హోమ్ /వార్తలు /క్రీడలు /

Asia Cup 2022 : సూపర్ 4పై కన్నేసిన అఫ్గానిస్తాన్.. నేడు బంగ్లాదేశ్ తో పోరు.. తుది జట్లు ఇవే

Asia Cup 2022 : సూపర్ 4పై కన్నేసిన అఫ్గానిస్తాన్.. నేడు బంగ్లాదేశ్ తో పోరు.. తుది జట్లు ఇవే

PC : ACB

PC : ACB

Asia Cup 2022 - AFG vs BAN : ఆసియా కప్ (Asia Cup) 2022 ఆరంభ మ్యాచ్ లో శ్రీలంక (Sri Lanka) జట్టుకు షాకిచ్చిన అఫ్గానిస్తాన్ (Afghanistan) మరోపోరుకు సిద్ధమైంది. పెద్దగా అంచనాలు లేకుండానే బరిలోకి దిగిన అఫ్గానిస్తాన్ జట్టు తమ ఆరంభ మ్యాచ్ లో శ్రీలంకపై ఏకంగా 8 వికెట్ల తేడాతో నెగ్గింది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Asia Cup 2022 - AFG vs BAN : ఆసియా కప్ (Asia Cup) 2022 ఆరంభ మ్యాచ్ లో శ్రీలంక (Sri Lanka) జట్టుకు షాకిచ్చిన అఫ్గానిస్తాన్ (Afghanistan) మరోపోరుకు సిద్ధమైంది. పెద్దగా అంచనాలు లేకుండానే బరిలోకి దిగిన అఫ్గానిస్తాన్ జట్టు తమ ఆరంభ మ్యాచ్ లో శ్రీలంకపై ఏకంగా 8 వికెట్ల తేడాతో నెగ్గింది. అంతేకాకుండా ఆ మ్యాచ్ లో పలు ఆసియా కప్ రికార్డులను కూడా సాధించింది. ఆసియా కప్ టి20 ఫార్మాట్ లో పవర్ ప్లేలో అత్యధిక పరుగులు చేసిన టీంగా.. అంతేకాకుండా ఎక్కు బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేరిన జట్టుగా రికార్డులు నెలకొల్పింది. 59 బంతులు మిగిలి ఉండగానే ఆసియా కప్ లో భారత్, అఫ్గానిస్తాన్ లు మ్యాచ్ ను ముగించి ఈ రికార్డును సమంగా కలిగి ఉన్నారు.


ఇది కూడా చదవండి : తన కంటే 5 ఏళ్లు పెద్ద వయస్కురాలితో శుబ్ మన్ గిల్ డేటింగ్.! ఆమె బాలీవుడ్ హీరోయిన్ కూడా.. ఎవరంటే?


మూడు రోజుల విరామం తర్వాత గ్రూప్ ‘బి’లో అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్ జట్ల మధ్య పోరు జరగనుంది. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ మంగళవారం రాత్రి 7.30 గంటలకు ఆరంభం కానుంది. శ్రీలంకపై గెలుపుతో మొహమ్మద్ నబీ సారథ్యంలోని అఫ్గానిస్తాన్ జట్టు ఆత్మవిశ్వాసంతో ఉంది. అదే సమయంలో షకీబుల్ హసన్ సారథ్యంలోని బంగ్లాదేశ్ కూడా ఈ మ్యాచ్ తో బోణీ కొట్టాలనే ఉద్దేశంలో ఉంది.బలాబలాను చూస్తే


టోర్నీ యూఏఈలో జరుగుతుండటం అఫ్గానిస్తాన్ జట్టుకు కలిసిరానుంది. ఎందుకంటే ఆ జట్టు తమ మ్యాచ్ లను ఎక్కువగా యూఏఈ వేదికగానే ఆడుతుంది. ఈ క్రమంలో ఈ మ్యాచ్ లోనూ హాట్ ఫేవరెట్ గా అఫ్గానిస్తాన్ బరిలోకి దిగుతుంది. రషీద్ ఖాన్, నబీ, హజ్రతుల్లా, గుర్బాజ్, ఫరూఖీ, ముజీబ్ ఉర్ రహ్మాన్ లాంటి టి20 స్టార్లు అఫ్గాన్ జట్టులో ఉండటం ఆ జట్టుకు ప్రధాన బలం. అంతేకాకుండా యూఏఈ పిచ్ లు వీరికి బాగా అలవాటు. తమకంటే మెరుగైన శ్రీలంక లాంటి టీంపై విజయం సాధించడంతో అఫ్గానిస్తాన్ ప్లేయర్ల ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింది. ఇక అదే సమయంలో జింబాబ్వేతో జరిగిన టి20 సిరీస్ లో బంగ్లాదేశ్ వైట్ వాష్ అయ్యింది. గత కొంత కాలంగా బంగ్లా టి20 ఫార్మాట్ లో చాలా బలహీనంగా మారిపోయింది. షకీబ్, ముష్ఫికర్, ముస్తఫిజర్, నైమ్ ఆ జట్టుకు ప్రధాన బలం. ప్రస్తుతం ఉన్న ఫామ్ ను చూస్తే బంగ్లాపై అఫ్గానిస్తాన్ గెలిచే అవకాశాలు ఉన్నాయి.


తుది జట్లు (అంచనా)


అఫ్గానిస్తాన్


మొహమ్మద్ నబీ (కెప్టెన్), జజాయ్, గుర్జాజ్, జద్రాన్, జన్నత్, జద్రాన్, రషీద్, ఒమరాజై, నవీన్, ఉర్ రహ్మాన్, ఫరూఖీ


బంగ్లాదేశ్ 


షకీబుల్ హసన్ (కెప్టెన్), మొహమ్మద్ నైమ్, అన్ముల్ హక్, అఫీఫ్ హుస్సెన్, ముష్ఫికర్, మహ్ముదుల్లా, షబ్బీర్ రహ్మాన్, మెహదీ హసన్, మొహమ్మద్ సైఫుద్దీన్, నసుమ్ అహ్మద్, ముస్తఫిజుర్ రహ్మాన్

Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Afghanistan, Asia Cup 2022, Bangladesh, Rashid Khan

ఉత్తమ కథలు