Home /News /sports /

ASHES 2021 22 1ST TEST AUSTRALIA BEAT ENGLAND BY 9 WICKETS TO OPEN ASHES SERIES JNK

Ashes 2021-22: తొలి టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం.. నాలుగో రోజే మ్యాచ్ ముగించిన ఆతిథ్య ఆసీస్

గబ్బాలో ఇంగ్లాండ్‌ను చిత్తు చేసిన ఆస్ట్రేలియా

గబ్బాలో ఇంగ్లాండ్‌ను చిత్తు చేసిన ఆస్ట్రేలియా

Ashes Series: యాషెస్ సిరీస్‌లోని తొలి టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. బ్రిస్బేన్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై ఆస్ట్రేలియా పూర్తి ఆధిపత్యం సాధించి నాలుగో రోజునే విజయాన్ని అందుకున్నది. ఆస్ట్రేలియా తరఫున ట్రావిస్ హెడ్ అద్భుత సెంచరీ సాధించాడు. కాగా నాథన్ లియాన్ తన టెస్టు కెరీర్‌లో 400వ వికెట్‌ను సాధించాడు.

ఇంకా చదవండి ...
    యాషెస్ 2021-22లో (Ashes Test Series) తొలి టెస్టు బ్రిస్బేన్‌లోని గబ్బా వేదికగా (Gabba Stadium) జరిగింది. తొలి టెస్టును ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టు (Australia) నాలుగో రోజే గెలుచుకున్నది. ఇంగ్లాండ్ జట్టు (England) నిర్దేశించిన 19 పరుగులను ఒక వికెట్ కోల్పోయి ఛేదించింది. దీంతో తొలి టెస్టును ఆస్ట్రేలియా జట్టు 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఐదు రోజుల మ్యాచ్‌లో నాలుగో రోజునే విజయం సాధించిందంటే ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఆధిపత్యాన్ని అంచనా వేయవచ్చు. ఆస్ట్రేలియా తరఫున ట్రావిస్ హెడ్ అద్భుత సెంచరీ సాధించాడు. అతను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. ట్రావిస్ హెడ్ లాగే ఈ మ్యాచ్ కూడా నాథన్ లియాన్‌కు చిరస్మరణీయం. ఈ మ్యాచ్‌లో నాథన్ లియాన్ టెస్టు కెరీర్‌లో 400వ వికెట్‌ను సాధించాడు. టెస్టుల్లో 400 వికెట్లు తీసిన 17వ బౌలర్‌గా నిలిచాడు.

    డిసెంబర్ 8న ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ మధ్య తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభమైంది. గబ్బా వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసింది. కెప్టెన్ జో రూట్ మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. అయితే ఆస్ట్రేలియా బౌలర్ల ధాటికి ఇంగ్లాండ్ జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో కేవలం 147 పరుగులకే ఆలౌటైంది. ఆస్ట్రేలియన్ కెప్టెన్ పాట్ కమిన్స్ పర్యాటక జట్టును ఆలౌట్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. కెప్టెన్‌గా అరంగేట్రం మ్యాచ్‌లోనే కమిన్స్ ఐదు వికెట్లు తీశాడు. ఇంగ్లండ్‌ను తక్కువ స్కోరుకే ఆలౌట్ చేసిన ఆస్ట్రేలియా.. తొలి ఇన్నింగ్స్‌లో 425 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్ 152 పరుగులు చేశాడు. డేవిడ్ వార్నర్ అద్భుతంగా ఆడినా సెంచరీని కొద్దిగా మిస్ అయ్యాడు. వార్నర్ 94 పరుగులు చేసి ఔటయ్యాడు.

    MS Dhoni New Look: 'కాలీన్ భయ్యా'తో ఎంఎస్ ధోనీ.. వీరిద్దరి కలయిక వెనుక కారణం ఏంటి? వైరల్ అయిన ఫొటో


    తొలి ఇన్నింగ్స్‌తో పోలిస్తే రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ జట్టు కాస్త మెరుగ్గా ఆడింది. అయితే భారీ స్కోర్ మాత్రం చేయలేకపోయింది. ఆస్ట్రేలియాకు ఇబ్బంది కలుగుతుందని అనుకున్నా ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో 297 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా కంటే 278 పరుగులు వెనుకబడి ఉన్న ఇంగ్లాండ్.. రెండో ఇన్నింగ్స్‌లో 297కే ఆలౌట్ అయ్యింది. దీంతో ఆస్ట్రేలియా ముందు 19 పరుగుల స్వల్ప లక్ష్యం ఉంచగలిగింది. ఆస్ట్రేలియా ఆరో ఓవర్లో ఒక వికెట్ కోల్పోయి ఈ లక్ష్యాన్ని సాధించింది. స్వల్ప లక్ష్యం కావడంతో ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 10 వికెట్ల తేడాతో విజయం సాధిస్తుందని అంతా భావించారు. అయితే అలెక్స్ కారీ (9) ఓలీ రాబిన్సన్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ బట్లర్ చేతికి చిక్కాడు

    Virat Kohli Controversy: విరాట్ విజయవంతమైన కెప్టెన్ అయినా.. ఈ 5 వివాదాలు మాత్రం మర్చిపోలేము


    తొలి టెస్టు మ్యాచ్‌లో జో రూట్ (89), డేవిడ్ మలన్ (82) బ్యాటింగ్‌ను మినహాయించి ఇంగ్లాండ్ జట్టు పెద్దగా రాణించలేదు. ఈ బ్యాట్స్‌మెన్‌లిద్దరూ రెండో ఇన్నింగ్స్‌లో మూడో వికెట్‌కు 162 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 2 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది. నాలుగో రోజు మొదటి గంటలోనే ఈ జోడి విడిపోయింది. ఫలితంగా లంచ్ బ్రేక్ వరకు ఇంగ్లండ్ జట్టు మొత్తం ఆలౌట్ అయింది.

    (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
    Published by:John Kora
    First published:

    Tags: Ashes, David Warner, England vs Australia

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు