హోమ్ /వార్తలు /క్రీడలు /

Asia Cup 2022 : అఫ్గానిస్తాన్ అభిమానుల క్రూరత్వం.. ఓడిపోయాం అని స్టేడియంలో పాక్ ఫ్యాన్స్ కుర్చీలతో దాడి.. వీడియో వైరల్

Asia Cup 2022 : అఫ్గానిస్తాన్ అభిమానుల క్రూరత్వం.. ఓడిపోయాం అని స్టేడియంలో పాక్ ఫ్యాన్స్ కుర్చీలతో దాడి.. వీడియో వైరల్

PC : TWITTER

PC : TWITTER

Asia Cup 2022 : మ్యాచ్ (Match) లో గెలుపోటములు సహజం.  ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్ లో ఓడిపోవడం ఆ జట్టుతో పాటు అభిమానులను కూడా తీవ్రంగా నిరాశ పరుస్తుంది. అంత మాత్రనా విచక్షణ కోల్పోయి బాహాబాహీకి దిగడం అనవసరం.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Asia Cup 2022 : మ్యాచ్ (Match) లో గెలుపోటములు సహజం.  ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్ లో ఓడిపోవడం ఆ జట్టుతో పాటు అభిమానులను కూడా తీవ్రంగా నిరాశ పరుస్తుంది. అంత మాత్రనా విచక్షణ కోల్పోయి బాహాబాహీకి దిగడం అనవసరం. ఆసియా కప్ (Asia Cup) 2022లో భాగంగా అఫ్గానిస్తాన్ (Afghanistan), పాకిస్తాన్ (Pakistan) జట్ల మధ్య సూపర్ 4 మ్యాచ్  ఇరు జట్ల అభిమానుల మధ్య గొడవకు దారి తీసింది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్ లో అఫ్గానిస్తాన్ పై వికెట్ తేడాతో పాకిస్తాన్ విజయం సాధించింది. ఇక మ్యాచ్ లో విజయం సాధించడంతో పాకిస్తాన్ ఫైనల్ కు చేరుకుంది. అదే సమయంలో వరుసగా రెండో మ్యాచ్ ఓడిన అఫ్గాన్.. భారత్ తో పాటు టోర్నీ నుంచి నిష్క్రమించింది.ఇది కూడా చదవండి : అవుటయ్యాననే కోపంలో బౌలర్ పై చేయి చేసుకున్న పాక్ బ్యాటర్.. బ్యాట్ తో కూడా కొట్టబోయాడు.. వీడియో
ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ లో పాకిస్తాన్ విజయం సాధించడంతో ఆ జట్టు అభిమానులు సంబరాలు చేసుకున్నారు. అయితే ఓడిపోయిన బాధలో ఉన్న అఫ్గాన్ అభిమానులు స్టేడియంలో ఉన్న కుర్చీలతో పాక్ అభిమానులపై దాడికి దిగారు. దాంతో ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య తీవ్ర గొడవ జరిగింది. అయితే అఫ్గాన్ అభిమానుల వాదన మరోలా ఉంది. మొదట పాకిస్తాన్ అభిమానులు తమను రెచ్చగొట్టినట్లు పేర్కొన్నారు. దాంతో తాము సహనం కోల్పోయి దాడి చేసినట్లు సోషల్ మీడియాలో ట్వీట్స్ కనిపిస్తున్నాయి. అయితే ఒక వీడియోలో అఫ్గాన్ అభిమాని పాక్ వీపుపై విరిగిపోయిన కుర్చీతో బాదడం విచారకరం. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.









మ్యాచ్ లో గెలుపోటములు సహజం. కానీ, ఇలా తమ జట్టు ఓడిపోయిందని ప్రత్యర్థి ప్లేయర్లు పై గొడవకు దిగడం మంచిది కాదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక మ్యాచ్ లో పాకిస్తాన్ బ్యాటర్ అవుటయ్యాననే కోపంతో అఫ్గాన్ బౌలర్ ఫరీద్ మాలిక్ పై గొడవకు దిగాడు. బ్యాట్ తో కొట్టేంత పని కూడా చేశాడు.

First published:

Tags: Afghanistan, Asia Cup 2022, Babar Azam, Dinesh Karthik, Hardik Pandya, Pakistan, Rashid Khan, Rohit sharma, Team India, Virat kohli

ఉత్తమ కథలు