Krishna AdithyaKrishna Adithya
|
news18-telugu
Updated: September 16, 2019, 10:55 PM IST
విజయానందంలో ఇంగ్లీష్ సేన
ఓవెల్ వేదికగా జరిగిన ఆస్ట్రేలియాతో జరుగిన చివరి టెస్టులో ఇంగ్లాండ్ 135 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 18 ఏళ్ల తర్వాత యాషెస్ సిరీస్‌ను దక్కించుకోవాలనే ఆశతో ఉన్న ఆస్ట్రేలియా ఆశలకు ప్రపంచకప్ చాంపియన్ ఇంగ్లాండ్ గండి కొట్టింది. ఇంగ్లాండ్ విధించిన 399 పరుగుల విజయ లక్ష్యాన్ని సాధించడలో ఆసీస్ విఫలమైంది. ఇంగ్లాండ్ బౌలర్లు రాణించడంతో ఆస్ట్రేలియా నాలుగో రోజు కేవలం 263 పరుగులకే ఆలౌట్ అయ్యింది. సిరీస్‌లో అద్భుత ఫామ్ లో ఉన్న స్టీవ్ స్మిత్ కూడా కేవలం 23 పరుగులకే ఔటయ్యాడు. ఆసీస్ బ్యాట్స్‌మ్యాన్ మాథ్యూ వేడ్ సెంచరీ చేసినప్పటికీ జట్టు ఓటమినుంచి తప్పించుకోలేకపోయింది. అటు ఇంగ్లాండ్ బౌలర్లలో స్టువర్ట్ బ్రాడ్, జాక్ లీచ్‌లు రాణించగా ఇద్దరూ చెరో నాలుగు వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు.
ఇదిలాఉంటే ఇంగ్లాండ్ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 329 పరుగులు చేసి ఆలౌటైంది. దీంతో యాషెస్ సిరీస్‌లో ఇంగ్లాండ్ జట్టు ఆస్ట్రేలియాను ఓడించి సిరీస్ 2-2తో సమం చేసింది. ఇదిలా ఉంటే ఇంగ్లాండ్ కు చెందిన బెన్ స్ట్రోక్స్ కు ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు దక్కించుకున్నాడు.
Published by:
Krishna Adithya
First published:
September 16, 2019, 10:55 PM IST