హోమ్ /వార్తలు /క్రీడలు /

IND vs AFG : ఇదైనా గెలుస్తారా లేక బొక్క బోర్లా పడతారా? అఫ్గాన్ తో భారత్ ఆఖరి పోరు.. ఆ బౌలర్ కు ఛాన్స్!

IND vs AFG : ఇదైనా గెలుస్తారా లేక బొక్క బోర్లా పడతారా? అఫ్గాన్ తో భారత్ ఆఖరి పోరు.. ఆ బౌలర్ కు ఛాన్స్!

PC : TWITTER

PC : TWITTER

Asia cup 2022 - IND vs AFG : ఆసియా కప్ (Asia cup) 2022లో భాగంగా భారత్ (India) ఆఖరి పోరుకు సిద్ధమైంది. సూపర్ 4లో ఆడిన రెండు మ్యాచ్ ల్లోనూ ఓడిన టీమిండియా (Team India).. ఇఫ్పటికే ఫైనల్ చేరే అవకాశాన్ని దూరం చేసుకుంది. గురువారం జరిగే తన ఆఖరి పోరులో అఫ్గానిస్తాన్ (Afghanistan)తో తలపడనుంది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Asia cup 2022 - IND vs AFG : ఆసియా కప్ (Asia cup) 2022లో భాగంగా భారత్ (India) ఆఖరి పోరుకు సిద్ధమైంది. సూపర్ 4లో ఆడిన రెండు మ్యాచ్ ల్లోనూ ఓడిన టీమిండియా (Team India).. ఇఫ్పటికే ఫైనల్ చేరే అవకాశాన్ని దూరం చేసుకుంది. గురువారం జరిగే తన ఆఖరి పోరులో అఫ్గానిస్తాన్ (Afghanistan)తో తలపడనుంది. ఈ మ్యాచ్ లోనైనా గెలిచి భారత్ విజయంతో ఇంటిదారి పట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరొకవైపు మనలాంటి పరిస్థితినే అఫ్గానిస్తాన్ కూడా ఎదుర్కొంటుంది. అయితే ఆసియా కప్ లో పాల్గొంటున్న జట్లలో అఫ్గానిస్తాన్ పసికూన. ఇతర జట్లతో పోలిస్తే అనుభవం చాలా  తక్కువ. కానీ, ఆ జట్టు అంచనాలకు మించి రాణించింది. గత మ్యాచ్ లో పాకిస్తాన్ (Pakistan) దాదాపుగా ఓడించినంత పని చేసింది. దాంతో అఫ్గానిస్తాన్ ను తక్కువగా అంచనా వేయరాదని మాజీ క్రికెటర్లు భారత్ ను హెచ్చరిస్తున్నారు. తక్కువగా అంచనా వేస్తే శ్రీలంక చేతిలో ఎదురైన పరాభవమే ఎదురయ్యే ఛాన్స్ ఉందని పేర్కొంటున్నారు.భారీ మార్పులు
ఈ మ్యాచ్ కోసం భారత్ భారీ మార్పులు చేసే అవకాశం ఉంది. వరుసగా విఫలం అవుతున్న పంత్, దీపక్ హుడాలను తొలగించి వారిస్థానాల్లో దినేశ్ కార్తీక్, అక్షర్ పటేల్, అవకాశం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అదే సమయంలో స్టాండ్ బై ప్లేయర్ దీపక్ చహర్ ను మూడో సీమర్ గా ఆడించాలనే ఉద్దేశంలో టీమిండియా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. దీపక్ జట్టుతోనే యూఏఈలో ఉన్నాడు. ఈ క్రమంలో అఫ్గాన్ తో జరిగే మ్యాచ్ కోసం భారత్ మూడు మార్పులు చేసే అవకాశం ఉందని సమాచారం. హుడా, పంత్, అశ్విన్ లను తొలగించి వారి స్థానాల్లో కార్తీక్, అక్షర్ పటేల్, దీపక్ చహర్ లను తీసుకునే అవకాశం ఉంది.


భారత్ ను వెంటాడుతున్న బ్యాటింగ్ సమస్య
గత రెండు మ్యాచ్ ల్లోనూ భారత్ ను బ్యాటింగ్ సమస్య వెంటాడుతుంది. పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో టాప్ 3 ప్లేయర్లు రాణించినా.. ఆ తర్వాతి వరుస బ్యాటర్లు ఆడలేదు. ఇక శ్రీలంక తో జరిగిన మ్యాచ్ లో రోహిత్ మాత్రమే అదరగొట్టాడు. ఈ రెండు మ్యాచ్ ల్లోనూ భారత్ ఒక దశలో 200 పరుగులు చేసేలా కనిపించింది. అయితే ఫినిషర్ లు గా జట్టులో ఉన్న పంత్, హార్దిక్ లు చివర్లో మెరుపులు మెరిపించలేకపోయారు. ఇక బౌలింగ్ కూడా భారత్ కు సమస్యగా మారింది. ముఖ్యంగా పేసర్లు తేలిపోతున్నారు. ఆశలు పెట్టుకున్న భువనేశ్వర్ డెత్ ఓవర్లలో భారీగా పరుగులు సమర్పించుకుంటున్నాడు. అదే సమయంలో ఆరంభంలో పరుగులు ఇస్తున్న అర్ష్ దీప్ సింగ్ డెత్ ఓవర్స్ లో మెరుస్తున్నాడు. హార్దిక్ గత రెండు మ్యాచ్ ల్లోనూ ఆల్ రౌండర్ గా విఫలం అయ్యాడు. చహల్ ,అశ్విన్ కూడా తమ అనుభవాన్ని ఉపయోగించుకోలేకపోయారు. అఫ్గానిస్తాన్ స్పిన్ బౌలింగ్ చాలా బలంగా ఉంది. రషీద్, ముజీబ్, నబీలతో భీకరంగా కనిపిస్తుంది. ఇక పేసర్ ఫరూఖీ కూడా వేరియేషన్స్ తో బౌలింగ్ చేయగలడు. అలసత్వం ప్రదర్శిస్తే భారత్ కు హ్యాట్రిక్ ఓటములు ఖాయం.


హెడ్ టు హెడ్ 
భారత్, ఆఫ్గానిస్తాన్ ఇప్పటి వరకు మూడు ఫార్మాట్లలో కలిపి 7 సార్లు తలపడ్డాయి. ఇందులో ఆరుసార్లు భారత్ గెలిచింది. ఇక 2018లో ఆసియా కప్ లో జరిగిన వన్డే మ్యాచ్ టైగా ముగిసింది. టి20ల్లో మూడు సార్లు తలపడగా మూడు సార్లు కూడా భారతే గెలిచింది.
టీమిండియా తుది జట్టు (అంచనా)
రోహిత్ (కెప్టెన్), రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్, అక్షర్ పటేల్, దీపక్ చహర్, భువనేశ్వర్, చహల్, అర్ష్ దీప్ సింగ్

Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Afghanistan, Asia Cup 2022, Dinesh Karthik, Hardik Pandya, KL Rahul, Rashid Khan, Rohit sharma, Team India

ఉత్తమ కథలు