యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లాండ్-ఆస్ట్రేలియా మధ్య ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరుగుతున్న మొదటి టెస్టులో ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్‌కు చేదు అనుభవం ఎదురైంది. స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో కేవలం 2 పరుగులకే వార్నర్ వెనుదిరిగినవేళ..ఇంగ్లాండ్ అభిమానులు అతన్ని హేళన చేశారు. వార్నర్‌కు సాండ్ పేపర్ చూపిస్తూ గట్టిగా కేకలు వేశారు. ఒక్క వార్నర్‌కే కాదు.. మరో ఓపెనర్ బెన్‌క్రాఫ్ట్ ఔట్ అయిన సందర్భంలోనూ ఇంగ్లాండ్ ఫ్యాన్స్ ఇలాగే చేశారు. వికెట్ పడటమే ఆలస్యం.. సాండ్ పేపర్‌ను చూపిస్తూ ఆస్ట్రేలియా క్రికెటర్లను ఇంగ్లాండ్ అభిమానులు ఆటాడుకున్నారు.'ఇంగ్లండ్ ఛాంప్స్.. ఆసీస్ చీట్స్' అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో
వైరల్‌గా మారింది.
గత ఏడాది దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో బాల్ టాంపరింగ్ వివాదం కారణంగా ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్, కామెరూన్ బెన్‌క్రాఫ్ట్‌లపై క్రికెట్ ఆస్ట్రేలియా ఏడాది నిషేధం విధించింది. ఆ సమయంలోనే సాండ్ పేపర్ పేరు ప్రచారంలోకి వచ్చింది. ఇటీవల ముగిసిన వరల్డ్ కప్ ప్రారంభానికి ముందు కూడా ఆస్ట్రేలియా క్రికెటర్లను సాండ్ పేపర్‌తో ఇంగ్లాండ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో హేళన చేశారు. తాజా యాషెస్ సిరీస్‌లోనూ అదే కొనసాగుతోంది.
కాగా,మొదటి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 284 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ స్మిత్ ఒక్కడే 144 పరుగులతో రాణించాడు. పీటర్ సిడిల్ 44 పరుగులు,ట్రేవిస్ హెడ్ 35 పరుగులు తప్ప మిగతా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు. ఇంగ్లాండ్ బౌలర్లలో స్టువర్ట్ బ్రాడ్ 5 వికెట్లు,క్రిస్ వోక్స్ 3 వికెట్లు పడగొట్టి ఆస్ట్రేలియాను తక్కువ స్కోరుకే కట్టడి చేశారు. రెండో రోజు టెస్టులో ఇంగ్లాండ్‌ను ఆస్ట్రేలియా కట్టడి చేస్తుందా.. లేక సునాయాసంగానే మొదటి ఇన్నింగ్స్ స్కోరును దాటేస్తుందా అన్నది ఆసక్తిని రేకెత్తిస్తోంది.
Published by:Srinivas Mittapalli
First published:August 02, 2019, 08:04 IST