ముఖానికి బలంగా తాకిన బంతి...గ్రౌండ్‌లో కుప్పకూలిన భారత బౌలర్

ప్రస్తుతానికి ప్రమాదమేమీ లేదని బెంగాల్ క్రికెట్ అసోషియేషన్ వెల్లడించింది. తలకు సిటి స్కాన్ తీశామని..చిన్న గాయమేనని చెప్పారు.

news18-telugu
Updated: February 11, 2019, 9:31 PM IST
ముఖానికి బలంగా తాకిన బంతి...గ్రౌండ్‌లో కుప్పకూలిన భారత బౌలర్
అశోక్ దిండా
news18-telugu
Updated: February 11, 2019, 9:31 PM IST
టీమిండియా పేసర్‌ అశోక్ దిండా ఆస్పత్రి పాలయ్యాడు. ఓ ప్రాక్టీస్ మ్యాచ్‌లో బ్యాట్స్‌మెన్ కొట్టిన బంతి నేరుగా వచ్చి..ముఖానికి తాకడంతో తీవ్ర గాయమైంది. బలమైన దెబ్బతాకడంతో అక్కడే కుప్పకూలాడు అశోక్ దిండా. దాంతో ఫిజియోలు, సహచర ప్లేయర్‌‌లు వెళ్లి అతడికి ప్రాథమిక చికిత్స చేశారు. అనంతరం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతానికి ప్రమాదమేమీ లేదని బెంగాల్ క్రికెట్ అసోషియేషన్ వెల్లడించింది. తలకు సిటి స్కాన్ తీశామని..చిన్న గాయమేనని చెప్పారు. త్వరలోనే అతడు కోలుకుంటారని వెల్లడించారు.

దేశవాలీ టోరీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ సందర్భంగా బెంగాల్ టీమ్..సోమవారం ఈడెన్ గార్డెన్స్‌లో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడింది. లెఫ్ట్ఆర్మ్ బ్యాట్స్‌మెన్ వివేక్ సింగ్‌కు అశోక్ దిండా బౌలింగ్ చేశాడు. ఈ క్రమంలో దిండా వేసిన ఫుల్‌టాస్ బాల్‌ని స్ట్రైట్ డ్రైవ్ ఆడాడు వివేక్. అది నేరుగా దిండా వైపు దూసుకురావడంతో అతడు క్యాచ్ పట్టుకునే ప్రయత్నం చేశాడు. కానీ ఆ ప్రయత్నం విఫలమై...బంతి బలంగా ముఖానికి తాకింది.
అశోక్ దిండా 2009 డిసెంబరు 9న శ్రీలంకతో జరిగిన టీ20 మ్యాచ్‌లో టీమిండియాలోకి అరంగ్రేటం చేశాడు. ఆ మ్యాచ్‌లో సనత్ జయసూర్య వికెట్ తీసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇక 2010 జూన్‌లో జింబాబ్వేతో జరిగిన వన్డే సిరీస్‌లో వన్డే జట్టులోకి వచ్చాడు దిండా. భారత్ తరపున మొత్తం 13 వన్డేలు, 9 టీ20 మ్యాచ్‌లకు ప్రాతినిధ్యం వహించాడు. ఐతే వచ్చిన నాలుగేళ్లలోని జట్టుకు దూరమై..దేశవాళీ క్రికెట్‌కు పరిమితమయ్యాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 115 మ్యాచ్‌లు ఆడిన దిండా.. 417 వికెట్లు తీశాడు. 2013 నుంచి ఇప్పటి వరకు బెంగాల్ జట్టులో అతడే లీడింగ్ వికెట్ టేకర్..! దిండా ఆఖరిసారి 2013లో భారత్ తరఫున ఆడాడు.First published: February 11, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...