హోమ్ /వార్తలు /క్రీడలు /

Asia Cup 2022 : స్నేక్ షాట్లతో ప్రాక్టీస్ లో రచ్చ రచ్చ చేసిన రషీద్ ఖాన్.. వీడియో చూస్తే వావ్ అనాల్సిందే

Asia Cup 2022 : స్నేక్ షాట్లతో ప్రాక్టీస్ లో రచ్చ రచ్చ చేసిన రషీద్ ఖాన్.. వీడియో చూస్తే వావ్ అనాల్సిందే

PC : TWITTER

PC : TWITTER

Asia Cup 2022 : యూఏఈ వేదికగా ఆసియా కప్ (Asia Cup) 2022 మరికొన్ని గంటల్లో ఆరంభం కానున్న సంగతి తెలిసిందే. శనివారం టోర్నీ ఆరంభ మ్యాచ్ లో ఐదు సార్లు చాంపియన్ శ్రీలంక (Sri Lanka)తో అఫ్గానిస్తాన్ (Afghanistan) తలపడనుంది. బలాబలాలను చూస్తే రెండు జట్లు కూడా సమంగా ఉన్నాయి.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Asia Cup 2022 : యూఏఈ వేదికగా ఆసియా కప్ (Asia Cup) 2022 మరికొన్ని గంటల్లో ఆరంభం కానున్న సంగతి తెలిసిందే. శనివారం టోర్నీ ఆరంభ మ్యాచ్ లో ఐదు సార్లు చాంపియన్ శ్రీలంక (Sri Lanka)తో అఫ్గానిస్తాన్ (Afghanistan) తలపడనుంది. బలాబలాలను చూస్తే రెండు జట్లు కూడా సమంగా ఉన్నాయి. శ్రీలంక నిలకడలేమితో ఇబ్బంది పడుతుంది. అదే సమయంలో అఫ్గానిస్తాన్ టి20ల్లో మెరుగైన జట్టుగా తయారైంది. రషీద్ ఖాన్ (Rashid Khan), మొహమ్మద్ నబీ (Mohammed Nabi) లాంటి ప్లేయర్లు టి20ల్లో అత్యంత ప్రమాదకర ప్లేయర్లుగా ఉన్నారు. దాంతో శనివారం శ్రీలంకతో జరిగే మ్యాచ్ లో అఫ్గానిస్తాన్ విజయం సాధించాలని పట్టుదలగా ఉంది. ఇందుకోసం ఆ జట్టు ప్లేయర్లు నెట్స్ తో తీవ్రంగా చెమటోడ్చారు.


ఇది కూడా చదవండి : షోయబ్ మాలిక్ మాత్రమే కాదు.. మరో ముగ్గురు పాక్ క్రికెటర్లు కూడా భారత్ అల్లుళ్లే.. వారెవరంటే?


లెగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్ శుక్రవారం నెట్స్ లో తీవ్రంగా శ్రమించాడు. భారీ షాట్లు ఆడతూ కనిపించాడు. ముఖ్యంగా తన ఫేవరెట్ షాట్ అయిన స్నేక్ షాట్ ను ప్రాక్టీస్ చేశాడు. బౌలర్ గానే కాకుండా బ్యాటర్ గా కూడా శ్రీలంకకు హెచ్చరికలు జారీ చేశాడు. దీనికి సంబంధించిన వీడియోను ట్విట్టర్ లో షేర్ చేశాడు. ప్రస్తుతం ఇది వైరల్ అవుతోంది. ఆలస్యం ఎందుకు మీరు కూడా చూసేయండి




చెమటోడ్చిన భారత ప్లేయర్లు


కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ శుక్రవారం నెట్స్ లో కఠోర సాధన చేశారు. వీరిద్దరు కూడా పోటీ పడి మరీ నెట్స్ లో చెమటోడ్చారు. గత కొంత కాలంగా కోహ్లీ ఫామ్ లో లేని విషయం తెలిసిందే. ఇంగ్లండ్ పర్యటన అనంతరం అతడు క్రికెట్ కు విరామం ప్రకటించి ఆసియా కప్ తో పునరాగమనం చేయనున్నాడు. అదే సమయంలో రోహిత్ శర్మ కూడా మునుపటిలా ధాటిగా ఆడటం లేదు. దాంతో వీరిద్దరు పాకిస్తాన్ తో జరిగే మ్యాచ్ లో రెచ్చిపోవాలని పట్టుదలగా ఉన్నారు. కోహ్లీ స్విచ్ హిట్లను కూడా ప్రాక్టీస్ చేయడం విశేషం.



రోహిత్ కోహ్లీలతో పాటు రిషభ్ పంత్, జడేజాలు కూడా నెట్స్ లో చెమటోడ్చారు. వీరు ప్రాక్టీస్ మొత్తం భారీ షాట్లు బాదారు. అనంతరం హార్దిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్, కేెఎల్ రాహుల్ కూడా ప్రాక్టీస్ చేశారు. అదే సమయంలో భువనేశ్వర్ కుమార్, అర్ష్ దీప్ సింగ్, చహల్, అశ్విన్, అవేశ్ ఖాన్, దీపక్ చహర్ లు బౌలింగ్ ప్రాక్టీస్ చేశారు. 28న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ తో భారత్ తలపడనుంది.

Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Afghanistan, Asia Cup 2022, Dinesh Karthik, Hardik Pandya, IND vs PAK, India VS Pakistan, Rashid Khan, Ravindra Jadeja, Rishabh Pant, Rohit sharma, Sri Lanka, Virat kohli

ఉత్తమ కథలు