హోమ్ /వార్తలు /క్రీడలు /

First Ashes Test: బూడిద పోరాటానికి సై అంటోన్న ఆస్ట్రేలియా.. ఫస్ట్ టెస్ట్ కు కంగారూల తుది జట్టు ఇదే..

First Ashes Test: బూడిద పోరాటానికి సై అంటోన్న ఆస్ట్రేలియా.. ఫస్ట్ టెస్ట్ కు కంగారూల తుది జట్టు ఇదే..

Australia's Playing XI for the first Test

Australia's Playing XI for the first Test

First Ashes Test: ఆస్ట్రేలియా జట్టుకు ప్యాట్ కమిన్స్‌ (Pat Cummins) నాయకత్వం వహించనుండగా.. స్టీవ్‌ స్మిత్‌ (Steve Smith) వైస్‌ కెప్టెన్‌గా ఉండనున్నాడు. ఇక సెక్స్‌ స్కాండల్‌ ఆరోపణలతో కెప్టెన్సీ వదులుకున్న టిమ్‌ పైన్‌ యాషెస్‌ సిరీస్‌కు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే.

ఇంకా చదవండి ...

  ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తి ఎదురుచూసే సిరీస్ ల్లో ఒకటి ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ (Ashes Series). ఈ సూపర్ సిరీస్ లో చిరకాల ప్రత్యర్ధులు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ (Australia Vs England) అమీతుమీ తేల్చుకుంటాయ్. ఇక, ఈ ఏడాది డిసెంబర్‌ 8 నుంచి మొదలుకానున్న యాషెస్‌ సిరీస్‌ కోసం క్రికెట్‌ ఆస్ట్రేలియా ఫస్ట్ టెస్ట్ కు ప్లేయింగ్ ఎలెవన్ ప్రకటించింది. ఆస్ట్రేలియా జట్టుకు ప్యాట్ కమిన్స్‌ (Pat Cummins) నాయకత్వం వహించనుండగా.. స్టీవ్‌ స్మిత్‌ (Steve Smith) వైస్‌ కెప్టెన్‌గా ఉండనున్నాడు. ఇక సెక్స్‌ స్కాండల్‌ ఆరోపణలతో కెప్టెన్సీ వదులుకున్న టిమ్‌ పైన్‌ యాషెస్‌ సిరీస్‌కు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. పైన్‌ స్థానంలో ఎంపికైన అలెక్స్‌ క్యారీ (Alex Carey) ఆసీస్‌ తరపున 461వ టెస్టు ఆటగాడిగా ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఆస్ట్రేలియా టెస్టు టీమ్‌ను నడిపించబోయే 47వ కెప్టెన్‌ ప్యాట్ కమ్మిన్స్.

  డేవిడ్ వార్నర్, మార్కస్ హరిస్ ఓపెనర్లుగా బరిలోకి దిగనున్నారు. ఇటీవల ముగిసిన టీ-20 ప్రపంచకప్ టోర్నీలో ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచిన డేవిడ్ బాయ్ ఆస్ట్రేలియా జట్టుకు కీలకం కానున్నాడు. వన్ డౌన్ లో మార్నస్ లబుషేన్ బరిలోకి దిగనున్నాడు. స్టీవ్ స్మిత్ , ట్రావిస్ హెడ్, కామెరూన్ గ్రీన్ లతో ఆస్ట్రేలియా మిడిలార్డర్ స్ట్రాంగ్ గా ఉంది. ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, నాథన్ లయన్, జోష్ హజెల్ వుడ్ లతో ఆస్ట్రేలియా బౌలింగ్ లైనప్ భీకరంగా ఉంది.

  టిమ్ పైన్ కెప్టెన్సీలో వైస్ కెప్టెన్‌గా వ్యవహరించిన ప్యాట్ కమ్మిన్స్ సారథ్య బాధ్యతలు తీసుకోవడంతో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్‌కి వైస్ కెప్టెన్సీ దక్కింది. దాదాపు రెండేళ్ల తర్వాత తిరిగి కెప్టెన్సీ రోల్‌లో కనిపించబోతున్నాడు స్టీవ్ స్మిత్. స్టీవ్ స్మిత్ కెప్టెన్సీలో 34 టెస్టులు ఆడిన ఆస్ట్రేలియా, 18 మ్యాచుల్లో విజయాన్ని అందుకుని, 10 మ్యాచుల్లో ఓడింది. 6 టెస్టులు డ్రాగా ముగిశాయి. అలాగే 51 వన్డేల్లో 25 విజయాలు అందుకున్న స్టీవ్ స్మిత్, 8 టీ20 మ్యాచుల్లో 4 విజయాలు అందుకున్నాడు.

