అందరి ముందే కోహ్లిని ప్రేమగా ముద్దాడిని అనుష్క.. వీడియో వైరల్..

Anushka-kOHLIచూసేందుకు క్యూట్‌గా ఉన్న ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానం పేరును అరుణ్ జైట్లీ మైదానంగా మారుస్తూ ఢిల్లీ&డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్(DDCA) ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వీరిద్దరు ఇలా కెమెరాలకు చిక్కారు.

news18-telugu
Updated: September 13, 2019, 3:18 PM IST
అందరి ముందే కోహ్లిని ప్రేమగా ముద్దాడిని అనుష్క.. వీడియో వైరల్..
విరాట్ కోహ్లీ- అనుష్క శర్మ ( Virat kohli / Twitter )
  • Share this:
అనుష్క-విరాట్ కోహ్లి జంటకు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ఇద్దరు ఎక్కడ కనిపించినా..కెమెరాలన్నీ వారి మీదే ఫోకస్ అవుతాయి.తాజాగా వీరిద్దరికి సంబంధించిన ఓ వీడియో కెమెరాలకు చిక్కింది. అనుష్క-కోహ్లి జంట నిజ జీవితంలో ఎంత ప్రేమగా ఉంటారో ఈ వీడియో చూస్తే అర్థమవుతోంది. చేతిలో చెయ్యి వేసుకుని పక్కపక్కన కూర్చున్న సమయంలో.. విరాట్ చేతిని అనుష్క ముద్దాడింది. కోహ్లి కూడా ప్రేమతో ఆమె చేతిని నిమిరాడు. చూసేందుకు క్యూట్‌గా ఉన్న ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానం పేరును అరుణ్ జైట్లీ మైదానంగా మారుస్తూ ఢిల్లీ&డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్(DDCA) ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వీరిద్దరు ఇలా కెమెరాలకు చిక్కారు. ఈ కార్యక్రమంలో
మాజీ కేంద్ర క్రీడా శాఖ మంత్రి రాజ్యవర్ధన్ సింగ రాథోడ్, ఢిల్లీ బీజేపీ చీఫ్ మనోజ్ తివారీ,మాజీ ఇండియన్ కెప్టెన్ కపిల్ దేవ్ పాల్గొన్నారు.


Published by: Srinivas Mittapalli
First published: September 13, 2019, 3:16 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading