హోమ్ /వార్తలు /క్రీడలు /

Big News: బీసీసీఐ కొత్త ప్రెసిడెంట్ నియామకం..అధికారిక ప్రకటన వచ్చేసింది

Big News: బీసీసీఐ కొత్త ప్రెసిడెంట్ నియామకం..అధికారిక ప్రకటన వచ్చేసింది

Credit to: Twitter

Credit to: Twitter

అనుకున్నదే జరిగింది. బీసీసీఐ (BCCI) అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ స్థానంలో  రోజర్ బిన్నీని నియమిస్తూ ఎంజీఎంలో అధికారిక ప్రకటన చేశారు. అలాగే బీసీసీఐ సెక్రెటరీగా జై షా ను నియమించారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

అనుకున్నదే జరిగింది. బీసీసీఐ (BCCI) అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ  (Sourav Ganguly) స్థానంలో  రోజర్ బిన్నీని నియమిస్తూ ఎంజీఎంలో అధికారిక ప్రకటన చేశారు. అలాగే బీసీసీఐ సెక్రెటరీగా జై షా ను నియమించారు. కాగా బీసీసీఐ కొత్త ప్రెసిడెంట్ గా రోజర్ బిన్నీ బాధ్యతలు చేపట్టనున్నారు. అయితే ICC ఖాళీలకు నామినేషన్లు వేయడానికి చివరి తేదీ గురువారం. బీసీసీఐలో కుదిరిన ఏకాభిప్రాయం ప్రకారం బీసీసీఐ వైపు నుంచి ఈసారి ఎవరూ నామినేట్ చేయరు అని ప్రకటించారు.

Roger Binny appointed new BCCI president, to succeed Sourav Ganguly. Read more here. @SGanguly99 @BCCI #SouravGanguly #RogerBinny https://t.co/MuXlBkprV7

— The Telegraph (@ttindia) October 18, 2022

సౌరవ్ గంగూలీ (Sourav Ganguly) భవిష్యత్ లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. మరి ఐసీసీ చైర్మన్ గా గంగూలీ  (Sourav Ganguly) పేరును పరిశీలిస్తారా లేదా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే బీసీసీఐ అధ్యక్షునిగా అతనిపై పలు ప్రశ్నలు లేవనెత్తగా ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే మాత్రం అది అసంభవంగానే అనిపిస్తుంది.

IND vs PAK : ఆసియా కప్ విషయంలో పాక్ క్రికెట్ బోర్డుకు దిమ్మదిరిగే షాకిచ్చిన బీసీసీఐ..

గురువారం ఓ ప్రైవేట్ బ్యాంక్‌ కార్యక్రమానికి గెస్ట్‌గా అటెండ్ అయిన దాదా క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ ఎన్నికలపై నోరు విప్పినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం క్యాబ్‌ ప్రెసిడెంట్ పదవిలో సౌరవ్ గంగోపాధ్యాయ స్వయంగా CAB ప్రెసిడెంట్ పదవికి నిలబడుతున్నట్లు ప్రకటించారు.

Rohit Sharma: వెయిటింగ్.. రోహిత్ శర్మను ఊరిస్తున్న రికార్డులు.. రెండు సిక్సర్లు బాదితే..

ప్రతిపక్షాల వ్యూహమేంటో..

అక్టోబర్ 31న క్యాబ్ వార్షిక సాధారణ సమావేశం జరగనుంది. నామినేషన్ల సమర్పణకు చివరి తేదీ అక్టోబర్ 22. అప్పటికి బోర్డు వార్షిక సర్వసభ్య సమావేశం జరగనుంది. క్యాబ్ అధ్యక్ష పదవికి పోటీ చేయాలని సౌరవ్ నిర్ణయించుకున్నందున, ఆచరణాత్మకంగా ఆ పదవికి చేరుకున్న సౌరవ్ తాత స్నేహశీస్ గంగోపాధ్యాయ ఏ సీటులో పోటీ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. మరి ప్రతిపక్షాలు ఎలాంటి వ్యూహాన్ని అవలంబిస్తాయో చూడాలి.

ఇక గంగూలీని కావాలనే బీసీసీఐ ప్రెసిడెంట్ పదవి నుంచి తప్పిస్తున్నారనే వాదన కూడా వినిపిస్తోంది. గంగూలీని బీజేపీలో చేరాలని కోరగా దానికి దాదా ఒప్పుకోకపోవడంతో కుట్రపూరితంగానే ఇలా వ్యవహరిస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. జై షా సెక్రటరీగా కొనసాగడానికి లేని ఇబ్బంది.. దాదా మాత్రం బీసీసీఐ అధ్యక్షుడిగా ఉంటే వచ్చిందా అని మాజీ క్రికెటర్లు ప్రశ్నిస్తున్నారు.

First published:

Tags: Bcci