  ఆస్ట్రేలియా క్రికెట్‌లో పెను భూకంపం తీసుకొచ్చింది ‘సాండ్ పేపర్’ వివాదం. సౌతాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్ సమయంలో జేబుల్లో సాండ్ పేపర్ పెట్టుకుని, బాల్ టాంపరింగ్ చేయడానికి ప్రయత్నించి, అడ్డంగా దొరికిపోయారు ఆస్ట్రేలియా క్రికెటర్లు. ఈ ఎపిసోడ్ అంతటికీ ప్రధాన సూత్రధారుడిగా వ్యవహరించిన అప్పటి ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌లపై ఏడాది నిషేధం కూడా పడింది. అలాగే వికెట్ కీపర్ కామెరాన్ బాంక్రాఫ్ట్‌పై కూడా ఏడాది విధించింది క్రికెట్ ఆస్ట్రేలియా.

  ఇది కూడా చదవండి : " నా జీవితంలో చెరిగిపోని మచ్చ " .. ధోనీతో బ్రేకప్ పై రాయ్ లక్ష్మీ సంచలన నిజాలు..

  ఈ సంఘటన ఆస్ట్రేలియా క్రికెట్‌లో పెను ప్రకంపనలు క్రియేట్ చేసింది. సాండ్ పేపర్ వాడి బాల్ ట్యాంపరింగ్‌కి ప్రయత్నించిన స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌లను జైలు శిక్ష పడిన ఖైదీల్లా పోలీసుల లాక్కుంటూ తీసుకురావడం చూసి, క్రికెట్ ఫ్యాన్స్ అవాక్కయ్యారు. 2018లో జరిగిన ఈ సంఘటన తర్వాత ఆస్ట్రేలియా ఆధిక్యానికి కూడా తెర పడినట్టైంది. అప్పటిదాకా క్రికెట్ ప్రపంచంలో తిరుగులేని శక్తిగా, ప్రత్యర్థులను వణికిస్తూ వచ్చిన ఆస్ట్రేలియా... ఈ సంఘటన తర్వాత సరైన విజయాలు అందుకోలేకపోతోంది.

  ఇది కూాడా చదవండి : గబ్బర్ మనసు దోచిన టీమిండియా మహిళా క్రికెటర్.. త్వరలోనే ఆమెతో పెళ్లి..!

  స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌ల గైర్హజరీతో ఆస్ట్రేలియా టీమ్‌ను 2-1 తేడాతో ఓడించి టెస్టు సిరీస్ సొంతం చేసుకున్న విరాట్ సేన, 2020-21 టూర్‌లో ఈ ఇద్దరూ టీమ్‌లో ఉండగానే 2-1 తేడాతో టెస్టు సరీస్ గెలిచింది. చివరిగా 2017-18 సీజన్‌లో స్టీవ్ స్మిత్ కెప్టెన్సీలో ఇంగ్లాండ్ జట్టును 4-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసి టెస్టు సిరీస్ సొంతం చేసుకుంది ఆస్ట్రేలియా. గత సీజన్‌లో జరిగిన యాషెస్ సిరీస్ 2-2 తేడాతో డ్రాగా ముగిసింది.

  ఆస్ట్రేలియా తుది జట్టు :

  డేవిడ్ వార్నర్, మార్కస్ హరిస్, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, ట్రావిడ్ హెడ్, కామోరూన్ గ్రీన్, అలెక్స్ క్యారీ, ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, నాథన్ లయన్, జోష్ హజెల్ వుడ్

  Published by:Sridhar Reddy
  First published:

  Tags: Cricket, David Warner, England, England vs Australia, Pat cummins, Steve smith

  ఉత్తమ కథలు