ASHES SERIES 2021 22 OLIE ROBINSON SPIN BOWLING VIDEO GOES VIRAL IN SOCIAL MEDIA WATCH SRD
Olie Robinson Spin Bowling : బౌన్సర్లతో ప్రత్యర్ధులకు చుక్కలు చూపే ఫాస్ట్ బౌలర్ స్పిన్నర్ గా అవతారమెత్తి...
Photo Credit : Twitter
Olie Robinson Spin Bowling : సాధారణంగా మనం ఫాస్ట్ బౌలర్లు బౌన్సర్లు, యార్కర్లతో బ్యాటర్లకు చుక్కలు చూపుతారు. కానీ, ఓ ఫాస్ట్ బౌలర్ స్పిన్ బౌలింగ్ వేయడం అరుదునే చెప్పాలి.
యాషెస్ సిరీస్ (Ashes Series) లో భాగంగా ఆడిలైడ్ వేదికగా జరుగుతున్న పింక్ టెస్ట్ మ్యాచు (Pink Test) లో ఆస్ట్రేలియా(Australia) విజయం దిశగా సాగుతోంది. సంపూర్ణ ఆధిపత్యంతో ఇంగ్లండ్ టీమ్ కు చుక్కలు చూపిస్తోంది. వరుసగా నాలుగో రోజు కూడా ఆస్ట్రేలియా అధిపత్యం కొనసాగింది. వికెట్ నష్టానికి 45 పరుగులతో నేడు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఆస్ట్రేలియా చివరకు తమ స్కోర్‌ను 9 వికెట్ల నష్టానికి 230 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. లబుషేన్, హెడ్ హాఫ్ సెంచరీలతో రాణించారు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లోని 237 పరుగుల అధిక్యాన్ని కలుపుకుని ఆ జట్టు ఇంగ్లండ్‌పై 467 పరుగుల భారీ అధిక్యంలో నిలిచింది. ఇక నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ నాలుగు వికెట్లు కోల్పోయి 82 పరుగులు చేసి ఓటమి అంచుల్లో నిలిచింది.
ఇక, నాలుగో రోజు ఆటలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ ఓలీ రాబిన్సన్ సన్ గ్లాసెస్ పెట్టుకుని స్పిన్నర్ (Olie Robinson Spin Bowling) అవతారమెత్తాడు. స్పిన్ బౌలింగ్ చేస్తూ అందరనీ ఆశ్చర్యపరుస్తూ స్పిన్ బౌలింగ్ చేశాడు. అయితే, ఈ మ్యాచ్‌లో స్పెషలిస్ట్ స్పిన్నర్ లేకుండానే ఇంగ్లండ్ బరిలోకి దిగింది. దీంతో ఆ జట్టు కెప్టెన్ జో రూట్ పార్ట్ టైమ్ స్పిన్నర్‌గా బౌలింగ్ చేస్తున్నాడు. అయితే రూట్ గాయం కారణంగా 4వ రోజు మొదటి సెషన్లో ఫీల్డ్‌లోకి రాలేదు. దీంతో రాబిన్సన్ స్పిన్నర్‌గా అవతారం ఎత్తాడు.
స్పిన్ బౌలింగ్ చేసిన రాబిన్సన్ను క్రికెట్ దిగ్గజాలు షేన్ వార్న్,స్టీవ్ వా ప్రశంసించారు. క్రికెట్ ఫ్యాన్స్ కూడా ఓలీ రాబిన్సన్ ను కొనియాడారు. జట్టు కోసం ఇలా ఏదైనా చేయగల ఆటగాడు ఉండటం ఆ జట్టుకు ఎంతో లాభమంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక, యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ సరికొత్త రికార్డు సృష్టించాడు.
డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్‌ల్లో 50 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా అరుదైన ఘనత సాధించాడు. నాలుగో రోజు ఆటలో స్టార్క్ రెండు వికెట్లు పడగొట్టడం ద్వారా ఈ ఘనత అందుకున్నాడు. ఇక, స్టార్క్ ఇప్పటివరకు తన టెస్ట్ కెరీర్లో 262 వికెట్లు సాధించాడు. అయితే, ఇప్పటికే బ్రిస్బేన్‌లో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌ను గెలచుకుని 5 టెస్టుల యాషెస్ సిరీస్‌లో అతిథ్య ఆస్ట్రేలియా 1-0తో అధిక్యంలో ఉన్న సంగతి తెలిసిందే.
Published by:Sridhar Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.