Vamikaకు ఊపీరి అడనివ్వవా.. అనుష్క పనికి నెటిజన్స్ ఫైర్!

_Anushka Sharma, Virat Kohli ,England, Vamikas face

విరాట్ కోహ్లి, అనుష్క శ‌ర్మ త‌మ కూతురు వామిక‌తో క‌లిసి ఎయిర్‌పోర్ట్ ద‌గ్గర ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

  • Share this:


    ఇంగ్లాండ్ టూర్ కోసం భారత మహిళల, పురుషుల క్రికెట్‌ జట్లు ఇంగ్లాండ్‌ బయల్దేరాయి. విరాట్‌ కోహ్లీ, మిథాలీ సేనలు ప్రత్యేక ఛార్టర్‌ విమానంలో ముంబై నుంచి పయనమయ్యారు. కోహ్లి సేన న్యూజిలాండ్‌తో జూన్‌ 18న ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ ఆడనుంది. ఈ టూర్‌లో భాగంగా విరాట్ కోహ్లి తన భార్య అనుష్క శర్మ కూతురుతో కలిసి ఫ్లైట్ ఎక్కేశారు. ఈ క్రమంలో ఫోటో గ్రాఫర్స్ కోహ్లీ కూతుర్ని తమ కెమారాలలో బంధించడం కోసం శతావిధాలుగా ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో అనుష్క తన కూతురు కనిపించకుండా జాగ్రత్త పడిన తీరును కొందరూ తప్పుపట్టగా మరికొందరు ఫొటోజర్నలిస్టుల తీరుపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు.



    విరాట్ కోహ్లి, అనుష్క శ‌ర్మ త‌మ కూతురు వామిక‌తో క‌లిసి ఎయిర్‌పోర్ట్ ద‌గ్గర ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. ఈ సమయంలో ఫొటోలలో తన బిడ్డ ముఖం పడకుండా వామికా ముఖాన్ని గట్టిగా అదిమిపట్టుకుంది అనుష్క. దీంతో అనుష్కపై కొందరూ మండిపడ్డారు.. బిడ్డకు ఊపిరి స‌డ‌ల‌నివ్వావా అంటూ కామెంట్లు పెడుతున్నారు.




    తాజాగా తమ కూతురి విషయంలో విరుష్క జంట ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్ ‘ఆస్క్ మీ’ సెషన్​లో తన నిర్ణయాన్ని చెప్పారు. సామజిక మాధ్యమాల గురించి వివరంగా తెలుసుకునే వరకు మా బిడ్డను సోషల్ మీడియాకు దూరంగా ఉంచాలని నిర్ణయించుకున్నాం”అని చెప్పాడు. గతంలోనూ తమ కూతురికి ప్రైవసీకి భంగం కలిగించవద్దని.. అనవసరంగా ఫోటోలు తీయవద్దంటూ ఫొటో జర్నలిస్టులు విన్నవించారు.
    Published by:Rekulapally Saichand
    First published: