేల్లో మాత్రమే తలపడింది. ఈ రెండు కూడా ఆసియా కప్ లోనే కావడం విశేషం. 2008, 2018 ఆసియా కప్ లలో భారత్, హాంకాంగ్ జట్లు తలపడ్డాయి. ఈ రెండు సార్లు కూడా భారత్ గెలిచింది. అయితే 2018లో మాత్రం హాంకాంగ్ విజయానికి చేరువగా వచ్చి ఆగిపోయింది. ఆ మ్యాచ్ లో భారత్  భారత్ 50 ఓవర్లలో 7 వికెట్లకు 285 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ (120 బంతుల్లో 127; 15 ఫోర్లు, 2 సిక్సర్లు) శతకంతో కదం తొక్కాడు. అంబటి రాయుడు (60), దినేశ్ కార్తీక్ (33), కేదార్ జాదవ్ (28) ఫర్వాలేదనిపించారు. మహేంద్ర సింగ్ ధోని (0) డకౌట్ అయ్యాడు. హాంకాంగ్ బౌలర్లలో కించిత్ షా 3 వికెట్లు, ఇషాన్ ఖాన్ 2 వికెట్లతో రాణించారు. అనంతరం హాంకాంగ్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 259 పరుగులు చేసింది. ఫలితంగా భారత్ 26 పరుగుల తేడాతో నెగ్గింది. హాంకాంగ్ ఓపెనర్లు నిఖత్ ఖాన్ (92), అన్షీ రాత్ (73)లు హాంకాంగ్ కు అదిరిపోయే శుభారంభం చేశారు. వీరిద్దరు తొలి వికెట్ కు 34 ఓవర్లలోనే 174 పరుగులు జోడించారు. అయితే వీరు అవుటయ్యాక హాంకాంగ్ ఇన్నింగ్స్ చతికిల పడింది. అయితే టి20 ఫార్మాట్ లో మాత్రం ఈ రెండు జట్లు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా తలపడలేదు.
తుది జట్లు 
టీమిండియా
రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, జడేజా, దినేశ్ కార్తీక్, రిషభ్ పంత్, భువనేశ్వర్ కుమార్, అర్ష్ దీప్ సింగ్, చహల్
హాంకాంగ్
నిజఖత్ ఖాన్ (కెప్టెన్), యాసిమ్ మోర్తాజా, బాబర్ హయ్యత్, కించిత్ షా, ఐజాజ్ ఖాన్, ఇషా ఖాన్, ఆయుశ్ శుక్లా, జీషమ్ అలీ, మొహమ్మద్, అర్షద్ మొహమ్మద్, స్కాట్


Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Asia Cup 2022, Dinesh Karthik, Hardik Pandya, Hong kong, KL Rahul, Ravindra Jadeja, Rishabh Pant, Rohit sharma, Virat kohli

ఉత్తమ కథలు