హోమ్ /వార్తలు /క్రీడలు /

Asia Cup 2022 : అవుటయ్యాననే కోపంలో బౌలర్ పై చేయి చేసుకున్న పాక్ బ్యాటర్.. బ్యాట్ తో కూడా కొట్టబోయాడు.. వీడియో

Asia Cup 2022 : అవుటయ్యాననే కోపంలో బౌలర్ పై చేయి చేసుకున్న పాక్ బ్యాటర్.. బ్యాట్ తో కూడా కొట్టబోయాడు.. వీడియో

PC : TWITTER

PC : TWITTER

Asia Cup 2022 : ఉత్కంఠ భరితంగా సాగే పోరుల్లో ఆటగాళ్లు విచక్షణను కోల్పోవడం సహజంగానే చూస్తుంటాం. ఇలాంటి ఘటనే ఆసియా కప్ (Asia Cup) 2022లో చోటు చేసుకుంది. సూపర్ 4లో భాగంగా బుధవారం పాకిస్తాన్ (Pakistan), అఫ్గానిస్తాన్ (Afghanistan) జట్లు తలపడ్డాయి.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Asia Cup 2022 : ఉత్కంఠ భరితంగా సాగే పోరుల్లో ఆటగాళ్లు విచక్షణను కోల్పోవడం సహజంగానే చూస్తుంటాం. ఇలాంటి ఘటనే ఆసియా కప్ (Asia Cup) 2022లో చోటు చేసుకుంది. సూపర్ 4లో భాగంగా బుధవారం పాకిస్తాన్ (Pakistan), అఫ్గానిస్తాన్ (Afghanistan) జట్లు తలపడ్డాయి. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్ లో చివరకు పాకిస్తాన్ వికెట్ తేడాతో గట్టెక్కింది. అయితే మ్యాచ్ లో పాకిస్తాన్ బ్యాటర్ అసిఫ్ అలీ (Asif Ali) అవుటయ్యాక సంబరాలు చేసుకుంటున్న అఫ్గానిస్తాన్ బౌలర్ పైకి దూసుకెళ్లాడు.  ఇద్దరు ఆటగాళ్లు ఒకానొక సందర్భంలో కొట్టుకోబోయారు. అయితే ఇతర ప్లేయర్లు కలుగజేసుకుని ఇద్దరి మధ్య గొడవ జరగకుండా జాగ్రత్త పడ్డారు. ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ విజయం సాధించడంతో ఫైనల్ కు చేరుకుంది. ఇక ఆడిన రెండు మ్యాచ్ ల్లోనూ ఓడిన భారత్, పాకిస్తాన్ జట్లు ఇంటిదారి పట్టాయి.

130 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్.. 18 ఓవర్లు ముగిసే సరికి 7 వికెట్ల నష్టానికి 109 పరుగులు చేసింది. విజయానికి 12 బంతుల్లో 21 పరుగులు కావాలి. ఇక బౌలింగ్ కు వచ్చిన ఫరీద్ తన రెండో బంతికి హరీస్ రావూఫ్ ను పెవిలియన్ కు చేర్చాడు. అయితే నాలుగో బంతిని అసిఫ్ అలీ భారీ సిక్సర్ బాదాడు. ఆ తర్వాతి  బంతితో అలీని బోల్తా కొట్టించిన ఫరీద్ వికెట్ రాబట్టాడు. కీలక వికెట్ తీశానన్న ఆనందంలో ఫరీద్ అలీ ముందు ఫిస్ట్ బంప్ చేశాడు. అంతే సహనం కోల్పోయిన అలీ ఫరీద్ తో గొడవకు దిగాడు. కుడి చేతితో ఫరీద్ చెంపపై కొట్టాడు. దాంతో ఆగ్రహించిన ఫరీద్ అలీతో గొడవకు దిగాడు. మరింతగా ఆగ్రహించిన అలీ పిచ్చి పట్టిన వాడిలా బ్యాట్ తో దాదాపుగా ఫరీద్ తలను కొట్టబోయాడు. అయితే అక్కడే ఉన్న మిగతా ప్లేయర్లు కల్పించుకుని గొడవను సద్దుమణిగేలా చేశాడు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

వికెట్ తీశాక ఏ బౌలర్ అయినా సంబరాలు చేసుకోవడం ఖాయం. అందులోనూ సిక్సర్ బాదాక వికెట్ తీయడంతో ఫరీద్ కాస్త ఎక్కువగానే చేసుకున్నాడు. అలీ లాంటి హిట్టర్ ను కీలక సమయంలో అవుట్ చేశాననే ఆనందాన్ని ఫరీద్ కనబర్చాడు. ఈ సమయంలో ఈ బ్యాటర్ అయినా సరే కామ్ గా వెళ్లిపోతారు. కానీ, అలీ మాత్రం అలా చేయలేదు. అవుటయ్యానన్న అక్కసును బౌలర్ పై చూపే ప్రయత్నం చేశాడు. ఇక చివరి వరకు పోరాడిన అఫ్గానిస్తాన్ ఒక దశలో విజయం సాధించేలా కనిపించింది. అయితే పాక్ పేసర్ నసీం షా వరుసగా రెండు సిక్సర్లు బాది పాక్ ను ఫైనల్లోకి చేర్చాడు.

Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Afghanistan, Asia Cup 2022, Babar Azam, Dinesh Karthik, Hardik Pandya, KL Rahul, Pakistan, Rishabh Pant, Rohit sharma, Team India, Virat kohli

ఉత్తమ కథలు