Asia Cup 2022 Champion : దేశంలో ఆర్థిక సంక్షోభం.. ఆటగాళ్లు గ్రౌండ్ కు వెళ్లి ప్రాక్టీస్ చేసేందుకు ఇబ్బందులు.. ఎందుకంటే.. ప్లేయర్స్ ను తరలించేందుకు ఉపయోగించే బస్సులకు ఇంధనం కూడా దొరకని పరిస్థితులు.. ఒకానొక సందర్భంలో ఆసియా కప్ (Asia Cup 2022) 2022లో పాల్గొంటుందా అనే అనుమానాలు.. తొలి మ్యాచ్ లో అఫ్గానిస్తాన్ (Afghanistan) చేతిలో 105 పరుగులకే ఆలౌట్.. ఆపై 8 వికెట్ల తేడాతో భారీ ఓటమి. ఈ పరిస్థితులను చూశాక ఎవరైనా శ్రీలంక (Sri Lanka) గెలుస్తుందని భావించారా? కానీ, లంకేయులు మాత్రం అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించారు. జట్టులో స్టార్ లు లేకపోయినా సోదరుల్లా ఐకమత్యంగా ఆడి అపూరప విజయాన్ని సాధించారు. కోచ్ సిల్వర్ వుడ్ (Chris Silverwood) పర్యవేక్షణలో.. కెప్టెన్ దసున్ షనక (Dasun Shanaka) నాయకత్వంలో శ్రీలంక సంచలనం చేసి చూపించింది. దుబాయ్ వేదికగా ఆదివారం జరిగిన ఫైనల్లో పాకిస్తాన్ (Pakistan)పై 23 పరుగుల తేడాతో విజయం సాధించి ఆసియా కప్ ను ఆరోసారి సొంతం చేసుకుంది. ఈ టోర్నీల్లో శ్రీలంక జట్టు గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.
171 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ సరిగ్గా 20 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌటైంది. మదుషాన్ 4 వికెట్లతో చెలరేగితే.. హసరంగ ఒకే ఓవర్ లో మూడు వికెట్లతో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. రిజ్వాన్ (55) ఒంటిరి పోరాటం చేశాడు. ఇఫ్తికర్ అహ్మద్ (32) మినహా మిగిలిన ప్లేయర్స్ నుంచి రిజ్వాన్ కు సహకారం లభించలేదు. దాంతో లక్ష్యానికి చాలా దూరంగా ఆగిపోయింది. బాబర్ ఆజమ్ (5), ఫఖర్ జమాన్ (0), నవాజ్ (6), ఖుష్ దిల్ ఖాన్ (2), అసిఫ్ అలీ (0), షాదబ్ ఖాన్ (8) పెవిలియన్ కు క్యూ కట్టారు.
It's finally ours! ????????????????
An epic performance from our sensational Lions! Men's #AsiaCup champions! ????#RoaringForGlory #SLvPAK pic.twitter.com/w3CeoP5NuJ — Sri Lanka Cricket ???????? (@OfficialSLC) September 11, 2022
అంతకుముందు శ్రీలంక బ్యాటర్ భానుక రాజపక్స వీరోచిత పోరాటంతో జట్టుకు భారీ స్కోరును అందించాడు. 58 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ శ్రీలంకను తన పట్టుదలతో ఆదుకున్నాడు. కష్టసమయంలో క్రీజులోకి వచ్చిన రాజపక్స 45 బంతుల్లో 71 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇందులో 6 ఫోర్లు, 3 సిక్సర్లు ఉండటం విశేషం. ఫలితంగా శ్రీలంక 20 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 170 పరుగులు చేసింది. హసరంగ (21 బంతుల్లో 36; 5 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. ఫలితంగా శ్రీలంక పాక్ ముందు భారీ స్కోరును ఉంచింది. పాకిస్తాన్ బౌలర్లలో హరీస్ రవూఫ్ 3 వికెట్లు తీశాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Asia Cup 2022, Babar Azam, Pakistan, Sri Lanka