హోమ్ /వార్తలు /క్రీడలు /

AFG vs SL : శ్రీలంకను కుమ్మేసిన అఫ్గాన్ ఓపెనర్లు.. లక్ష్యాన్ని కేవలం 61 బంతుల్లోనే ఛేదించేశారుగా..

AFG vs SL : శ్రీలంకను కుమ్మేసిన అఫ్గాన్ ఓపెనర్లు.. లక్ష్యాన్ని కేవలం 61 బంతుల్లోనే ఛేదించేశారుగా..

PC : TWITTER

PC : TWITTER

AFG vs SL : ఆసియా కప్ (Asia Cup) 2022 సంచలన ప్రదర్శనతో మొదలైంది. దుబాయ్ వేదికగా జరిగిన టోర్నీ ఆరంభ మ్యాచ్ లో అఫ్గానిస్తాన్ (Afghanistan) జట్టు శ్రీలంక (Sri Lanka)పై 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఫలితంగా టోర్నీలో శుభారంభం చేసింది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

AFG vs SL : ఆసియా కప్ (Asia Cup) 2022 సంచలన ప్రదర్శనతో మొదలైంది. దుబాయ్ వేదికగా జరిగిన టోర్నీ ఆరంభ మ్యాచ్ లో అఫ్గానిస్తాన్ (Afghanistan) జట్టు శ్రీలంక (Sri Lanka)పై 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఫలితంగా టోర్నీలో శుభారంభం చేసింది. గ్రూప్ ‘బి’లో భాగంగా జరిగిన ఈ మ్యాచ్ లో ఆల్ రౌండ్ ప్రదర్శనతో శ్రీలంకను ముప్పుతిప్పలు పెట్టిన అఫ్గానిస్తాన్ అద్భుత విజయాన్ని అందుకుంది. 106 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గాన్.. కేవలం 10.1 ఓవర్లలోనే కేవలం 2 వికెట్లను మాత్రమే కోల్పోయి 106 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. అఫ్గాన్ ఓపెనర్లు రహ్మనుల్లా గుర్బాజ్ (18 బంతుల్లో 40; 3 ఫోర్లు, 4 సిక్సర్లు), హజ్రతుల్లా జజాయ్ (28 బంతుల్లో 37 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్) మ్యాచ్ ను ముగించేశారు.


స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గానిస్తాన్ జట్టుకు ఓపెనర్లు శుభారంభం అందజేశారు. వీరిద్దరూ దొరికిన బంతిని దొరికినట్లు బౌండరీకి తరలించారు. ఫలితంగా అఫ్గాన్ స్కోరు బోర్డు రాకెట్ వేగంతో దూసుకెళ్లింది. అఫ్గాన్ ఓపెనర్ల బ్యాటింగ్ చేసిన తర్వాత ఈ పిచ్ పైనేనా శ్రీలంక ఆడింది అన్న అనుమానం కలుగక మానదు. హజ్రతుల్లా, గుర్బాజ్ తొలి వికెట్ కు కేవలం 6.1 ఓవర్లలోనే 83 పరుగులు జోడించారు. అయితే గుర్బాజ్ భారీ షాట్ కు ప్రయత్నించి బౌల్డ్ అయ్యాడు. అనంతరం వచ్చిన జద్రాన్ (15)తో కలిసి హజ్రతుల్లా అఫ్గాన్ ను గెలిపించాడు.



అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు 19.4 ఓవర్లలో 105 పరుగులకు ఆలౌటైంది. శ్రీలంక తరఫున భానుక రాజపక్స (29 బంతుల్లో 38; 5 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్ గా నిలిచాడు. చివర్లో చమిక కరుణరత్నే (38 బంతుల్లో 31; 3 ఫోర్లు, 1 సిక్స్) నిలబడటంతో శ్రీలంక 100 పరుగుల మార్కును అందుకోగలిగింది. ఫరూఖీ మూడు వికెట్లు తీశాడు. నవీన్ ఉల్ హక్, మొహమ్మద్ నమీ చెరో రెండు వికెట్లు తీశారు.


తొలి ఓవర్ లోనే షాక్


టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన శ్రీలంకకు తొలి ఓవర్ లోనే భారీ షాక్ తగిలింది. మొదటి ఓవర్ వేయడానికి వచ్చిన ఫరూఖీ ఆ ఓవర్ చివరి రెండు బంతులకు కుశాల్ మెండీస్ (2), చరిత్ అసలంక (0)లను వరుసగా అవుట్ చేశాడు. మరో ఎండ్ లో బౌలింగ్ కు దిగిన నవీన్ ఉల్ హక్ కూడా పాతుమ్ నిస్సంక (3)ను అవుట్ చేశాడు. దాంతో శ్రీలంక 5 పరుగులకే టాపార్డర్ వికెట్లను కోల్పోయింది. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన భానుక రాజపక్స, దనుష్క గుణతిలక (17)లు జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. వీరు నెమ్మదిగా ఆడుతూ ఒక్కో పరుగును జత చేశారు. వీరిద్దరు మూడో వికెట్ కు 45 పరుగులు జోడించారు. అయితే బౌలింగ్ కు వచ్చిన ముజీబ్ ఉర్ రహ్మాన్ గుణతిలకను పెవిలియన్ కు చేర్చాడు. కాసేపటికే హసరంగ (2), అనవసరపు పరుగో కోసం ప్రయత్నించి భానుక రాజపక్స రనౌట్ అయ్యాడు. ఆ తర్వాత కూడా వికెట్లు పడటంతో శ్రీలంక 75 పరుగులకే 9 వికెట్లు కోల్పోయింది. 100 కూడా చేస్తుందా లేదా అనే తరుణంలో చమిక కరుణ రత్నే పోరాడటంతో శ్రీలంక 100 మార్కును చేరుకోగలిగింది

Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Afghanistan, Asia Cup 2022, Babar Azam, India VS Pakistan, Rashid Khan, Rohit sharma, Sri Lanka, Virat kohli

ఉత్తమ కథలు