Home /News /sports /

ANUSHKA SHARMA HEARTFELT MESSAGE ON VIRAT KOHLIS STEP DOWN AS TEAM INDIA TEST SKIPPER SRD

Virushka : టెస్ట్ కెప్టెన్సీ విరాట్ కోహ్లీ గుడ్ బై.. ధోనీ మాటల్ని గుర్తు చేసుకున్న అనుష్క శర్మ..

Virushka

Virushka

Virushka : విరాట్ కోహ్లీ టెస్ట్ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో ఫ్యాన్స్ ఒక్కసారిగా నిరాశ చెందారు. ఫ్యాన్స్ తో పాటు మాజీ క్రికెటర్లు కూడా షాక్ కు గురయ్యారు. లేటెస్ట్ గా అనుష్క శర్మ.. కోహ్లీ రిటైర్ సందర్భంగా అప్పట్లో ధోనీ అన్న మాటల్ని గుర్తు చేసుకుంది.

ఇంకా చదవండి ...
  విరాట్ కోహ్లీ (Virat Kohli) ఈ పేరు గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. గత దశాబ్ద కాలంగా కోట్లాది మంది భారత క్రికెట్ అభిమానుల గుండెచప్పుడుగా మారిన విరాట్ కోహ్లీ ఇప్పుడు ఫ్యాన్స్ కు షాకుల మీద షాకులు ఇస్తున్నాడు. ఈ శతాబ్దపు అత్యుత్తమ బ్యాటర్లలో ఒకరైన విరాట్ కోహ్లీ ఇప్పుడు టెస్ట్ కెప్టెన్సీకి గుడ్ బై చెప్పాడు. దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్​లో ఓటమి అనంతరం టీమ్​ఇండియా (Team India) టెస్టు సారథి విరాట్​ కోహ్లీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. టెస్టు సారథిగా తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. విరాట్ కోహ్లీ నిర్ణయంతో.. చాలా మంది క్రికెట్ ఫ్యాన్స్ నిరాశ చెందారు. అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లు కూడా షాక్ కు గురయ్యారు. ఈ క్రమంలోనే విరాట్‌ భార్య, బాలీవుడ్‌ హీరోయిన్‌ అనుష్క శర్మ (Anushka Sharma) తన ఇన్‌స్టాలో టెస్ట్‌ కెప్టెన్సీ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించిన విరాట్‌పై ఎమోషనల్‌గా సుధీర్ఘమైన పోస్ట్‌ చేసింది.

  " 2014లో ఎమ్మెస్ ధోనీ టెస్టు క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకోవడంతో టెస్టు కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్నట్టు నువ్వు చెప్పిన రోజు, నాకు ఇప్పటికీ గుర్తింది. ఆ రోజు ఎమ్మెస్ ధోనీ, నువ్వు, నేను కలిసి కాసేపు మాట్లాడుకున్నాం. నీ గడ్డం త్వరలోనే రంగు మారుతుందని ఎమ్మెస్ ధోనీ జోక్ చేశాడు. అప్పుడు అందరూ నవ్వుకున్నాం. ఆ రోజు నుంచి నీ గడ్డం రంగు మారడం నేను గమనిస్తూనే ఉన్నాను. నీలో చాలా మార్పు చూశాను. ఊహించనంత వృద్ధి చూశాను. నీ చుట్టూ, నీలో కూడా మార్పు వచ్చింది.

  భారత క్రికెట్ జట్టు కెప్టెన్‌గా నువ్వు సాధించినదానికి నేను ఎంతగానో గర్వపడుతున్నాను. నీ నాయకత్వంలో భారత జట్టు ఎన్నో అద్భుత విజయాలను సాధించింది. నీలో వచ్చిన మార్పులకు కూడా నేనె ఎంతగానో గర్విస్తున్నా. 2014లో మనం చాలా చిన్నపిల్లలం, అమాయకులం. ప్రతిదీ మన మంచికేనని అనుకున్నాం, ప్రతిదాంట్లోనూ పాజిటివ్‌ని వెతుక్కున్నాం. కానీ ఈ ప్రయాణంలో నువ్వు ఎన్నో ఛాలెంజ్‌లు ఎదుర్కొన్నావు. మన కూతురు, ఈ ఏడేళ్లల్లో నువ్వు నేర్చుకున్న ప్రతీ విషయాన్ని చూస్తుంది... నువ్వు మంచే చేశావ్..." అంటూ భావోద్వేగంగా సుదీర్ఘ లేఖను సోషల్ మీడియాలో షేర్ చేసింది అనుష్క శర్మ.  నిజానికి భార‌త కెప్టెన్సీ మార్పు విష‌యం 2021 వ‌ర‌ల్డ్ టెస్ట్ ఛాంపియ‌న్‌షిప్ ఫైన‌ల్ మ్యాచ్ ఓట‌మి అనంత‌ర‌మే తెర‌పైకి వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. ఆ ఫైన‌ల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో భార‌త జ‌ట్టు ఓట‌మి పాలైన సంగ‌తి తెలిసిందే. దీంతో సెలెక్ట‌ర్లు కోహ్లీ కెప్టెన్సీపై కాస్త అసంతృప్తి వ్య‌క్తం చేసిన‌ట్లు స‌మాచారం. దీంతో అప్పుడే కెప్టెన్సీ మార్పున‌కు పునాదులు ప‌డ్డాయ‌ని తెలుస్తోంది.

  హెడ్ కోచ్‌గా ర‌వి శాస్త్రి ప‌ద‌వి కాలం ముగిసి పోవ‌డంతోనే కెప్టెన్‌గా కోహ్లీ టైమ్ కూడా అయిపోయింద‌ని చెప్పుకోవాలి. అగ్రెసివ్ కెప్టెన్ అయినా కోహ్లీకి, కూల్ వ్య‌క్తి అయినా కొత్త కోచ్ రాహుల్ ద్రావిడ్‌కు మ‌ధ్య స‌ఖ్య‌త కుద‌ర‌లేద‌ని తెలుస్తోంది.

  ఇది కూడా చదవండి : లేటు వయసులో ఘాటు ప్రేమ.. యువీ మాజీ ప్రేయసితో లియాండర్ పేస్ షికార్లు..

  దీనికి తోడు జ‌ట్టులోని కొంద‌రు ఆట‌గాళ్లు కోహ్లీ తీరుపై బీసీసీఐతోపాటు హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్‌కు ఫిర్యాదు చేశార‌ని స‌మాచారం. దీంతో కెప్టెన్ అయిన‌ప్ప‌టికీ కోహ్లీ నిర్ణ‌యాల‌ను మేనేజ్‌మెంట్ ప‌ట్టించుకోకుండా జ‌ట్టులో త‌మ నిర్ణ‌యాల‌నే అమ‌లు చేసిందట‌. దీంతో తీవ్ర మ‌నో వేద‌న‌కు గురైన విరాట్ కోహ్లీ కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పాడ‌ని స‌మాచారం. అదిగాక, సౌతాఫ్రికా టూర్ ముందు గంగూలీ వ్యాఖ్యలకు కోహ్లీ కౌంటరిచ్చిన సంగతి తెలిసిందే.
  Published by:Sridhar Reddy
  First published:

  Tags: Anushka Sharma, Cricket, Sports, Team India, Virat kohli

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు