హోమ్ /వార్తలు /క్రీడలు /

AFG vs SL : ఆసియా కప్ లో తొలి మ్యాచ్.. టాస్ నెగ్గిన అఫ్గానిస్తాన్.. బరిలో జూనియర్ మలింగ.. తుది జట్లు ఇవే

AFG vs SL : ఆసియా కప్ లో తొలి మ్యాచ్.. టాస్ నెగ్గిన అఫ్గానిస్తాన్.. బరిలో జూనియర్ మలింగ.. తుది జట్లు ఇవే

PC : TWITTER

PC : TWITTER

Asia Cup 2022 - AFG vs SL : ఆసియా కప్ (Asia Cup) 2022 శనివారం ఘనంగా ఆరంభమైంది. తొలి పోరులో ఐదు సార్లు చాంపియన్ శ్రీలంక (Sri Lanka)తో అఫ్గానిస్తాన్ (Afghanistan) తలపడనుంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Asia Cup 2022 - AFG vs SL : ఆసియా కప్ (Asia Cup) 2022 శనివారం ఘనంగా ఆరంభమైంది. తొలి పోరులో ఐదు సార్లు చాంపియన్ శ్రీలంక (Sri Lanka)తో అఫ్గానిస్తాన్ (Afghanistan) తలపడనుంది. టాస్ నెగ్గిన అఫ్గానిస్తాన్ కెప్టెన్ మొహమ్మద్ నబీ (Mohammad Nabi) ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. అఫ్గానిస్తాన్ కు ఇది 100వ అంతర్జాతీయ మ్యాచ్ కావడం విశేషం. దుబాయ్ వేదికగా గ్రూప్ ‘బి’లో భాగంగా అఫ్గానిస్తాన్, శ్రీలంక జట్లు తలపడనున్నాయి. బలాబలాల పరంగా చూస్తే ఇరు జట్లు కూడా సమంగానే ఉన్నాయి. ఈ మ్యాచ్ ద్వారా జూనియర్ మలింగ మతీశ్ పతిరణ టి20ల్లో అరంగేట్రం చేయనున్నాడు.


అఫ్గానిస్తాన్ సూపర్ అచీవ్ మెంట్


ఈ మ్యాచ్ ద్వారా అఫ్గానిస్తాన్ జట్టు టి20ల్లో అరుదైన ఘనతను సొంతం చేసుకోనుంది. శ్రీలంకతో జరిగే ఈ మ్యాచ్ ద్వారా అఫ్గానిస్తాన్ 100వ టి20 మ్యాచ్ ను ఆడనుంది. అఫ్గానిస్తాన్ తొలి టి20ని 2010లో ఐర్లాండ్ పై ఆడింది. పసికూనగా క్రికెట్ ను ఆరంభించిన అఫ్గానిస్తాన్ ప్రస్తుతం హేమాహేమీ జట్లకు కూడా షాక్ ఇచ్చే రేంజ్ కు చేరుకుంది. టెస్టు, వన్డేల్లో పెద్దగా సక్సెస్ కాకపోయినా.. టి20ల్లో మాత్రం అఫ్గాన్ సూపర్ సక్సెస్ అయ్యింది. అందుకు కారణం ఆ దేశ ప్లేయర్లు వివిద దేశాల్లోని క్రికెట్ లీగుల్లో ఆడటమే. ముఖ్యంగా రషీద్ ఖాన్, మొహమ్మద్ నమీ, జజాయ్, జద్రాన్ ఉర్ రహ్మాన్, ఫరూఫీ లాంటి ప్లేయర్లు విదేశాల్లో జరిగే లీగుల్లో ఆడుతూ టి20ల్లో అపార అనుభవాన్ని సంపాదించుకున్నారు. ముఖ్యంగా రషీద్ ఖాన్, నబీ, ముజీబ్ ఉర్ రహ్మాన్ లు టి20ల్లో అత్యంత ప్రమాదకార ప్లేయర్లుగా తయారయ్యారు.


అనిశ్చితిలో శ్రీలంక


మరోవైపు శ్రీలంక తీవ్ర అనిశ్చితిలో కూరుకుపోయింది. ఒకవైపు దేశంలో ఆర్థిక సంక్షోభంతో పాటు మరోవైపు జట్టుగా ప్రపంచ వేదికలపై విఫలం అవ్వడం ఆ జట్టును బలహీనంగా మార్చేసింది. ఈ ఆసియా కప్ శ్రీలంక వేదికగా జరగాల్సి ఉంది. అయితే ఆర్థిక సంక్షోభం వల్ల ఆసియా కప్ ను నిర్వహించడం తమ వల్ల కాదంటూ ఆతిథ్యం నుంచి తప్పుకుంది. దాంతో ఈవెంట్ యూఏఈకి తరలిపోయింది. షనక నాయకత్వలోని శ్రీలంకలో ప్రతిభగల ప్లేయర్లకు లోటు లేకపోయినా సమష్టిగా ఆడటంలో విఫలం అవుతున్నారు.


తుది జట్లు


అఫ్గానిస్తాన్


మొహమ్మద్ నబీ (కెప్టెన్), జజాయ్, గుర్జాజ్, జద్రాన్, జన్నత్, జద్రాన్, రషీద్, ఒమరాజై, నవీన్, ఉర్ రహ్మాన్, ఫరూఖీ


శ్రీలంక


గుణతిలక, నిస్సంక, కుశాల్ మెండీస్, అసలంక, రాజపక్స, షనక (కెప్టెన్), హసరంగ, కరుణరత్నే, తీక్షణ, మదుషనక, పతిరణ

Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Afghanistan, Asia Cup 2022, IND vs PAK, India VS Pakistan, Rashid Khan, Sri Lanka

ఉత్తమ కథలు