హోమ్ /వార్తలు /క్రీడలు /

Arjun Tendulkar: ప్రాక్టీస్ మ్యాచ్‌లో నిరాశపరిచిన అర్జున్ టెండూల్కర్.. అందులో చోటు దక్కడం కష్టమేనా?

Arjun Tendulkar: ప్రాక్టీస్ మ్యాచ్‌లో నిరాశపరిచిన అర్జున్ టెండూల్కర్.. అందులో చోటు దక్కడం కష్టమేనా?

ఇటీవల ఐపీఎల్ వేలంలో పేరు నమోదు చేసుకోవడం ద్వారా వార్తల్లో నిలిచాడు.. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్.

  ఇటీవల ఐపీఎల్ వేలంలో పేరు నమోదు చేసుకోవడం ద్వారా వార్తల్లో నిలిచాడు.. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్. తండ్రి బాటలోనే క్రికెట్‌‌ రంగంలోకి అడుగుపెట్టిన అర్జున్‌పై.కొంత లగ్జరీ ఉంటుందనే చెప్పవచ్చు. గుర్తింపు కోసం వెతుక్కోవాల్సిన పని అర్జున్‌కు ఉండదని చాలా మంది నుంచి వినిపిస్తోన్న మాట. అదే సమయంలో తండ్రి పేరును కూడా నిలబెట్టాల్సిన బాధ్యత అర్జున్‌పై ఉంటుంది. ఆటలో అర్జున్ ఏ చిన్న తప్పిదం చేసినా చాలా మంది దానిని అతడి తండ్రితో కంపైర్ చేస్తారు. ఈ పరిస్థితులు అతడికి ఓ రకంగా చాలెజింగ్ అనే చెప్పాలి. అయితే తాజాగా అర్జున్‌కు విజయ్ హజారే ట్రోఫిలో చోటు దక్కే అవకాశం కష్టంగా కనిపిస్తోంది. ఇందుకు ప్రాక్టీస్ మ్యాచ్‌లో అర్జున్ తీవ్రంగా నిరాశపరిచాడు. మొత్త మూడు జట్లు ప్రాక్టీస్ మ్యాచ్ ఆడగా.. టీమ్ ఏ మెంబర్‌గా ఉన్న అర్జున్ ఒక్క మ్యాచ్‌లో ఆడాడు.

  బౌలర్ కమ్ అల్ రౌండర్ అయిన అర్జున్.. ఆ మ్యాచ్‌లో 4.1 ఓవర్లు వేశాడు. తన బౌలింగ్‌లో 12.93 ఏకానమీ రేట్‌తో 53 పరుగులు సమర్పించుకున్నాడు. ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. దీంతో విజయ్ హజరే ట్రోపికి అర్జున్ ఎంపిక సందిగ్ధంలో పడింది.

  ఇక, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ కూడా ఐపీఎల్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. ఈ నెల 18న మెగా టోర్నీ వేలం జరగనుండగా, 21 ఏళ్ల అర్జున్ రూ. 20 లక్షల కనీస ధర (బేస్ ప్రైస్)తో తన పేరును నమోదు చేసుకున్నాడు. అండర్-19 టోర్నీలలో అర్జున్ దేశానికి ప్రాతినిధ్యం వహించినప్పటికీ, దేశవాళీ టోర్నీలలో ఆడకపోవడంతో ఐపీఎల్‌ గత సీజన్‌లలో పేరు నమోదు చేసుకునే అర్హత లేకుండా పోయింది. ఇటీవల ముగిసిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో జూనియర్ టెండూల్కర్ ముంబైకి ప్రాతినిధ్యం వహించాడు. దీంతో ఐపీఎల్‌ వేలానికి అర్హత సాధించాడు. ఈ వేలంలో అర్జున్‌ను ఏ టీమ్ సొంతం చేసుకుంటుందనే ఆసక్తి క్రికెట్ అభిమానుల్లో నెలకొంది.

  First published:

  Tags: Arjun Tendulkar, Cricket

  ఉత్తమ కథలు