కోహ్లి ఇలాంటి పనులు కూడా చేస్తాడా!.. చూసి నవ్వుకున్న అనుష్క

Virat Kohli

ఇండియన్ టాప్ సెలబ్రెటీ జంట టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, హీరోయిన్‌ అనుష్క శర్మ. వారి ఏం చేసిన.. ఏం తిన్నా  అది టాప్ వార్తగానే నిలుస్తుంది. ఈ జంట సోషల్‌ మీడియాలో చేసే హడావుడి కూడా మాములుగా ఉండదు.

 • Share this:


  ఇండియన్ టాప్ సెలబ్రెటీ జంట టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, హీరోయిన్‌ అనుష్క శర్మ. వారి ఏం చేసిన.. ఏం తిన్నా  అది టాప్ వార్తగానే నిలుస్తుంది. ఈ జంట సోషల్‌ మీడియాలో చేసే హడావుడి కూడా మాములుగా ఉండదు. వారు ఏం చేస్తున్న.. ఎక్కడ ఉన్న.. దానికి సంబంధించిన విశేషాలను సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులతో పంచుకుంటారు. తాజాగా విరాట్‌ తన షూని శుభ్రం చేస్తున్న ఫోటోను అనుష్క షేర్‌ చేశారు. ఆసీస్ పర్యటనకు సిద్దమవుతున్న కోహ్లీ తన షూని శ్రద్ధగా క్లీన్ చేసుకుంటూ ఆ ఫోటోలో కనిపించాడు. " మట్టితో ఉన్న షూని ఎంతో శ్రద్ధగా విరాట్ క్లీన్‌ చేస్తున్నాడో" అనే క్యాప్షన్‌తో ఆ ఫోటో తన ఇన్‌స్ట్రా స్టోరీస్‌లో ఆ ఫోటోను షేరు చేసింది.

  Virat Kohli prepping for his Australian Tour.

  ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్న ఈ జంట హోటల్ గదిలో సరాదగా గడుపుతున్నారు. కోహ్లి అక్కడ నుంచి ఆస్ట్రేలియా టూర్‌కు బయలుదేరారు. గర్భవతిగా ఉన్న అనుష్కకు ప్రసవ సమయంలో ఆమెకు తోడుగా ఉండాలకున్న కోహ్లి టూర్ చివరిలో ఇండియా తిరిగిరానున్నారు. ఆసీస్‌తో తొలి టెస్ట్ ముగిశాక అతను స్వదేశానికి పయనమవుతాడు. ఆమెకు జనవరిలో డెలివరీ టైం ఉంది. ఈ సమయంలో అనుష్క పక్కనే ఉండాలని భావించిన కోహ్లి ఆసీస్ పర్యటన మధ్యలోనే ఇండియాకు తిరిగి రానున్నారు. కోహ్లి నిర్ణయంపై భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) కూడా అంగీకారం తెలిపింది. స్వదేశానికి తిరిగి వచ్చేందుకు కోహ్లికి అనుమతి ఇచ్చింది.

  అయితే విరాట్ పితృత్వ సెలవులపై నెటిజన్స్ రకారకాల స్పందిస్తున్నారు. " విరాట్ తన ఆనందకరమైన క్షణాలను గడపడం కోసం ఇండియాకు తిరిగి రావడం ఆహ్వానించదగిందే!. పుట్టబోయే బిడ్డ కోసం ఆస్ట్రేలియాతో జరిగే మెుదటి టెస్ట్ తర్వాత స్వదేశానికి తిరిగివస్తాడు. ఆధునిక ఆటగాడిగా వృత్తి కంటే వ్యక్తిగతమైన జీవితానికి ప్రధాన్యం ఇస్తున్నాడు. అయితే అతని నిష్క్రరమణ తర్వాత భారత జట్టుకు పర్యటన కొంత కఠినతరం కావచ్చు" అంటూ కామెంట్ చేస్తున్నారు.
  Published by:Rekulapally Saichand
  First published: