IPL 2021: అరెయ్ ఏంట్రా ఇదీ.. అశ్విన్ పై రుతురాజ్ ప్రతీకారం.. సోషల్ మీడియాలో రచ్చ రచ్చ - Video

అశ్విన్‌పై రుతురాజ్ స్వీట్ రివెంజ్ ఎట్లా తీర్చుకున్నాడో చూడండి (PC: IPL)

IPL 2021: క్వాలిఫయర్ 1 మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ చేసిన పనికి.. చెన్నై బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ ఇచ్చిన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

  • Share this:
    క్రికెట్‌ అంటే ఒక ఆట మాత్రమే కాదు. ఎన్నో ఎత్తులు పై ఎత్తులు.. టిట్ ఫర్ టాట్ లాంటి స్వీట్ రివెంజులూ ఉంటాయి. బ్యాటర్లు తమ బౌండరీలతో.. బౌలర్లు తమ బంతులతో క్రికెట్ ఫ్యాన్స్‌ను అలరిస్తుంటారు. ఇవే కాకుండా అప్పుడప్పుడూ ఆటగాళ్ల మధ్య చిన్నపాటి గొడవలూ జరుగుతుంటాయి. ఇవన్నీ ఆటలో భాగమే. మ్యాచ్ ముగిసిన తర్వాత అసలు వాటిని పట్టించుకునే వాళ్లు ఉండరు. దీన్నే స్పోర్టింగ్ స్పిరిట్ అంటారు. కానీ బయట నుంచి చూస్తున్న ఫ్యాన్స్‌కు మాత్రం ఇవన్నీ చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ఐపీఎల్ (IPL) వంటి ధనాధన్ లీగ్‌లో కూడా ఎన్నో చిన్న చిన్న తగాదాలు జరిగాయి. ప్రతీ సీజన్‌లో ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. కానీ ఇటీవల సీజన్లలో మాత్రం రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) ఇలాంటి జగడాలలో ముందు వరుసలో నిలుస్తుంటాడు. చెన్నైకి చెందిన రవిచంద్రన్ అశ్విన్ ఐపీఎల్‌లో పలు జట్లకు ఆడాడు.

    ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్‌కు (Delhi Capitals) ప్రాతినిథ్యం వహిస్తున్న రవిచంద్రన్ అశ్విన్.. చెన్నై సూపర్ కింగ్స్‌తో (Chennai Super Kings) జరిగిన తొలి క్వాలిఫయర్‌లో మరో సారి చిన్నపాటి తగాదాకు ఆజ్యం పోశాడు. 173 పరుగుల లక్ష్యంతో చెన్నై బ్యాటింగ్ చేస్తుండగా... రుతురాజ్ (Ruturaj Gaikwad) మంచి దూకుడు మీద ఆడుతున్నాడు. అయితే ఇన్నింగ్స్ 9వ ఓవర్ నాలుగో బంతిని వేయబోతూ క్రీజ్ వరకు వచ్చిన అశ్విన్ ఒక్కసారిగా ఆగిపోయాడు. మంచి దూకుడు మీద ఉన్న రుతురాజ్.. అప్పటికే మంచి స్టాండ్ తీసుకొని షాట్ ఆడటానికి రెడీగా ఉండగా.. అశ్విన్ ఆగిపోవడంతో నిరాశ పడ్డాడు. ఇక మరోసారి అశ్విన్ బంతి వేయడానికి పరుగు తీసుకొని వస్తుండగా.. క్రీజ్ వద్దకు రాగానే.. రుతురాజ్ చెయ్యి ఊపి బౌలర్‌ను ఆపేసి స్టాండ్ నుంచి పక్కకు వెళ్లాడు. దీన్ని చూసిన మైదానంలో ఉన్న ప్రేక్షకులతో పాటు టీవీల్లో చూస్తున్న వాళ్లు కూడా ఆశ్చర్యపోయారు.

    MSD The Finisher: ఎవడ్రా ధోనీకి వయసై పోయిందని అన్నది.. చూడండి మా 'తలా' తడాఖా.. ధోనీ మెరుపు ఇన్నింగ్స్‌పై మీమ్స్ వరద







    అశ్విన్‌కు కరెక్ట్ పర్సన్ దొరికాడని రుతురాజ్‌ను పొగుడుతున్నారు. అశ్విన్ కావాలనే ప్రత్యర్థులను ఇబ్బంది పెడుతుంటాడని.. కానీ ఈ సారి రుతురాజ్ మాత్రం సరైన సమాధానం ఇచ్చాడని అంటున్నారు. ఇది నిజంగా టిట్ ఫర్ టాట్ అని చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్ అంటున్నారు. కుక్కకాటుకు చెప్పు దెబ్బ అంటే ఇదే అని కొంత మంది ఘాటుగా వ్యాఖ్యానిస్తున్నారు. ఏదేమైనా అశ్విన్ తన దూకుడు తగ్గించుకోవాలని కూడా సూచిస్తున్నారు. ఇక మరికొంత మంద ఫ్యాన్స్ మాత్రం.. సీనియర్ అయిన అశ్విన్‌కు రుతురాజ్ గౌరవం ఇవ్వాలని అంటున్నారు.
    Published by:John Naveen Kora
    First published: