ASHES SERIES STEVE SMITHS WIFE DANI WILLIS CATCHES HIM SHADOW BATTING AT 1AM IN THEIR HOTEL ROOM WATCH VIRAL VIDEO SRD
Ashes Series : అర్ధరాత్రి పూట ఆ పని చేస్తూ భార్యకు అడ్డంగా దొరికిపోయిన స్మిత్.. వైరల్ వీడియో..
Steve Smith
Ashes Series : ఆస్ట్రేలియా స్టాండింగ్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ చేసిన పని ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది. అర్ధరాత్రి పూట ఆ పని చేస్తున్న స్మిత్ పై నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.
క్రికెట్ (Cricket) మ్యాచ్ అయిపోగానే అందరూ ఏం చేస్తారు. కొంతమంది ఎంజాయ్ చేస్తుంటారు. మరికొంతమంది మరుసటి రోజు మ్యాచ్ ఎలా ఆడాలా అని ఆలోచించుకుంటూ పడుకుంటారు కదా. కానీ ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ (Steve Smith) మాత్రం అలా చేయలేదు. ఇప్పుడు అతను చేసిన పని వైరలవుతోంది. వివరాల్లోకెళితే.. అడిలైడ్ ఓవల్ వేదికగా జరుగుతున్న యాషెస్ రెండో టెస్టులో ఆస్ట్రేలియా పట్టు బిగిస్తుంది. అడిలైడ్ టెస్టులో మరో విజయాన్ని ఖాతాలో వేసుకుని సిరీస్ లో 2-0 ఆధిక్యాన్ని సాధించే దిశగా అడుగులేస్తోంది. రెండో టెస్టులో భాగంగా నాలుగో రోజు ఆటలో ఆసీస్.. రెండో ఇన్నింగ్సులో 9 వికెట్లు కోల్పోయి 230 పరుగులు చేసింది. దీంతో ఆసీస్.. ఇంగ్లాండ్ ముందు 467 పరుగుల భారీ ఆధిక్యాన్ని ఉంచింది. ఆసీస్ జట్టులో తొలి ఇన్నింగ్సులో సెంచరీ చేసిన లబూషేన్.. రెండో ఇన్నింగ్సులో హాఫ్ సెంచరీ (51) చేశాడు. ట్రావిస్ హెడ్ (51), కమారున్ గ్రీన్ (33) రాణించారు.
ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఈ టెస్టులో కూడా ఇంగ్లాండ్ ఓటమి ఖాయంగా అనిపిస్తోంది. ఛేజింగ్ లో ఇప్పటికే ఒక వికెట్ కూడా కోల్పోయింది ఇంగ్లంట్ టీమ్. గబ్బాలో జరిగిన తొలి టెస్టులో కూడా ఇంగ్లాండ్ దారుణ పరాజయాన్ని మూటగట్టుకున్న విషయం తెలిసిందే.ఈ మ్యాచ్‌లో జట్టు పటిష్ట స్ధితి నిలవడంతో మిగితా ఆటగాళ్లు అందరూ ప్రశాంతంగా నిద్రపోయినా, స్టాండింగ్ కెప్టెన్ స్మిత్ మాత్రం నిద్ర పోలేదు.
అర్ధరాత్రి స్మిత్ నిద్రపోకుండా షాడో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. దీనికి సంబంధించిన వీడియోను అతడి భార్య డాని విల్లిస్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఆ వీడియోకు "స్టీవ్ స్మిత్ తన కొత్త బ్యాట్‌ని చూస్తున్నారు" అని ఆమె క్యాప్షన్ పెట్టింది. ఇక ఆ వీడియోపై నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. "అర్ధ రాత్రి పడుకోకుండా అది ఏం పని ఎప్పుడు క్రికెట్ మీదే ధ్యాసేనా" అంటూ ఓ యూజర్ కామెంట్ చేశాడు. కాగా రెగ్యూలర్ కెప్టెన్ పాట్ కమిన్స్ గైర్హాజరీలో స్మిత్ ఈ టెస్ట్‌కు సారథిగా బాధ్యతలు చేపట్టాడు.
Steve Smith’s wife catches him shadow batting at 1am in their hotel room.
ఈ వీడియోలో స్మిత్ షాడో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా.. వెనకాల టీవీలో ప్రముఖ అమెరికా నటుడు సిట్కామ్ సీన్ఫీల్డ్ నటించిన ఓ సినిమా ప్లే అవుతున్నది. సిట్కామ్ కు వీరాభిమాని అయిన స్మిత్.. ఖాళీ సమయం దొరికితే ఆయన సినిమాలు చూస్తాడట. స్టీవ్ స్మిత్ ఒక్కడే కాదు.. గతంలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూడా ఓసారి వెస్టిండీస్ పర్యటనకు వెళ్లినప్పుడు హోటల్ రూమ్ లో ఇలాగే చేశాడు. ఇటీవలే ముగిసిన టీ20 ప్రపంచకప్ లో భారత్ తో మ్యాచ్ లో అదరగొట్టిన పాకిస్థాన్ ఆటగాడు మహ్మద్ రిజ్వాన్ కూడా మ్యాచుకు ముందు ఏకంగా స్టేడియంలోనే షాడో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసిన వీడియో వైరలైన విషయం తెలిసిందే.
Published by:Sridhar Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.