Home /News /sports /

AP CM ANNOUNCED CASH REWARD TO PV SINDHU WHO WON BRONZE MEDAL IN TOKYO OLYMPICS HOW MUCH THEY ARE OFFERING JNK

PV Sindhu: పీవీ సింధుకు నగదు పురస్కారం అందించాలని సీఎం జగన్ ఆదేశాలు.. ఎంత ఇస్తున్నారో తెలుసా?

పీవీ సింధుకు ఏపీ ప్రభుత్వం ఎంత నగదు పురస్కారం అందించనున్నది (File Photo)

పీవీ సింధుకు ఏపీ ప్రభుత్వం ఎంత నగదు పురస్కారం అందించనున్నది (File Photo)

పీవీ సింధుకు నగదు పురస్కారం అందించాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇంతకు సింధుకు ఎంత ఇవ్వబోతున్నారో తెలుసా?

    టోక్యో ఒలింపిక్స్ (Tokyo Olympics) 2020లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు (PV Sindhu) మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో (Badminton Singles) కాంస్య పతకం (Bronze Medal) సాధించిన విషయం తెలిసిందే. దేశానికి వరుసగా రెండో ఒలింపిక్స్‌లో పతకం తెచ్చిన సింధుకు దేశవ్యాప్తంగా ప్రశంశలు అందుతున్నాయి. ప్రధాని మోడీ నుంచి సామాన్యుడి వరకు పీవీ సింధు ఘనతను పొగుడుతున్నారు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగిని అయని పీవీ సింధును ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) కూడా అభినందనలు తెలిపారు. మరోవైపు పీవీ సింధుకు నగదు ప్రోత్సాహకాలు వెంటనే అందించాలని ఆదేశాలు జారీ చేశారు. రెండు ఒలింపిక్ పతకాలు గెలిచిన తొలి భారత మహిళా అథ్లెట్‌గా రికార్డులు సృష్టించిన సింధుకు వెంటనే ఆ నగదును అందించాలని అధికారులను ఆదేశించారు. సింధు మన దేశ భవిష్యత్ తరాలకు స్పూర్తిదాయకం అని జగన్ అన్నారు. ఏపీ ప్రభుత్వం రాష్ట్రానికి చెంిన క్రీడాకారులందరికీ తగిన ప్రోత్సాహకాలు అందిస్తుందని సీఎం చెప్పుకొచ్చారు. క్రీడలను ప్రోత్సాహించడానికి ఒక పాలసీని గతంలోనే జారీ చేసినట్లు ఆయన్ వెల్లడించారు.

    ఏపీ ప్రభుత్వం 2019లో అధికారంలోకి రాగా.. వెంటనే క్రీడాకారులకు ప్రోత్సాహకాలు ప్రకటించింది. 2014 నుంచి జాతీయ సీనియర్, జూనియర్, సబ్ జూనియర్ స్థాయిలో పతకాలు తెచ్చిన ప్రతీ క్రీడాకారులకు నగదు పురస్కారాన్ని ఇచ్చింది. మరోవైపు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటిన క్రీడాకారులకు కూడా స్పోర్ట్స్ పాలసీ ప్రకారం నగదు పురస్కారం అందించాలని అప్పుడే సీఎం జగన్ ఆదేశించారు. 2017-22 స్పోర్ట్స్ పాలసీ ప్రకారమే క్రీడాకారులకు నగదు పురస్కారాలను అందించనున్నారు.





    పీవీ సింధు ఒలింపిక్స్ 2020కి వెళ్లే ముందే ఏపీ ప్రభుత్వం రూ. 5 లక్షల నగదును సహాయంగా అందించింది. బ్యాడ్మింటన్ ప్లేయర్ స్వాతిక్‌సాయిరాజ్ రాంకీ రెడ్డితో పాటు హాకీ క్రీడాకారిణి రజనికి కూడా రూ. 5 లక్షలు అందించారు. గతంలోనే పీవీ సింధుకు ఏపీ ప్రభుత్వం విశాఖపట్నంలో 2 ఎకరాల స్థలాన్ని అకాడమీ కోసం కేటాయించింది. తాజాగా సింధుకు స్పోర్ట్స్ పాలసీ ప్రకారం రూ. 30 లక్షల నగదును ఇవ్వనున్నది. ఆ పాలసీ ప్రకారం ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధిస్తే రూ. 75 లక్షలు, రజత పతకం సాధించడం రూ. 50 లక్షలు, కాంస్య పతకం సాధిస్తే రూ.30 లక్షలు అందించాలని నిర్ణయించారు.
    Published by:John Naveen Kora
    First published:

    Tags: Badminton, Olympics, Pv sindhu, Tokyo Olympics, Ys jagan mohan reddy

    తదుపరి వార్తలు