KL Rahul : అప్పుడు పంత్..ఇప్పుడు రాహుల్..బేబీ సిట్టర్లుగా మారిన భారత్ వికెట్ కీపర్లు..

Photo Credit : Twitter

KL Rahul: టీమిండియా వికెట్ కీపర్​ కేఎల్​ రాహుల్ (KL Rahul) ​ బేబీ బేబీ సిట్టర్​​ అవతారమెత్తాడు. ఇంగ్లండ్​తో జరిగిన తొలి వన్డే మ్యాచ్​లో 66 పరుగుల తేడాతో భారత్​ విజయం సాధించింది. దీంతో టీమిండియా జట్టు​ విహారయాత్రకు పుణె బయలుదేరింది.

  • Share this:
టీమిండియా వికెట్ కీపర్​ కేఎల్​ రాహుల్ (KL Rahul) ​ బేబీ బేబీ సిట్టర్​​ అవతారమెత్తాడు. ఇంగ్లండ్​తో జరిగిన తొలి వన్డే మ్యాచ్​లో 66 పరుగుల తేడాతో భారత్​ విజయం సాధించింది. దీంతో టీమిండియా జట్టు​ విహారయాత్రకు పుణె బయలుదేరింది. తమ భార్యా, పిల్లలతో ఒక్క చోట చేరి సరదాగా సమయం గడిపారు. కాగా, ఈ ఫోటోలను టీమిండియా కోచ్​ రవిశాస్త్రి (Ravi Shastri) ట్విటర్​లో షేర్ చేశారు. “ఫలితాలెలా​ ఉన్నా సరే, మేం ఎల్లప్పుడూ కలిసి కట్టుగానే ఉంటాం. మంచి ఫలితాలు వస్తూనే ఉంటాయి. టీమిండియాతో ఒక అందమైన రోజు.” అంటూ జట్టుతో కలిసి దిగిన ఫోటోలను షేర్​ చేశాడు. కాగా, ఈ ఫోటోలు సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్​గా మారాయి. ఆయన షేర్​ చేసిన ఫోటోలను నిశితంగా పరిశీలిస్తే.. జట్టు సభ్యుల్లోని అందర్లో కెల్లా వెనకవైపు నిల్చున్న కేఎల్ రాహుల్ నెటిజన్ల దృష్టిని ఆకర్షించాడు. దీనికి కారణం.. కేఎల్​ రాహల్​ హార్దిక్​ పాండ్యా (Hardik Pandya) కొడుకు అగస్త్యను ఎత్తుకొని ఉండటమే. ఈ ఫోటోలు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటున్నాయి. దీనిపై నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్​ చేస్తున్నారు. కేఎల్ రాహుల్ పంత్ కంటే మంచి బేబీ సిటర్​గా ఉన్నాడంటూ కొంతమంది కామెంట్స్​ చేస్తున్నారు. రెండేళ్ల క్రితం ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా టీమిండియా వికెట్​ కీపర్​ రిషబ్​ పంత్​ (Rishabh Pant), ఆసీస్​ కెప్టెన్​ టిమ్ ఫైన్​ మధ్య జరిగిన ఆసక్తికర సంభాషణను ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు.

MCGలో జరిగిన బాక్సింగ్ డే టెస్ట్ సందర్భంగా పంత్ క్రీజులో ఖాళీగా ఉండటాన్ని చూసి.. ‘‘నేను నా భార్య సినిమాకు వెళ్లి చాలా రోజులైపోయింది. మా ఇంట్లో నువ్వు బేబీ సిట్టర్​గా ఉన్నావనుకో, మేమిద్దరం సినిమాకెళ్లి ఎంజాయ్​ చేస్తాం.”అంటూ ఫైన్​ పంత్​తో అన్నాడు. ఆ తర్వాత ఆసీస్​ ప్రధాని స్కాట్​ మారిసన్​ తన నివాసంలో ఆసీస్–టీమిండియా జట్లకు ఆత్మీయ విందు ఏర్పాటు చేయగా, పంత్​ నిజంగానే ఫైన్​ మాటల్ని నిజం చేసి చూపించాడు. ఫైన్​ భార్య బోని తన ఇద్దరు పిల్లల్ని అక్కడికి తీసుకురాగా.. వారిలో ఒకరిని పంత్​ ఎత్తుకొని ఫోటో దిగాడు. ఈ ఫోటోను ఫైన్​ భార్య బోని తన ఇన్​స్టాగ్రామ్​లో పోస్ట్​ చేస్తూ ‘పంత్ బెస్ట్​ బేబీ సిట్టర్​’ అంటూ కితాబిచ్చారు.










భారత వికెట్​ కీపర్లు మంచి బేబీ సిట్టర్లట!..
కెఎల్​ రాహుల్​ బేబీసిట్​ చేయడంపై నెటిజన్లు తలో రకంగా స్పందిస్తున్నారు. కొంతమంది నెటిజన్లు టీమిండియాకు కొత్త బేబీ సిట్టర్​ దొరికాడంటూ ఫన్నీగా కామెంట్స్ చేస్తుండగా.. మరికొంత మంది మాత్రం కెఎల్​ రాహుల్, పంత్​ మధ్య బెస్ట్​ వికెట్​ కీపర్​ స్థానం కోసమే కాదు.. బెస్ట్​ బేబీ సిట్టర్​ స్థానానికి కూడా గట్టి పోటీ నెలకొందంటూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్​గా ఉండే భారత మాజీ ఆటగాడు వసీం జాఫర్​ సైతం ఈ ఫోటోలపై స్పందించాడు. “బేబీ ఆగస్త్యను కేఎల్ రాహుల్​ ఎలా ఎత్తుకున్నాడో చూడండి!.. నిజం చెప్పాలంటే మన భారత వికెట్​ కీపర్లు మంచి, నమ్మకమైన బేబీ సిట్లర్లు.” అంటూ ఫన్నీగా స్పందించాడు.
Published by:Sridhar Reddy
First published: