• HOME
  • »
  • NEWS
  • »
  • SPORTS
  • »
  • ANUSHKA SHARMA REPLY ON THE ROHIT SHARMA HAS UNFOLLOWED HER MK

రోహిత్, కోహ్లీ వివాదానికి అనుష్కా శర్మ ఫుల్ స్టాప్...

రోహిత్, కోహ్లీ వివాదానికి అనుష్కా శర్మ ఫుల్ స్టాప్...

విరాట్ కొహ్లీ, అనుష్క శర్మ ( Anushka Sharma/ Twitter )

తప్పుడు ప్రచారం ఎంత చేసినా నిజం మాత్రమే నిశ్శబ్దంతో షేక్ హ్యాండ్ ఇస్తుందని ట్వీట్ చేసి తమ కుటుంబాల మధ్య ఎలాంటి విభేదాలు లేవని తేల్చి చెప్పింది.

  • Share this:
    రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మధ్య జరగుతున్న కోల్డ్ వార్‌కు కోహ్లీ భార్య అనుష్కశర్మ ఫుల్ స్టాప్ పెట్టింది. ట్విట్టర్ వేదికగా చిన్న ట్వీట్ చేసి సరిపెట్టింది. తప్పుడు ప్రచారం ఎంత చేసినా నిజం మాత్రమే నిశ్శబ్దంతో షేక్ హ్యాండ్ ఇస్తుందని ట్వీట్ చేసి తమ కుటుంబాల మధ్య ఎలాంటి విభేదాలు లేవని తేల్చి చెప్పింది. ఇదిలా ఉంటే నెటిజన్లు మాత్రం సోషల్ మీడియాలో కామెంట్ల యుద్ధం కొనసాగిస్తున్నారు. అయితే కోహ్లీ, రోహిత్ మధ్య నిజంగానే పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేదాకా కోల్డ్ వార్ వెళ్లిందా లేదా, అనే విషయం మాత్రం తేలాల్సి ఉంది. ఇదిలా ఉంటే అనుష్క శర్మ ఇన్‌స్టాగ్రామ్‌ను రోహిత్ శర్మ అన్‌ఫాలో చేయడంతో అసలు కథ మొదలు కాగా, అందుకు ప్రతిగా రోహిత్, ఇంకా అతడి భార్య రితిక ఇన్ స్టా గ్రామ్ అకౌంట్లను సైతం అనుష్క శర్మ అన్‌ఫాలో చేసింది. దీంతో వీరిరువురి మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటోందనే వార్తలు షికారు చేస్తున్నాయి.
    First published:

    అగ్ర కథనాలు