హోమ్ /వార్తలు /క్రీడలు /

అర్జున్‌ టెండూల్కర్‌ మెయిడిన్ వికెట్.. వైరల్‌గా మారిన వీడియో!

అర్జున్‌ టెండూల్కర్‌ మెయిడిన్ వికెట్.. వైరల్‌గా మారిన వీడియో!

ముంబై ఇండియన్స్ జట్టుకు ఇంకా ఒక్కరిని మాత్రమే తీసుకునే అవకాశం ఉన్న సమయంలో చివరి వేలంలో అర్జున్ టెండుల్కర్‌ను దక్కించుకుంది.

ముంబై ఇండియన్స్ జట్టుకు ఇంకా ఒక్కరిని మాత్రమే తీసుకునే అవకాశం ఉన్న సమయంలో చివరి వేలంలో అర్జున్ టెండుల్కర్‌ను దక్కించుకుంది.

సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ దేశవాళీ టి20 క్రికెట్‌ టోర్నమెంట్‌లో హరియాణా.. ముంబైపై 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముంబై నిర్ధేశించిన 143 పరుగుల లక్ష్యాన్ని హరియాణా 17.4 ఓవర్లలో 2 వికెట్ల కోల్పొయి ఛేదించింది

  సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ దేశవాళీ టి20 క్రికెట్‌ టోర్నమెంట్‌లో హరియాణా.. ముంబైపై 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముంబై నిర్ధేశించిన 143 పరుగుల లక్ష్యాన్ని హరియాణా 17.4 ఓవర్లలో 2 వికెట్ల కోల్పొయి ఛేదించింది. అయితే ఈ మ్యాచ్‌లో సచిన్ కుమారుడు అర్జున్‌ టెండూల్కర్‌ సెంటర్ అఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు. అర్జున్ 3 ఓవర్లు వేసి 34 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్‌ తీశాడు. అయితే అందులో ఓ మెయిడిన్‌ వేసి ఓ వికెట్‌ను సాధించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సీనియర్‌ ముంబై జట్టు తరఫున ఆడిన అర్జున్ రెండో ఓవర్‌ తొలి బంతికి బిష్నోయ్‌ను క్యాచ్‌ రూపంలో ఔట చేశాడు.


  స‌య్యిద్ ముస్తాక్ అలీ ట్రోఫీతో ముంబై సీనియ‌ర్ జ‌ట్టు త‌ర‌పున ఫస్ట్ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. హ‌ర్యానాతో జ‌రిగిన మెుదటి మ్యాచ్లో అర్జున్ ఆడాడు. ఇప్పటివ‌ర‌కు అండ‌ర్‌-19 మ్యాచ్‌లు ఆడిన అర్జున్‌ ఈ ట్రోఫీలో రాణించి ఐపీఎల్‌లో అడుగుపెట్టాలని చూస్తున్నాడు. అర్జున్ టెండూల్కర్ అనుహ్యంగా ముంబై జట్టులో చోటు సంపాదించాడు. కోవిడ్ నేప‌థ్యంలో స‌భ్యుల సంఖ్యను పెంచేందుకు బీసీసీఐ అనుమ‌తి ఇవ్వడంతో ముంబై సీనియ‌ర్ జ‌ట్టులో అర్జున్‌కు స్థానం ఖ‌రారైంది. 21ఏళ్ల అర్జున్ ఇప్పటి వ‌ర‌కు చిన్న స్ధాయిలో టోర్నీ మాత్రం ఆడాడు. ఈ టోర్నీతో ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అడుగుపెట్టారు.

  Published by:Rekulapally Saichand
  First published:

  Tags: Arjun Tendulkar

  ఉత్తమ కథలు