ASHES SERIES 2021 22 JOS BUTTLER 207 BALL ROCK SOLID BATTING ENDS IN AN UNFORTUNATE WAY SRD
Jos Buttler : 207 బంతులు.. రాక్ సాలిడ్ బ్యాటింగ్ తో బౌలర్లకు తిప్పలు.. కానీ, పాపం చివరకు ఇలా ఔటయ్యాడు..
Photo Credit : Twitter
Jos Buttler : క్రికెట్ అంటేనే ఓ అద్భుతం. ఈ జెంటిల్ మేన్ గేమ్ లో ఏ నిమిషానికి ఏం జరుగుతుందో అసలు ఊహించడం కష్టమే. ఒక్కో సారి లక్ కలిసివస్తే.. మరో సారి దురదృష్టం వెంటాడుతోంది.
ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ (Ashes Series)లో ఆస్ట్రేలియా (Australia) దుమ్మురేపుతోంది. ప్రత్యర్ధి ఇంగ్లండ్ (England) కు ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వకుండా రెచ్చిపోతుంది. అడిలైడ్ వేదికగా జరిగిన రెండో టెస్ట్‌లోనూ సమష్టిగా విఫలమైన ఇంగ్లండ్ 275 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. అయితే, ఇంగ్లండ్ స్వయంకృతాపరాధం కూడా ఇందులో ఉంది. ఫస్ట్ టెస్ట్ నుంచి సోమవారం ముగిసిన రెండో టెస్ట్ వరకు ఏదీ ఆ జట్టుకు కలిసిరాలేదు. టాస్, టీమ్ సెలెక్షన్, బ్యాటర్లు ఔటవ్వడం అన్నింటిల్లోనూ వారికి నిరాశే ఎదురైంది. అలాగే, చేతికి వచ్చిన ఈజీ క్యాచ్ ల్ని కూడా వదిలేసి పీకల్లాదాకా తెచ్చుకున్నారు. అయితే ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ కీపర్ బ్యాటర్ల జోస్ బట్లర్ (Jos Buttler) తన రాక్ సాలిడ్ బ్యాటింగ్‌తో ఆశలు రేకిత్తించాడు. పూర్తిగా డిఫెన్స్ చేస్తూ ఓటమి తప్పించే ప్రయత్నం చేశాడు. దాదాపు 207 బంతులాడి ఆసీస్ బౌలర్ల సహనానికి పరీక్షగా నిలిచాడు. కానీ అతన్ని దురదృష్టం వెంటాడింది.
తనదైన డిఫెన్స్‌తో ప్రతీబౌలర్ను ధీటుగా ఎదుర్కొన్న బట్లర్ చివరకు హిట్ వికెట్‌గా వెనుదిరిగాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ (Viral Video)గా మారింది. పాపం బట్లర్ భయ్యా.. అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. అసలు ఇంగ్లండ్‌కు ఏం కలిసిరావడం లేదు కదా? అని ట్వీట్ చేస్తున్నారు.
వాస్తవానికి ఇంగ్లండ్ టీమ్ ఇంకా తక్కువ స్కోరుకే.. అదీ ఈరోజు తొలి సెషన్లోనే ఆలౌటయ్యేలా కనిపించింది. కానీ.. ఏడో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన జోస్ బట్లర్ ( 207 బంతుల్లో 2ఫోర్లతో 26 ) గొప్ప పోరాట పటిమని కనబరుస్తూ.. ఇంగ్లండ్ జట్టులో డ్రా ఆశలు రేపాడు. 8వ స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన క్రిస్ వోక్స్ ( 97 బంతుల్లో 7ఫోర్లతో 44)తో కలిసి దాదాపు 20 ఓవర్లు ఆస్ట్రేలియాకి వికెట్ ఇవ్వలేదు.
What a way to end an epic innings! 😲
That's the first time Buttler has been dismissed hit wicket in his 193-innings first class career #Ashespic.twitter.com/nRP09djjay
ఆ తర్వాత వోక్స్ ఔటైనా.. ఓలీ రాబిన్సన్ (39 బంతుల్లో ఫోర్‌తో 8)తో కలిసి బట్లర్ పోరాడాడు. ఈ క్రమంలో.. బంతి ఏదైనా.. డిఫెన్స్ లేదా వదిలేయడం చేస్తున్న బట్లర్‌ని వదిలేసిన ఆస్ట్రేలియా బౌలర్లు.. మిగిలిన వికెట్లపై ఫోకస్ పెట్టినట్లు కనిపించింది.
కానీ.. ఇంగ్లాండ్ స్కోరు 182 వద్ద బట్లర్ తనంతట తానే ఆస్ట్రేలియాకి వికెట్ సమర్పించుకున్నాడు. ఇన్నింగ్స్ 110వ ఓవర్ వేసిన జై రిచర్డ్సన్ బౌలింగ్‌లో క్రీజులోకి డీప్‌గా వెళ్లిన జోస్ బట్లర్.. కట్ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ.. ఈ క్రమంలో అతని పాదం ఆఫ్ స్టంప్‌ని తాకడంతో బెయిల్ కిందపడింది. అయినప్పటికీ.. గమనించని బట్లర్.. సింగిల్ కోసం క్రీజు వెలుపలికి వెళ్లాడు.
కానీ.. అప్పటికే బెయిల్ పడటాన్ని చూసిన ఫైన్ లెగ్ ఫీల్డర్ సంబరాలు మొదలెట్టగా.. స్లిప్ ఫీల్డర్లు కూడా అతనికి తోడై సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఆలస్యంగా తన తప్పిదాన్ని గ్రహించిన బట్లర్.. తనని తాను నిందించుకుంటూ నిరశగా పెవిలియన్ వైపు నడిచాడు. ఆస్ట్రేలియా పేసర్ జై రిచర్డ్సన్(5/42) ఐదు వికెట్లతో ఇంగ్లండ్ పతనన్నాశాసించాడు. ఈ విజయంతో ఐదు టెస్ట్‌ల ఈ సిరీస్‌లో ఆసీస్ 2-0తో తమ ఆధిక్యాన్ని పెంచుకుంది. ఇక, మూడో టెస్ట్ (బాక్సింగ్ టెస్ట్) ఈ నెల 26 నుంచి ప్రారంభం కానుంది.
Published by:Sridhar Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.