హోమ్ /వార్తలు /క్రీడలు /

Asia Cup 2022 : వీడెక్కడి థర్డ్ అంపైర్ రా బాబూ.. రీప్లే లో చూసి కూడా నాటౌట్ ను అవుట్ గా ప్రకటించాడు..

Asia Cup 2022 : వీడెక్కడి థర్డ్ అంపైర్ రా బాబూ.. రీప్లే లో చూసి కూడా నాటౌట్ ను అవుట్ గా ప్రకటించాడు..

PC : TWITTER

PC : TWITTER

Asia Cup 2022 : ఆసియా కప్ (Asia Cup) 2022 ఘనంగా ఆరంభమైంది. నాలుగేళ్ల గ్యాప్ తర్వాత మరోసారి ఈ మెగా ఈవెంట్ ప్రేక్షకులను అలరించేందుకు ముందుకు వచ్చింది. యూఏఈ వేదికగా ఈ నెల 27 నుంచి సెప్టెంబర్ 11 వరకు ఈ మెగా టోర్నీ జరగనుంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Asia Cup 2022 : ఆసియా కప్ (Asia Cup) 2022 ఘనంగా ఆరంభమైంది. నాలుగేళ్ల గ్యాప్ తర్వాత మరోసారి ఈ మెగా ఈవెంట్ ప్రేక్షకులను అలరించేందుకు ముందుకు వచ్చింది. యూఏఈ వేదికగా ఈ నెల 27 నుంచి సెప్టెంబర్ 11 వరకు ఈ మెగా టోర్నీ జరగనుంది. శనివారం దుబాయ్ వేదికగా జరిగిన ఆరంభ పోరులో గ్రూప్ ‘బి’లోని అఫ్గానిస్తాన్ (Afghanistan), శ్రీలంక (Sri Lanka) జట్లు తలపడ్డాయి. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా అటు ఆన్ ఫీల్డ్ ఇటు టీవీ అంపైర్లు తీసుకున్న నిర్ణయాలు వివాాదాస్పదం అయ్యాయి. కళ్లకు గంతలు కట్టుకొని అంపైరింగ్ చేసినట్లు మ్యాచ్ చూసిన వారికి అర్థం అవుతుంది. ఫలితంగా అభిమానులతో చివాట్లు తింటున్నారు.


ఇది కూడా చదవండి  : రెండు సార్లు ప్రపంచకప్ అందించిన ధోనికే సాధ్యం కాని రికార్డును సాధించనున్న కోహ్లీ.. ఏంటంటే?


అఫ్గానిస్తాన్, శ్రీలంక జట్ల మధ్య ఈ తప్పుడు నిర్ణయం నమోదైంది. శ్రీలంక ఇన్నింగ్స్‌ 2 ఓవర్‌ వేసిన నవీన్‌ ఉల్‌ హక్‌ బౌలింగ్‌లో బంతి పాతుమ్ నిస్సంక బ్యాట్‌కు దగ్గరగా వెళ్తూ వికెట్‌ కీపర్‌ చేతికి వెళ్లింది. వెంటనే బౌలర్‌తో పాటు వికెట్‌ కీపర్‌ కూడా క్యాచ్‌కు అప్పీల్‌ చేశాడు. అయితే ఫీల్డ్‌ అంపైర్‌ అనిల్‌ చౌదరి వెంటనే ఔట్‌ అని వేలు పైకిత్తాడు.



ఈ క్రమంలో నిస్సంక నాన్‌ స్ట్రైకింగ్‌లో ఉన్న గుణతిలకతో చర్చించి రివ్యూకు వెళ్లాడు. అయితే రిప్లేలో బ్యాట్‌ను బంతి దాటే సమయంలో ఎటువంటి స్పైక్‌ కనిపించలేదు. అయినప్పటికీ థర్డ్‌ అంపైర్‌ మాత్రం బంతి బ్యాట్‌కు తాకినట్లు కన్పించింది అంటూ ఔట్‌గా ప్రకటించాడు.  థర్డ్‌ అంపైర్‌ తీసుకున్న ఈ నిర్ణయంతో బ్యాటర్‌తో పాటు డగౌట్‌లో ఉన్న శ్రీలంక జట్టు మేనేజ్‌మెంట్‌ కూడా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. కాగా ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. థర్డ్‌ అంపైర్‌ తీసుకున్న ఈ నిర్ణయంపై శ్రీలంక అభిమానులు విమర్శలు వర్షం కురిపిస్తున్నారు.








ఇదొక్కటే కాదు అఫ్గానిస్తాన్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలోనూ అంపైర్ అనిల్ చౌదరి ఎల్బీ విషయంలో తప్పుడు నిర్ణయాన్ని ప్రకటించాడు. అయితే వెంటనే అఫ్గాన్ బ్యాటర్ రివ్యూకు వెళ్లడం అక్కడ హాక్ ఐ వికెట్లను తాకడం లేదని తేల్చడంతో టీవీ అంపైర్ నాటౌట్ గా ప్రకటించాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే అఫ్గానిస్తాన్ 8 వికెట్ల తేడాతో శ్రీలంకపై ఘనవిజయం సాధించింది.

Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Afghanistan, Asia Cup 2022, IND vs PAK, India VS Pakistan, Rashid Khan, Rohit sharma, Sri Lanka, Virat kohli

ఉత్తమ కథలు