Home /News /sports /

ASIA CUP 2022 ASIA CUP 2022 SCHEDULE FORMAT TEAMS VENUE INDIA SQUAD DATE MATCHES MATCH LIST FIXTURES GROUPS LIVE SJN

Asia Cup 2022 : ఆసియా కప్ షెడ్యూల్ విడుదల.. భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఎప్పుడంటే?

IND vs PAK

IND vs PAK

Asia Cup 2022 : భారత్ (India), పాకిస్తాన్ (Pakistan) మ్యాచ్ లు తలపడుతున్నాయంటే అది బ్లాక్ బాస్టర్ మ్యాచ్ అని అందరికీ తెలిసిన విషయమే. ఇక పురుషుల క్రికెట్ లో ఈ రెండు జట్లు ఆడుతున్నాయంటే అది ఊహించని బ్లాక్ బాస్టర్. తాజాగా ఈ రెండు జట్లు మరోసారి తలపడనున్నాయి.

ఇంకా చదవండి ...
Asia Cup 2022 : భారత్ (India), పాకిస్తాన్ (Pakistan) మ్యాచ్ లు తలపడుతున్నాయంటే అది బ్లాక్ బాస్టర్ మ్యాచ్ అని అందరికీ తెలిసిన విషయమే. ఇక పురుషుల క్రికెట్ లో ఈ రెండు జట్లు ఆడుతున్నాయంటే అది ఊహించని బ్లాక్ బాస్టర్. తాజాగా ఈ రెండు జట్లు మరోసారి తలపడనున్నాయి. చివరిసారిగా ఈ రెండు జట్లు గతేడాది జరిగిన టి20 ప్రపంచకప్ (World cup)లో తలడగా.. మళ్లీ ఆడలేదు. ఇప్పుడు ఆసియా కప్ టోర్నీ రూపంలో భారత్, పాక్ మరోసారి సై అంటే సై అంటున్నాయి. ఆసియా కప్ (Asia Cup) ఈ నెల 27 నుంచి సెప్టెంబర్ 11 వరకు జరగనున్నాయి. మొత్తం 6 జట్లు ఇందులో పాల్గొంటున్నాయి. ఇందులో 5 జట్లు (భారత్, పాకిస్తాన్, శ్రీలంక, అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్) ఇప్పటికే అర్హత సాధించాయి. ఒక టీం కోసం నాలుగు జట్లు (హాంకాంగ్, కువైట్, సింగపూర్, యూఏఈ) పోటీ పడుతున్నాయి. ఇవి క్వాలిఫయర్ టోర్నీ ఆడాల్సి ఉంది.

షెడ్యూల్  ఇలా

ఆగస్టు 27న శ్రీలంక వర్సెస్ అఫ్గానిస్తాన్ పోరుతో ఈ టోర్నీ ఆరంభం కానుంది. ఇక 28న (ఆదివారం) భారత్ పాకిస్తాన్ జట్లు తాడోపేడో తేల్చుకోనున్నాయి. గ్రూప్ ’ఎ‘లో భారత్ తో పాటు పాకిస్తాన్, క్వాలిఫయర్ జట్లు ఉంటాయి, గ్రూప్ ’బి‘లో శ్రీలంక, అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్ జట్లు ఉన్నాయి. ప్రతి జట్టు కూడా గ్రూప్ లోని ఇతర జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. అనంతరం టాప్ 2లో నిలిచిన నాలుగు జట్లు సూపర్ 4 రౌండ్ కుఅర్హత సాధిస్తాయి. ఇందులో ప్రతి జట్టు కూడా మిగిలిన మూడు జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. ఈ రౌండ్ పూర్తయ్యాక టాప్ 2లో నిలిచిన జట్లు ఫైనల్ కు వెళ్తాయి. ఫైనల్ పోరు సెప్టెంబర్ 11న జరగనుంది. మ్యాచ్ లన్నీ భారత కాలమానం ప్రకారం సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు ఆరంభం కానున్నాయి.

























































































ఎప్పుడుఎవరు ఎవరితోవేదికసమయం
ఆగస్టు 27శ్రీలంక X అఫ్గానిస్తాన్దుబాయ్సా. గం. 5.30
ఆగస్టు 28పాకిస్తాన్ X భారత్దుబాయ్సా.గం. 5.30
ఆగస్టు 30బంగ్లాదేవ్ X  అఫ్గానిస్తాన్షార్జాసా.గం. 5.30
ఆగస్టు 31భారత్ X  క్వాలిఫయర్దుబాయ్సా.గం. 5.30
సెప్టెంబర్ 1శ్రీలంక X బంగ్లాదేశ్దుబాయ్సా.గం. 5.30
సెప్టెంబర్ 2పాకిస్తాన్ X క్వాలిఫయర్షార్జాసా.గం. 5.30
సెప్టెంబర్ 3బి1 X బి2షార్జాసా.గం. 5.30
సెప్టెంబర్ 4ఏ1 X ఏ2దుబాయ్సా.గం. 5.30
సెప్టెంబర్ 6ఏ1 X బి1దుబాయ్సా.గం. 5.30
సెప్టెంబర్ 7ఏ2 X బి2దుబాయ్సా.గం. 5.30
సెప్టెంబర్ 8ఏ1 X బి2దుబాయ్సా.గం. 5.30
సెప్టెంబర్ 9బి1 X  ఏ2దుబాయ్సా.గం. 5.30
సెప్టెంబర్ 11ఫైనల్దుబాయ్సా.గం. 5.30

వాస్తవానికి ఈ టోర్నీ శ్రీలంక వేదికగా జరగాల్సి ఉంది. అది కూడా 2020లో అయితే కరోనా వల్ల ఈ టోర్నీ 2022కి వాయిదా పడింది. అయితే శ్రీలంకలో ఆర్థిక పరిస్థితులు సరిగ్గా లేకపోవడంతో తాము ఈ టోర్నీని నిర్వహించలేమంటూ శ్రీలంక క్రికెట్ బోర్డు చేతులెత్తేసింది. దాంతో టోర్నీని యూఏఈకి తరలించారు. టి20 ఫార్మాట్ లో ఈ టోర్నీ జరగనుంది.

డిఫెండింగ్ చాంపియన్ గా ఇండియా

ఆసియా కప్ లో భారత జట్టు డిఫెండింగ్ చాంపియన్ గా బరిలోకి దిగనుంది. ఆసియా కప్ ఇప్పటి వరకు 14 సార్లు జరగ్గా.. అందులో భారత్ ఏకంగా 7 సార్లు చాంపియన్ గా నిలిచింది. భారత్ తర్వాత శ్రీలంక అత్యధికంగా 5 సార్లు ఆసియా చాంపియన్ గా నిలిచింది. పాకిస్తాన్ 2 సార్లు మాత్రమే చాంపియన్ గా నిలువడం గమనార్హం.
Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Babar Azam, Dinesh Karthik, Hardik Pandya, India VS Pakistan, India Vs Westindies, Rohit sharma, Team India, Virat kohli

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు