గుత్తా జ్వాలతో యంగ్ హీరో డేటింగ్‌.. స్పష్టతనిచ్చిన నటుడు

గుత్తా జ్వాల.. ఇటీవల 'రాక్షసన్' చిత్రంతో సక్సెస్ అందుకున్న ఈ తమిళ హీరో విష్ణుతో డేటింగ్‌లో ఉన్నట్లు ఓ వార్త డిజిటల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. దీంతో ఈ వార్తలపై నటుడు విష్టు స్పష్టతను ఇచ్చాడు.

news18-telugu
Updated: June 7, 2019, 1:49 PM IST
గుత్తా జ్వాలతో యంగ్ హీరో డేటింగ్‌.. స్పష్టతనిచ్చిన నటుడు
గుత్త జ్వాల Photo: Instagram.com/jwalagutta1
  • Share this:
గుత్తా జ్వాల.. భారత బ్యాడ్మింటన్ డబుల్స్ ‌సూపర్ స్టార్.  ఆమె ఇటీవల 'రాక్షసన్' చిత్రంతో సక్సెస్ అందుకున్న తమిళ హీరో విష్ణుతో డేటింగ్‌లో ఉన్నట్లు ఓ వార్త డిజిటల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. దీనికి తోడుగా వీరిద్దరు కలిసి దిగిన ఓ  సెల్ఫీ కూడా ఈ వార్తకు బలం చేకూర్చుతోంది. వారీద్దరూ కలిసి దిగిన ఆ ఫోటో  సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంతో వీరిద్దరి మధ్య ఎఫైర్ నడుస్తుందనన్న వార్తలు  మరింత బలంగా వినిపిస్తున్నాయి. దీనికి తోడు విష్ణు కొంతకాలం క్రితం తన భార్యతో విడిపోవడంతో ఇప్పుడు గుత్తాజ్వాలాని పెళ్లి చేసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయంటూ కోలీవుడ్ మీడియాలో వార్తలు వెల్లువెత్తాయి. ఈ వార్తలపై తాజాగా క్లారిటీ ఇచ్చాడు తమిళ హీరో విష్ణు. ఆయన మాట్లాడుతూ.. తనకు జ్వాలా అంటే ఇష్టమని, ఆమెకి కూడా నేనంటే కూడా ఇష్టమని అని చెప్పాడు. దాదాపు ఏడాదిన్నరగా ఒకరికి ఒకరు తెలుసని, కామన్ స్నేహితులతో కలిసి కాలక్షేపం చేస్తుంటామని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం తమ మధ్య స్నేహం బంధం తప్ప మరే బంధము లేదని.. ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నామని తెలిపారు.

గతంలో గుత్తా జ్వాల, చేతన్ ఆనంద్ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. బ్యాడ్మింటన్ డబుల్స్ ఆటగాళ్లుగా విళ్ళీద్దరూ పలు అంతర్జాతీయ టోర్నీల్లో తమ అద్భుత ఆటతీరుతో ఆకట్టుకునేవారు. అయితే కొన్ని అభిప్రాయభేదాలు రావడంతో ఈ జంట విడిపోయింది. అప్పట్లో గుత్తా జ్వాలా, చేతన్ ఆనంద్ మధ్య వివాహ బంధం తెగిపోవడానికి టీమిండియా మాజీ క్రికెటర్ కూడా ఓ కారణమనే రూమర్స్  వచ్చిన సంగతి తెలిసిందే.
First published: June 7, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు