హోమ్ /వార్తలు /క్రీడలు /

సేల్స్‌మ్యాన్‌గా సచిన్ కుమారుడు..హెల్ప్ చేసిన భజ్జీ..!

సేల్స్‌మ్యాన్‌గా సచిన్ కుమారుడు..హెల్ప్ చేసిన భజ్జీ..!

రేడియోలు అమ్ముతున్న అర్జున్ టెండూల్కర్

రేడియోలు అమ్ముతున్న అర్జున్ టెండూల్కర్

వర్షంతో రెండో టెస్టు తొలి రోజు ఆట రద్దైన సందర్భంగా .. గ్రౌండ్ స్టాఫ్‌తో కలిసి అర్జున్ మైదానంలో శ్రమించాడు. కవర్స్ కప్పే పనిలో వారికి సహకరించాడు. ఈ మేరకు అర్జున్‌ను అభినందిస్తూ లార్డ్స్ మైదానం ట్వీట్ చేసింది.

  క్రికెట్ మక్కా లార్డ్స్  మైదానంలో ఇంగ్లండ్, ఇండియా మధ్య రెండో టెస్ట్ కొనసాగుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్  107 పరుగులకే కుప్పకూలడం.. ఇంగ్లండ్ జట్టు భారీ ఆధిక్యంలోకి దూసుకెళ్లడంతో.. కొహ్లీ సేన పీకల్లోతు కష్టాల్లో పడింది. ఐతే ఈ టెస్ట్ మ్యాచ్‌లో సచిన్ టెండూల్కర్ తనయుడు ప్రత్యేక ఆకర్షణగా మారాడు. సెకండ్ టెస్ట్ సందర్భంగా లార్డ్స్ గ్రౌండ్ బయట సేల్స్‌మ్యాన్‌గా పనిచేసి అందరికీ షాకిచ్చాడు. రేడియోలు అమ్ముతూ కెమెరాల దృష్టిని ఆకర్షించాడు జూనియర్ సచిన్.

  అర్జున్ టెండూల్కర్ రేడియోలు అమ్ముతున్న ఫొటోను స్పిన్నర్ , టర్బనేటర్ హర్భజన్ సింగ్..ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. ఇండియా-ఇంగ్లండ్ టెస్ట్ మ్యాచ్‌లో హర్భజన్ కామెంట్రీ వినిపిస్తున్నారు.  ''అర్జున్ ఇప్పటికే 50 రేడియోలు అమ్మాడు. మరికొన్ని మాత్రమే ఉన్నాయి..త్వరపడండి'' అని భజ్జీ ట్వీట్ చేశారు.

  ఐతే ఇదేదో ప్రచారం కోసమో..సరదా కోసమో చేసింది కాదు. అర్జున్ నిజంగానే రేడియోలు అమ్మినట్లు తెలుస్తోంది. లార్డ్స్ మైదానంలో ప్రేక్షులు మ్యాచ్ వీక్షించడతో పాటు కామెంట్రీని వినేందుకు వీలుగా ప్రత్యేక రేడియోలు రూపొందించారు. వాటినే అర్జున్ అమ్మిపెట్టాడు. లార్డ్స్‌ మైదానంలో అర్జున్ టెండూల్కర్ ప్రత్యేక శిక్షణ పొందుతున్నాడు. ప్రాక్టీస్ సెషన్స్‌లో భారత ఆటగాళ్లకు బౌలింగ్ చేశాడు. అక్కడ శిక్షణ పొందే ఆటగాళ్లు గ్రౌండ్‌లో అన్ని పనులూ చేస్తారు. అందులో భాగంగానే మైదానంలో రేడియోలు అమ్మాడు అర్జున్.

  అంతకుముందు రెండో టెస్టులో తొలి రోజు ఆట వర్షం కారణంగా రద్దయింది. ఆ సందర్బంగా గ్రౌండ్ స్టాఫ్‌తో కలిసి అర్జున్ మైదానంలో శ్రమించాడు. కవర్స్ కప్పే పనిలో వారికి సహకరించాడు. ఈ మేరకు అర్జున్‌ను అభినందిస్తూ లార్డ్స్ మైదానం ట్వీట్ చేసింది.

  కాగా, ఇటీవల భారత్ అండర్-19 క్రికెట్ టీమ్‌లోకి అర్జున్ టెండూల్కర్‌ అరంగ్రేటం చేశాడు. శ్రీలంకతో జరిగిన ఆ మ్యాచ్‌లో ఓ వికెట్ కూడా పడగొట్టాడు. ఐతే లార్డ్స్‌లో క్రికెట్ శిక్షణ సందర్బంగా..గ్రౌండ్ స్టాఫ్‌కు అర్జున్ సేవలందించిడంతో పాటు రేడియోలు అమ్మడంపై ప్రశంసల వర్షం కురుస్తోంది.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Arjun Tendulkar, Ind Vs Eng 2018

  ఉత్తమ కథలు