హోమ్ /వార్తలు /క్రీడలు /

హాట్ కేక్‌లా అమ్ముడుపోయిన అర్జున్ టెండుల్కర్.. సచిన్ ఖుషీ

హాట్ కేక్‌లా అమ్ముడుపోయిన అర్జున్ టెండుల్కర్.. సచిన్ ఖుషీ

అర్జున్ టెండుల్కర్ (File)

అర్జున్ టెండుల్కర్ (File)

ముంబై టీ 20 లీగ్‌లో కనీసం బిడ్ రూ.1లక్ష. అత్యధిక ధర రూ.5లక్షలు.

    మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ కుమారుడు అర్జున్ టెండుల్కర్ హాట్ కేక్‌లా అమ్ముడుపోయాడు. ముంబై టీ 20 లీగ్ కోసం జరిపిన వేలంలో సచిన్ కొడుకు అర్జున్‌ను రూ.5లక్షలు పెట్టి కొనుక్కుంది ఆకాష్ టైగర్స్ ముంబై వెస్ట్రన్ సబర్బ్స్ జట్టు. ముంబై టీ 20 లీగ్ రెండో సీజన్‌కు సంబంధించి ఆటగాళ్ల వేలం నిర్వహించగా అందులో అర్జున్ టెండుల్కర్‌‌ను జట్టు అత్యధిక ధర చెల్లించి జట్టులోకి తీసుకుంది. ముంబై టీ 20 లీగ్‌లో కనీసం బిడ్ రూ.1లక్ష. అత్యధిక ధర రూ.5లక్షలు. ఎడమచేతి వాటం బౌలర్, బ్యాట్స్‌మెన్ అయిన అర్జున్ టెండుల్కర్‌ను ఆల్ రౌండర్ కేటగిరీలో ఉంచారు. ఈ క్రమంలో రెండు జట్లు అర్జున్ కోసం రూ.5లక్షల బిడ్ వేశాయి. ఆకాష్ టైగర్స్ ముంబై వెస్ట్రన్ సబర్బ్స్, ఈగల్ థానే స్ట్రైకర్స్ జట్లు బిడ్ వేశాయి. అయితే, ఆకాశ్ టైగర్స్ చీటీ ఎంపికైంది. అర్జున్‌ను దక్కించుకుంది.

    First published:

    Tags: Arjun Tendulkar, Cricket, Mumbai, Sachin Tendulkar

    ఉత్తమ కథలు