బీసీసీఐలో దుమారం రేపుతోన్న అనుష్క శర్మ ‘టీ కప్’

వరల్డ్ కప్ మ్యాచ్‌లు చూసేందుకు వెళ్లిన అనుష్కకు టీమిండియా సెలక్టర్లు టీలు సరఫరా చేశారంటూ మాజీ క్రికెటర్ ఆరోపించారు.

news18-telugu
Updated: October 31, 2019, 10:35 PM IST
బీసీసీఐలో దుమారం రేపుతోన్న అనుష్క శర్మ ‘టీ కప్’
భర్త విరాట్ కోహ్లీతో అనుష్క శర్మ (Instagram/Photo)
  • Share this:
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మకు సెలక్టర్లు టీ సరఫరా చేస్తుండగా తాను చూశారంటూ ఫరోక్ ఇంజినీర్ చేసిన వ్యాఖ్యలు బీసీసీఐలో దుమారం రేపుతున్నాయి. ఇంగ్లండ్‌లో జరిగిన వరల్డ్‌కప్ మ్యాచ్‌లకు అనుష్క కూడా వెళ్లింది. అయితే, ఆ సందర్బంగా బీసీసీఐ సెలక్టర్ అనుష్కశర్మకు టీ తీసుకెళ్లి ఇవ్వడం తాను చూశానని భారత మాజీ క్రికెటర్ ఫారోక్ ఇంజినీర్ దుమారం రేపారు. అయితే ఫారోక్ ఇంజినీర్ వ్యాఖ్యలకు అనుష్క శర్మ కౌంటర్ ఇచ్చారు. తన ట్విట్టర్ ఖాతాలో ఓ భారీ లేఖను పోస్ట్ చేశారు. ‘మీకో విషయం చెబుతా. నేను అసలు కాఫీనే తాగను.’ అని అనుష్క శర్మ ట్వీట్ చేసిన లేఖలో పేర్కొన్నారు.

టీమిండియా ఆడే కొన్ని మ్యాచ్‌లకు విరాట్ కోహ్లీ భార్య అనుష్క కూడా హాజరవుతూ ఉంటుంది. ఓసారి టీమ్ ఎంపిక సమావేశాలకు కూడా హాజరైనట్టు ప్రచారం జరిగింది. టీమిండియాతోపాటు ఆమె టూర్లకు వెళ్తే బీసీసీఐనే ఆమె రవాణా ఖర్చులు భరిస్తోందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఓసారి టీమిండియా ఫొటోలో కూడా ఆమె కనిపించడం దుమారం రేపింది. బీసీసీఐలో అనుష్క వ్యవహారం ఎప్పుడూ హాట్ టాపిక్‌గానే ఉంది. తాజాగా తన మీద మరోసారి విమర్శలు రావడంతో అన్నింటికీ ఆమె కౌంటర్ ఇచ్చింది.First published: October 31, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు