హోమ్ /వార్తలు /క్రీడలు /

Viral Video : ఇంగ్లండ్ అబ్బాయి.. ఆస్ట్రేలియా అమ్మాయి.. మరోవైపు మ్యాచ్.. ముద్దుల్లో ముంచెత్తి..

Viral Video : ఇంగ్లండ్ అబ్బాయి.. ఆస్ట్రేలియా అమ్మాయి.. మరోవైపు మ్యాచ్.. ముద్దుల్లో ముంచెత్తి..

Photo Credit : Twitter

Photo Credit : Twitter

Viral Video : మొదట అతడి వంక ఆశ్చర్యంగా చూసిన అమ్మాయి.. అనుమతి ఇచ్చేందుకు ఎక్కువ సమయం ఏమీ తీసుకోలేదు. ఆ వెంటనే ముద్దులు, కౌగిలింతలతో స్టేడియం హోరెత్తిపోయింది.

  లవ్ ప్రపోజ్ (Love Propose) చేయటం ఓ మధురానుభూతి. ఇష్టపడిన అమ్మాయికి లవ్ ప్రపోజ్ చేయటానికి అబ్బాయిలు చాలా ఆలోచిస్తుంటారు. వినూత్నంగా ప్రపోజ్ చేయాలనుకుంటారు. దాని కోసం ఎంతో ఆలోచిస్తారు. దాని కోసం ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తుంటారు.అటువంటి ఓ క్రేజీ లవర్ తను ప్రేమించిన అమ్మాయికి సరికొత్తగా ప్రేమను వ్యక్తపరిచాడు. అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ క్రీడా అభిమాని తన ఫేవరేట్ జట్టు ఆటను వీక్షిస్తూ స్టేడియంలోనే ప్రపోజ్ చేసి అందరీ దృష్టినీ ఆకర్షించాడు. ఈ ఘటన బ్రిస్బేన్‌లోని గబ్బా స్టేడియంలో జరిగింది. అయితే, ఇది కొంచెం డిఫరెంట్. ప్రత్యర్థి జట్ల అభిమానులైన ఇద్దరు ప్రపోజ్ చేసుకోవడం, స్టాండ్స్‌లో ఉన్న ఫ్యాన్స్ వారిని ప్రోత్సహించడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాను చుట్టేస్తోంది.

  యాషెస్ సిరీస్‌ (Ashes Series)లో భాగంగా ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ (Australia Vs England) జట్ల మధ్య ఇక్కడ తొలి టెస్టు జరుగుతోంది. మూడో రోజు ఆటలో ఇంగ్లండ్‌కు చెందిన ఓ యువకుడు ఆస్ట్రేలియా గర్ల్ ఫ్రెండ్‌కు ప్రపోజ్ చేశాడు. మొదట అతడి వంక ఆశ్చర్యంగా చూసిన అమ్మాయి.. అనుమతి ఇచ్చేందుకు ఎక్కువ సమయం ఏమీ తీసుకోలేదు. ఆ వెంటనే ముద్దులు, కౌగిలింతలతో స్టేడియం హోరెత్తిపోయింది.

  మ్యాచ్‌ను చిత్రీకరిస్తున్న కెమెరాలు ఒక్కసారిగా అటువైపు తిరిగాయి. స్టాండ్స్‌లోని అభిమానులు కూడా వారిని మరింత ఉత్సాహపరిచారు. కరతాళ ధ్వనులతో వారికి శుభాకాంక్షలు తెలిపారు.ఇక్కడ ఇంకో విషయం గురించి కూడా చెప్పుకోవాలి. యాషెస్ సందర్భంగా గబ్బాలో ఇలాంటి ప్రపోజల్ రావడం ఇదే తొలిసారి కాదు. 2017లోనూ ఓ జంట ఇలానే ప్రపోజ్ చేసుకుని తమ ప్రేమను మరో మెట్టు ఎక్కించారు.

  లేటెస్ట్ విషయానికి వస్తే మైఖేల్ అనే యువకుడు మోకాళ్లపై కూర్చుని టోరీ అనే యువతిని పెళ్లి చేసుకుంటావా? అని అడిగాడు. ఆ దృశ్యాన్ని చూసి ఆమె క్షణకాలం పాటు నమ్మలేకపోయింది. ఆ వెంటనే తేరుకుని ఓకే చెప్పడంతో అతడి ఆనందానికి హద్దే లేకుండా పోయింది. వెంటనే తన చేతిలో ఉన్న ఉంగరాన్ని ఆమె చేతికి తొడిగాడు. వారి చుట్టూ ఉన్న అభిమానులు కూడా వారిని మరింత ఉత్సాహ పరచడంతో స్టాండ్స్ కేరింతలతో దద్దరిల్లింది.

  ఇక, మ్యాచ్ విషయానికి వస్తే.. ఇంగ్లండ్ తన తొలి ఇన్నింగ్స్‌లో 147 పరుగుల స్వల్ప స్కోరుకే ఆలౌట్ అయింది. హసీబ్ హమీద్ (25), ఒల్లీ పోప్ (35), జోస్ బట్లర్ (39), క్రిస్ వోక్స్ (21) మినహా మిగతా వారిలో ఎవరూ రెండంకెల స్కోరు కూడా సాధించలేకపోయారు.

  ఇది కూాడా చదవండి : బీసీసీఐ మీద కోపంతో షాకింగ్ నిర్ణయం తీసుకోనున్న విరాట్ కోహ్లీ..! త్వరలోనే..

  ఆస్ట్రేలియా తన తొలి ఇన్నింగ్స్‌లో 425 పరుగులకు ఆలౌట్ అయింది. ట్రావిస్ హెడ్ ఇంగ్లండ్ బౌలర్లను దంచికొట్టి 152 పరుగులు సాధించగా, ఓపెనర్ వార్నర్ 94 పరుగులు చేసి ఆరు పరుగుల తేడాతో సెంచరీ చేజార్చుకున్నాడు. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ మూడో రోజు ఆట ముగిసే సమాయనికి 2 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది. డేవిడ్ మలాన్(80), జో రూట్ (86) లతో అజేయ పోరాటం కొనసాగిస్తున్నారు.

  Published by:Sridhar Reddy
  First published:

  Tags: England vs Australia, Lovers, Trending videos, Viral Video

  ఉత్తమ కథలు