ASHES FOUR POSITIVE COVID 19 CASES REPORTED IN ENGLAND CAMP CRI ASHES ENG AUS THIRD TEST GH VB
Ashes Test Series: యాషెస్ టెస్ట్ సిరీస్‌లో కరోనా కలకలం.. వారిలో నలుగురికి కరోనా పాజిటివ్.. టెస్ట్ కొనసాగేనా..?
యాషెస్ టెస్ట్ సిరీస్
Ashes Test Series: యాషెస్ సిరీస్‌లో భాగంగా మెల్బోర్న్ క్రికెట్ స్టేడియంలో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడో టెస్ట్ మ్యాచ్ జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ టెస్ట్ సిరీస్‌లో పాల్గొన్న వారిలో కరోనా కేసులు బయటపడ్డాయి.
ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. డెల్టాతో పాటు ఒమిక్రాన్ కొత్త వేరియంట్ వేగంగా విస్తరిస్తోంది. ప్రస్తుతం మెల్బోర్న్లో జరుగుతున్న యాషెస్ టెస్ట్ సిరీస్‌లో సైతం కరోనా కలకలం సృష్టించింది. యాషెస్ సిరీస్‌లో భాగంగా మెల్బోర్న్ క్రికెట్ స్టేడియంలో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడో టెస్ట్ మ్యాచ్ జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ టెస్ట్ సిరీస్‌లో పాల్గొన్న ఇంగ్లాండ్ శిబిరంలో ఆదివారం 4 కొత్త కరోనా కేసులు బయటపడ్డాయి. క్రికెటర్లకు, వారి కుటుంబ సభ్యులకు, టీమ్ సపోర్టు స్టాఫ్‌కు ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్‌లు నిర్వహించగా నలుగురు సభ్యులకు కరోనా పాజిటివ్‌గా తేలింది.
ఈ మేరకు ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు ధ్రువీకరించింది. అయితే, ఇంగ్లాండ్‌కు చెందిన ఆటగాళ్లలో ఎవరికీ కరోనా సోకలేదని, కేవలం వారి కుటుంబ సభ్యులకు మాత్రమే కరోనా నిర్ధారణ అయిందని అధికారులు స్పష్టం చేశారు. ఈ కారణంగా ఆదివారం మెల్బోర్న్ వేదిగా జరిగిన యాషెస్ సిరీస్ మూడో టెస్టు రెండో రోజు ఆట అరగంట ఆలస్యంగా ప్రారంభమైంది.
కాగా, కరోనా టెస్ట్ రిపోర్ట్ వచ్చే వరకు హోటల్లో ఉండాలని అధికారులు క్రికెటర్లను కోరారు. రిపోర్టు వచ్చిన తర్వాతే హోటల్ నుంచి మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌కు వెళ్లేందుకు ఆటగాళ్లను అనుమతించారు. దీంతో ఆట అరగంట ఆలస్యంగా ప్రారంభమైంది. మెల్బోర్న్లో రెండో రోజు ఆట స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 11 గంటలకు ప్రారంభం కావాల్సి ఉంది. కానీ, ఇది అరగంట ఆలస్యంగా 11.30 నిమిషాలకు మొదలైంది.
ఆసీస్ క్రికెట్ బోర్డు ప్రకటన కాగా, కరోనా కారణంగా ఇంగ్లాండ్ జట్టులో కలకలంపై క్రికెట్ ఆస్ట్రేలియా కూడా ప్రకటన విడుదల చేసింది. ‘‘ఇంగ్లాండ్ శిబిరంలో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వ్యక్తులు ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నారు. మా మొత్తం టీమ్ ఆటగాళ్లకు, వారి కుటుంబ సభ్యులకు, ఇతర సహాయక సిబ్బందికి ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్‌లను నిర్వహించగా అందరికీ నెగెటివ్ వచ్చింది.” అని ఒక ప్రకటనలో పేర్కొంది.
ఇక, ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు సోమవారం సాయంత్రం మరోసారి జట్టు సభ్యులకు ఆర్టీపీసీఆర్ టెస్ట్‌లను నిర్వహించనుంది. కరోనా కట్టడికి ఈ రెండు జట్లు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. క్రికెట్ ఆస్ట్రేలియా, ఎంసీసీ ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తూ కరోనా మార్గదర్శకాలను అనుసరిస్తూ మెల్బోర్న్లో టెస్ట్ సిరీస్ నిర్వహిస్తున్నాయి. ప్రస్తుతం ఇంగ్లండ్- ఆస్ట్రేలియా జట్ల మధ్య యాషెస్ సిరీస్ మూడో టెస్టు మ్యాచ్ జరుగుతోంది.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.