హోమ్ /వార్తలు /క్రీడలు /

AFG vs SL : ఇదేందయ్యా ఇది.. మరీ ఇంత దారుణమా.. అఫ్గాన్ దెబ్బకు కుప్పకూలిన శ్రీలంక.. టార్గెట్ ఎంతంటే?

AFG vs SL : ఇదేందయ్యా ఇది.. మరీ ఇంత దారుణమా.. అఫ్గాన్ దెబ్బకు కుప్పకూలిన శ్రీలంక.. టార్గెట్ ఎంతంటే?

PC : TWITTER

PC : TWITTER

AFG vs SL : ఆసియా కప్ (Asia Cup) 2022 ఊహించని రీతిలో ఆరంభమైంది. దుబాయ్ వేదికగా శనివారం జరుగుతోన్న గ్రూప్ ‘బి’పోరులో అఫ్గానిస్తాన్ (Afghanistan), శ్రీలంక (Sri Lanka) జట్లు తలపడుతున్నాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

AFG vs SL : ఆసియా కప్ (Asia Cup) 2022 ఊహించని రీతిలో ఆరంభమైంది. దుబాయ్ వేదికగా శనివారం జరుగుతోన్న గ్రూప్ ‘బి’పోరులో అఫ్గానిస్తాన్ (Afghanistan), శ్రీలంక (Sri Lanka) జట్లు తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన శ్రీలంకను అఫ్గాన్ బౌలర్లు ఓ ఆట ఆడుకున్నారు. దాంతో లంక జట్టు 19.4 ఓవర్లలో 105 పరుగులకు ఆలౌటైంది. శ్రీలంక తరఫున భానుక రాజపక్స (29 బంతుల్లో 38; 5 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్ గా నిలిచాడు. చివర్లో చమిక కరుణరత్నే (38 బంతుల్లో 31; 3 ఫోర్లు, 1 సిక్స్) నిలబడటంతో శ్రీలంక 100 పరుగుల మార్కును అందుకోగలిగింది. ఫరూఖీ మూడు వికెట్లు తీశాడు. నవీన్ ఉల్ హక్, మొహమ్మద్ నమీ చెరో రెండు వికెట్లు తీశారు.


తొలి ఓవర్ లోనే షాక్


టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన శ్రీలంకకు తొలి ఓవర్ లోనే భారీ షాక్ తగిలింది. మొదటి ఓవర్ వేయడానికి వచ్చిన ఫరూఖీ ఆ ఓవర్ చివరి రెండు బంతులకు కుశాల్ మెండీస్ (2), చరిత్ అసలంక (0)లను వరుసగా అవుట్ చేశాడు. మరో ఎండ్ లో బౌలింగ్ కు దిగిన నవీన్ ఉల్ హక్ కూడా పాతుమ్ నిస్సంక (3)ను అవుట్ చేశాడు. దాంతో శ్రీలంక 5 పరుగులకే టాపార్డర్ వికెట్లను కోల్పోయింది.



ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన భానుక రాజపక్స, దనుష్క గుణతిలక (17)లు జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. వీరు నెమ్మదిగా ఆడుతూ ఒక్కో పరుగును జత చేశారు. వీరిద్దరు మూడో వికెట్ కు 45 పరుగులు జోడించారు. అయితే బౌలింగ్ కు వచ్చిన ముజీబ్ ఉర్ రహ్మాన్ గుణతిలకను పెవిలియన్ కు చేర్చాడు. కాసేపటికే హసరంగ (2), అనవసరపు పరుగో కోసం ప్రయత్నించి భానుక రాజపక్స రనౌట్ అయ్యాడు. ఆ తర్వాత కూడా వికెట్లు పడటంతో శ్రీలంక 75 పరుగులకే 9 వికెట్లు కోల్పోయింది. 100 కూడా చేస్తుందా లేదా అనే తరుణంలో చమిక కరుణ రత్నే పోరాడటంతో శ్రీలంక 100 మార్కును చేరుకోగలిగింది.


100లో సూపర్


అఫ్గానిస్తాన్ జట్టుకు ఇది 100వ అంతర్జాతీయ టి20 మ్యాచ్ కావడం విశేషం. ఈ వందలో అఫ్గాన్ అదిరిపోయే ప్రదర్శన చేసింది. బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పాటు నబీ అద్బుత రనౌట్ శ్రీలంకను తక్కువ పరుగులకే కట్టడి చేసేలా చేశాయి. తొలి టి20ని అఫ్గాన్ 2010లో ఐర్లాండ్ తో ఆడింది.


తుది జట్లు


అఫ్గానిస్తాన్


మొహమ్మద్ నబీ (కెప్టెన్), జజాయ్, గుర్జాజ్, జద్రాన్, జన్నత్, జద్రాన్, రషీద్, ఒమరాజై, నవీన్, ఉర్ రహ్మాన్, ఫరూఖీ


శ్రీలంక


గుణతిలక, నిస్సంక, కుశాల్ మెండీస్, అసలంక, రాజపక్స, షనక (కెప్టెన్), హసరంగ, కరుణరత్నే, తీక్షణ, మదుషనక, పతిరణ

Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Afghanistan, Asia Cup 2022, India VS Pakistan, Rashid Khan, Sri Lanka

ఉత్తమ కథలు