Home /News /sports /

ASIA CUP 2022 BANGLADESH CRICKET BOARD ANNOUNCED THEIR TEAM FOR ASIA CUP NAMED SHAKIB AL HASAN AS TEAM CAPTAIN SJN

Asia Cup 2022 : మొన్న బెట్టింగ్ యాప్ కు ప్రచారకర్త.. కట్ చేస్తే ఇప్పుడేమో ఏకంగా బంగ్లాదేశ్ జట్టుకే కెప్టెన్.. ఎవరంటే?

Bangladesh Team

Bangladesh Team

Asia Cup 2022 : ఈ నెల 27 నుంచి ఆసియా కప్ (Asia Cup) ఆరంభం కానున్న సంగతి తెలిసిందే. 2020లోనే ఈ టోర్నమెంట్ జరగాల్సి ఉన్నా.. కరోనా కారణంగా వాయిదా పడింది. శ్రీలంక (Sri Lanka) వేదికగా ఈ టోర్నీ జరగాల్సి ఉంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
Asia Cup 2022 : ఈ నెల 27 నుంచి ఆసియా కప్ (Asia Cup) ఆరంభం కానున్న సంగతి తెలిసిందే. 2020లోనే ఈ టోర్నమెంట్ జరగాల్సి ఉన్నా.. కరోనా కారణంగా వాయిదా పడింది. శ్రీలంక (Sri Lanka) వేదికగా ఈ టోర్నీ జరగాల్సి ఉంది. అయితే ప్రస్తుతం అక్కడ ఆర్థిక సంక్షోభం నెలకొని ఉండటంతో టోర్నీని యూఏఈకి తరలించారు. ఈ టోర్నీలో మొత్తం ఆరు జట్లు పాల్గొంటున్నాయి. ఆగస్టు 27న మొదలై సెప్టెంబర్ 11న ముగియనుంది. ఇప్పటికే భారత్ (India), పాకిస్తాన్ (Pakistan) జట్లు ఈ టోర్నీ కోసం తమ జట్లను ప్రకటించాయి. తాజాగా ఈ జాబితాలోకి బంగ్లాదేశ్ కూడా చేరింది. 17 మంది సభ్యులతో కూడిన బంగ్లాదేశ్ జట్టును ఆ దేశ క్రికెట్ బోర్డు ప్రకటించింది. కెప్టెన్ గా సీనియర్ ఆల్ రౌండర్ షకీబుల్ హసన్ ను ఎంపిక చేసింది.

షకీబుల్ హసన్ బెట్ విన్నర్ అనే బెట్టింగ్ యాప్ కు ప్రచారకర్తగా ఉన్నాడు. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు రూల్స్ ప్రకారం కాంట్రాక్టు ఉన్న ప్లేయర్లు ఎటువంటి బెట్టింగ్ యాప్ లతో సంబంధాలను కలిగి ఉండరాదు.  ఫలితంగా షకీబుల్  హసన్ పై వేటు వేసే అవకావం ఉన్నట్లు వార్తలు కూడా వచ్చాయి. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు షకీబుల్ హసన్ ను గట్టిగా హెచ్చరించడంతో అతడు ఈ బెట్టింగ్ యాప్ నుంచి తప్పుకున్నాడు. దాంతో అతడిని ఆసియా కప్ లో ఆడే బంగ్లాదేశ్ జట్టుకు కెప్టెన్ గా ఎంపిక చేస్తూ బీసీబీ నిర్ణయం తీసుకుంది.బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు గత కొంతకాలంగా టి20 ఫార్మాట్ లో పెద్దగా రాణించడం లేదు. వెస్టిండీస్ తో జరిగిన టి20 సిరీస్ ను కోల్పోవడంతో పాటు ఇటీవలె ముగిసిన జింబాబ్వే పర్యటనలోనూ చెత్త ప్రదర్శన కనబరిచింది. జింబాబ్వేతో జరిగిన మూడు మ్యాచ్ ల టి20 సిరీస్ లో ఒక్క మ్యాచ్ కూడా గెలవలేకపోయింది. అనంతరం జరిగిన వన్డే సిరీస్ లో కూడా బంగ్లాదేశ్ పేలవ ప్రదర్శన చేసింది. ఈ రెండు సిరీస్ ల్లోనూ జింబాబ్వే గెలవడం విశేషం. ఈ క్రమంలో ఆసియా కప్ లో బంగ్లాదేశ్ ఏ విధమైన ప్రదర్శన చేస్తుందో చూడాలి. గ్రూప్ ’ఎ‘లో భారత్, పాకిస్తాన్, క్వాలిఫయర్ జట్లు.. గ్రూప్ ‘బి’లో అఫ్గానిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు ఉన్నాయి.బంగ్లాదేశ్ జట్టు
షకీబుల్ హసన్ (కెప్టెన్), అనాముల్ హక్, ముష్ఫికర్ రహీమ్, అఫీఫ్ హొస్సేన్, మొసద్దెక్ హొస్సేన్, మహ్మదుల్లా, మహేదీ హసన్, మహ్మద్ సైఫుద్దీన్, హసన్ మహమూద్, ముస్తాఫిజుర్ రహ్మాన్, నసుమ్ అహ్మద్, సబ్బీర్ రహ్మాన్, ఇహొసా పర్హమాన్, మెహిదీ హసనోత్ నూరుల్ హసన్ సోహన్, తస్కిన్ అహ్మద్
Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Asia Cup 2022, Bangladesh, Dinesh Karthik, Rishabh Pant, Rohit sharma, Team India, Virat kohli

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు