Home /News /sports /

ARCHER DEEPIKA KUMARI MAKES A BRILLIANT COMEBACK TO FINISH AT NO 4 AT THE HALFWAY MARK IN OLYMPICS 2020 SSR

Tokyo Olympics 2020: మొదలైన అత్యున్నత క్రీడా సమరం ఒలింపిక్స్‌.. ఆరంభంలోనే భారత ఆర్చర్ దీపికా కుమారి దూకుడు

టోక్యో ఒలింపిక్స్

టోక్యో ఒలింపిక్స్

ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న అత్యున్నత క్రీడా సమరం ఒలింపిక్స్ ఎట్టకేలకు అనేక ఆంక్షల మధ్య మొదలైంది. 2020లోనే జరగాల్సిన ఈ ప్రతిష్టాత్మక క్రీడా సంగ్రామం కరోనా కారణంగా 2021కి వాయిదా పడింది. ప్రతీసారి అభిమానుల కోలాహలం మధ్య సందడిగా జరిగే ఈ మెగా ఈవెంట్ ఈసారి అనేక ఆంక్షల మధ్య ఫ్యాన్స్ లేకుండానే మొదలైంది.

ఇంకా చదవండి ...
    టోక్యో: ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న అత్యున్నత క్రీడా సమరం ఒలింపిక్స్ ఎట్టకేలకు అనేక ఆంక్షల మధ్య మొదలైంది. 2020లోనే జరగాల్సిన ఈ ప్రతిష్టాత్మక క్రీడా సంగ్రామం కరోనా కారణంగా 2021కి వాయిదా పడింది. ప్రతీసారి అభిమానుల కోలాహలం మధ్య సందడిగా జరిగే ఈ మెగా ఈవెంట్ ఈసారి అనేక ఆంక్షల మధ్య ఫ్యాన్స్ లేకుండానే మొదలైంది. ఉదయం 5.30 గంటలకు ఆర్చరీలో మహిళల వ్యక్తిగత క్వాలిఫికేషన్ రౌండ్ మొదలైంది. ఇటీవల జరిగిన ఆర్చరీ ప్రపంచకప్‌లో సత్తా చాటిన ఆర్చర్ దీపికా కుమారి ఒలింపిక్స్‌లో తొలుత తడబడినా ఆరో సెట్‌లో 14వ స్థానం నుంచి 4వ స్థానానికి ఎగబాకి మంచి కమ్‌బ్యాక్ ఇచ్చింది.

    ఇదిలా ఉండగా.. మిక్స్‌డ్ టీమ్ క్వాలిఫికేషన్ రౌండ్‌లో అతాను దాస్, ప్రవీణ్ జాదవ్, తరుణ్ దీప్ భారత్ తరపున నిలిచారు. ఈ మిక్స్‌డ్ టీమ్ క్వాలిఫికేషన్ రౌండ్ ఉదయం 9.30 నుంచి మొదలుకానుంది. ఇక భారత స్టార్ బాక్సర్, ప్రపంచ నెంబర్ వన్ అమిత్ పంగల్‌కు తొలి రౌండ్‌లోనే బై లభించింది. గురువారం బాక్సింగ్ డ్రా వెల్లడించగా అతడితో పాటు సతీష్ కుమార్(+91 కేజీ), ఆశిష్ చౌదరి(75 కేజీ), మనీశ్ కౌశిక్(63 కేజీ)లకు బై లభించింది. మహిళా బాక్సర్లలో ల్వీనా బొర్గోహైన్(69 కేజీ)లకు, సిమ్రన్‌జిత్ కౌర్ (60కేజీ)లకు కూడా బై లభించింది.
    Published by:Sambasiva Reddy
    First published:

    Tags: Olympics, Tokyo Olympics

    తదుపరి వార్తలు